Intinti Gruhalakshmi 19 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 19-September-2022 ఎపిసోడ్ 741 ముందుగా మీ కోసం. లాస్య నందు ని ప్రశ్నిస్తుంది, తులసీ అని పిలిచావు ఏంటి అని, సరే కాని రెడీ అవ్వు ఆఫీస్ కి వెళదాం అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత నందు ఆలోచిస్తూ ఉంటాడు, సామ్రాట్ కి ఫోన్ చెయ్యనా వద్ద ఎలా, ఇప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవడం ఏలా అని ఆలోచిస్తూ, అభికి ఫోన్ చేస్తాడు. మీ అమ్మ ఏం చేస్తుంది అని అడుగుతాడు. బయట వెయిట్ చేస్తుంది అని చెప్పడంతో, ఏంటి డాడీ అలా అడుగుతున్నారు అని అభి అంటాడు, ఏంలేదు బిజినెస్ మీటింగ్ గురించి ఇంకా రాలేదు ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదని అడిగాను అని చెపుతాడు. తర్వాత సామ్రాట్ తులసికి ఫోన్ చేసి సారీ అండీ బిజినెస్ ఫోన్ మాట్లాడుతూ, లేటైంది వస్తున్నాను అని అనే లోపు అక్కడికి హనీ వచ్చి.
నాన్నా నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయండి అని అనడంతో, తులసి ఆ మాటలు విని హనిని డ్రాప్ చేసాకే రండి, ఏం పర్వాలేదు అని చెప్పడంతో, అలాగే అని సామ్రాట్ హని ఇద్దరూ బయలుదేరుతూ ఉంటారు. సరదాగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, వెళతారు కారులో అప్పుడు హాని నాన్న స్పీడుగా పోనివ్వు అని అనడంతో, సామ్రాట్ స్పీడుగా పోనీస్తాడు కానీ, సడన్గా బ్రేక్ పడవు, ఒక చెట్టుకు వెళ్లి, ఢీకొట్టుకొని యాక్సిడెంట్ అవుతుంది, ఇంతలో తులసికి ఫోన్ వస్తుంది యాక్సిడెంట్ అయ్యింది ఆస్పత్రిలో చేర్పించామని, నందూకి కూడా ఫోన్ వస్తుంది, దాంతో నందు, లాస్య కూడా వెళతారు చూడడానికి ఆసుపత్రికి, సామ్రాట్ ప్రమాదం నుంచి బయటపడతాడు చిన్న చిన్న గాయాలతో, సామ్రాట్ స్పృహలోకి వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటాడు హని ఎక్కడ అని, సామ్రాట్ వాళ్ల బాబాయ్ ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుంది అనడంతో.
Intinti Gruhalakshmi 19 September Today Episode : యాక్సిడెంట్ కి గురైన హని, సామ్రాట్

నేను అర్జెంటుగా చూడాలి అని గట్టిగా అరుస్తూ వెళ్లిపోతాడు పాప దగ్గరికి, హని పరిస్థితిని చూసి, సామ్రాట్ ఏడుస్తూ, బాబాయ్ హనీ కళ్లు తెరవడం లేదు, ఒకసారి నాతో మాట్లాడమని చెప్పు అని ఏడుస్తూ ఉంటాడు, తులసి కూడా ఓదారుస్తుంది హనికి ఏం కాదు సామ్రాట్ గారు అని, సామ్రాట్ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే నర్స్ వచ్చి ఏమీ కాలేదు, చెయ్యి బెణికింది, కట్టు కడతాము, కాస్త జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది, మీరు టెన్షన్ పడకండి డిశ్చార్జ్ చేస్తాం కళ్లు తెరవగానే అని చెప్పడంతో సంతోషపడతారు. అందరూ హనీని చూడడానికి హని దగ్గరికి వెళతారు, సామ్రాట్ హని తో ఇలా అంటూ ఉంటాడు, నా వల్లే కదా ఈ పరిస్థితి నన్ను క్షమించమని, ఇలా కొద్దిసేపు మాట్లాడుతూ, బాధపడుతూ ఉండగా, లాస్య, తులసి, నందు ఇలా అందరూ ధైర్యంగా ఉండాలి సార్ మీరే ఇలా అంటే ఎలా అని అందరూ సామ్రాట్కి నచ్చచెబుతూ, ఓదారుస్తూ, ఉంటారు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.