Intinti Gruhalakshmi 2 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 2-September-2022 ఎపిసోడ్ 727 ముందుగా మీ కోసం. నందు, లాస్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నందు, లాస్యతో అంటాడు, గొడవ చేసింది అభి, అయితే నన్ను అంటారు ఏంటి అని అంటూ వుండగా, లాస్య మనసులో అసలు అభి ని రెచ్చగొట్టింది నేను, ప్లానంతా ఫెయిల్ అయ్యింది అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడేం చేద్దాం అని అంటే, తులసి విషయంలో దూరంగా ఉంటాను అని అంటాడు నందు.అది కుదరదు, అలా అవ్వాలి అంటే, నువ్వు పిల్లలు, ఇంట్లో వాళ్లందరితో బంధం తెంచుకోవాలి అది కుదురుతుందా అని అంటుంది లాస్య. అదెలా కుదురుతుందని నందు అంటాడు. ఇలా కొద్దిసేపు లాస్య, నందు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తులసి అత్తయ్య, మామయ్య, తులసి, ముగ్గురు కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు.
Intinti Gruhalakshmi 2 September Today Episode : చేసిన తప్పును ఒప్పుకోను అన్న నందు.
అప్పుడు తులసి అత్తయ్య తులసిని అడుగుతుంది, ఏం చేయబోతున్నావు అని, చేసిన తప్పుకు క్షమాపణ అడుగుదామనుకుంటున్నాను అని అంటుంది.జరిగిన దాంట్లో నీ తప్పులేదు, జరిగింది చెప్పమ్మా తప్పకుండా అర్థం చేసుకుంటాడు అని అంటారు తులసి అత్తమామలు. ఇంతలో అభి వచ్చి, ఎవరు ఏమైనా పర్లేదు అని అనుకుంటే, అది స్వార్థం అవుతుంది అని వెటకారంగా మాట్లాడతాడు. అప్పుడు అంకిత వచ్చి, చప్పట్లు కొడుతూ, స్వార్థం గురించి నువ్వు మాట్లాడితే నవ్వొస్తుంది, నువ్వు మాట్లాడ్డమేంటి అని ఉంటుంది. ఇంట్లోవాళ్లందరూ అభిని ప్రశ్నిస్తారు. తర్వాత ఇంట్లో వాళ్లందరూ నిజం చెప్పమని అంటారు సామ్రాట్కి, నందు చెప్పొద్దని మాట తీసుకున్న విషయం గురించి, అది చెప్పాల్సింది మీ అబ్బాయి, నేను కాదు అని,ఇప్పుడు నిజం దాచి, నేను దోషిగా మిగిలిపోయాను అని, తులసి అంటుంది.

నందు వాళ్ల అమ్మ, నందుకి ఫోన్ చేసి ఈ అమ్మ మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా, నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకోమని అడుగుతుంది. నువ్వే తులసిని నిజం చెప్పకుండా ఆపావని చెప్పమని అడుగుతుంది. నేను చెప్పను అమ్మ, అయినా ఇప్పుడు ఆలోచించాల్సింది కొడుకు గురించి, కోడలి గురించి కాదు, అని స్వార్థంగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. తరువాత అంకిత అభిని నిలదీస్తూ ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చి తప్పు చేశాను. అక్కడే వుంటే నీ వల్ల ఇంట్లోవాళ్లు బాధపడేవాళ్లు కాదని, అభి గురించి మాట్లాడుతూ ఉంటుంది.ఈ ఆలోచన విధానాన్ని చూస్తే నాకు భయమేస్తుంది. కన్నతల్లినే గౌరవించని వాడివి, కట్టుకున్న పెళ్ళాన్ని గౌరవిస్తావని నమ్మకం ఏంటి అని, నీ మనసు పొల్యూట్ అయ్యింది అని, అందరికీ తప్పుగా అనిపించనప్పుడు, నీకెందుకు తప్పుగా అనిపిస్తుంది అని ప్రశ్నిస్తోంది.నువ్వు ఏ తప్పు చేయలేదు అని నమ్మాలి అంటే, అంకుల్ దగ్గరికి వెళ్లి, తనే నిజం దాచిపెట్టమని అన్న విషయం, సామ్రాట్ గారికి చెప్పమని కన్వీన్స్ చేయి అని అంటుంది అంకిత.తరువాత తుల