Karthika Deepam 2 September Today Episode : కార్తీక్ కు గతమంతా గుర్తు చేస్తున్న దీప… నువ్వు ఏమి చేయలేవు అంటున్న మోనిత…

Karthika Deepam 2 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. ఈరోజు ఈ సీరియల్ తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1447 హైలైట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దీప కార్తీక్ దగ్గరికి వెళ్తుండగా డాక్టర్ అన్నయ్య పెద్దావిడ బాధపడుతూ అదేదో ఇక్కడే ఉండి చేయొచ్చు కదా అమ్మ అని అంటారు. అప్పుడు దీప తప్పదు అన్నయ్య వెళ్లాలి అని అంటుంది. అది డాక్టర్ బాబు బ్రతికే ఉందని నాకు తెలిసిందని అది వేరే ఊరు తీసుకెళ్లిన తీసుకెళ్తుంది. ఆ నరకం నుండి నా భర్తని బయటపడేయాలి అన్నయ్య అని అంటుంది. పెద్దావిడ వెళ్లి తల్లి సంతోషంగా వెళ్ళు అమ్మ మమ్మల్ని మర్చిపోకమ్మ నీ భర్త దగ్గరయ్యాక సంతోషమైన వార్త నాకు చెప్పమ్మా అని పెద్దావిడ, అది అసలే రాక్షసి అంటున్నావు జాగ్రత్త అమ్మ అని అంటుంది. అది నాకు అలవాటేలే అమ్మ అది యముడి కంటే గొప్పదైతే కాదు కదా.. అని అంటుంది దీప. అందరూ బాధపడుతూ ఉంటారు. దీప వెళ్తుంటే… కట్ చేస్తే హిమ పుట్టినరోజుకి సౌందర్య నువ్వు తాతయ్య వెళ్లి బట్టలు కొనుక్కొని రండి అని చెబుతుంది. ఈసారి నాకు బట్టలు, సెలబ్రేషన్స్ ఏమీ వద్దు నాయనమ్మ. ఈసారి ఆ డబ్బులతో అనాధ శరణాలయంలో బట్టలు, స్వీట్స్ కొనిపిద్దాం అని అంటుంది.

Advertisement

Karthika Deepam 2 September Today Episode : కార్తీక్ గతమంతా గుర్తు చేస్తున్న దీప…

అప్పుడు సౌందర్య అనాధ శరణాలయంలో కూడా ఇద్దాం కానీ నీ సెలబ్రేషన్స్ కూడా ఎప్పటిలాగే చేసుకుందాం.. అని అంటుంది. అప్పుడు హిమ వద్దు నాయనమ్మ ఇక్కడ నేను సెలబ్రేషన్స్ చేసుకుంటే మరి సౌర్య పరిస్థితి ఏంటి నాయనమ్మ.. అందుకే వద్దు నాయనమ్మ అని అంటుంది. అప్పుడు సౌందర్య అదేమో ఇంటికి రమ్మంటే రాకుండా అక్కడ అనాధ లాగా బ్రతుకుతుంది అది చెప్పిన మాట వినడం లేదు అని అంటుంది. అప్పుడు హిమ నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వస్తుందేమో నాయనమ్మ అని అంటుంది. అప్పుడు సౌందర్య కోపంతో ఇంకొక్కసారి అలా అన్నావంటే చంప పగిలిద్ది అని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు ఆనందరావు మీరిద్దరూ మా రెండు కళ్ళు లాంటోళ్లు అలా అనకు తల్లి అని అంటాడు. కట్ చేస్తే కార్తీక్ బయటకు వచ్చి శివతో వంటలక్క మాట ఎత్తగానే ఎందుకలా మండిపోయింది. మీ మేడం అని అంటాడు. అప్పుడు శివ మీరు నా పేరు మర్చిపోతున్నారు. మేడం పేరు మర్చిపోతున్నారు. కానీ ఆ వంట లెక్క పేరు, ఆవిడే నిన్ను పిలిచిన పేరు మాత్రం అస్సలు మర్చిపోవడం లేదు. అందుకే మేడం కంగారు పడిపోతున్నారు అని అంటారు.

Advertisement
Karthika Deepam 2 September Today Episode
Karthika Deepam 2 September Today Episode

అప్పుడు కార్తీక్ ఇదంతా కాదుగని మీ మేడం కోసం ఒక వంట మనిషిని తీసుకొద్దాం.. ఎవరైనా ఉంటే చెప్పు అని అంటాడు. అప్పుడు సార్ మంచి బిర్యానీ స్మెల్ వస్తుంది ఇక్కడ ఎవరో వంట చేస్తున్నారు అని అనగానే.. కార్తీక్ వెళ్లి మోనితను తీసుకొని అక్కడికి వస్తాడు. అప్పుడు అక్కడ బిర్యాని వండేది దీప నే అప్పుడు మౌనిత దీప చూసి భయపడుతూ ఉంటుంది. కార్తీక్ దీప ను చూసి నువ్వా.. అప్పుడు మౌనిత పేరు అడుగుతాడు. సహజంగా తన పేరు కూడా నాకు గుర్తుండదు. కానీ నువ్వు గుర్తున్నావు నాకు అని అంటాడు. అప్పుడు దీప ఏదో బ్రతుకుతెరువు కోసం వంటలు చేసుకుని బతుకుదామని ఇక్కడ ఈ ఇల్లు అద్దెకి తీసుకున్నాను సార్ అని అంటుంది. అప్పుడు కార్తీక్ మీరు మా ఇంట్లో వంట మనిషిగా చేరుతారా అని అడుగుతాడు. అప్పుడు నాకు ఒకరి ఇంట్లో పని చేయడం ఇష్టం లేదు సార్. కానీ మీరు అప్పుడప్పుడు ఏం కావాలో అడగండి చేసి పెడతాను అని అంటుంది. అప్పుడు కార్తీక్ ఓహో సరేలే అప్పుడప్పుడు వండి పెడతారా… అయితే ఇప్పుడు ఏం వండారు. అండి అని అంటారు.

అప్పుడు దీప అండి అనకండి. అప్పుడు కార్తీక్ నీ పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు దీప నా పేరు దీప అని చెప్తుంది. అప్పుడు దీప ఇక ఫ్యామిలీలో అందరి పేర్లు చెప్పి గతం గుర్తొచ్చేలా చేస్తూ ఉంటుంది. అప్పుడు మౌనిత ఆగ్రహంతో భయపడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత దీప మౌనిత దీప కొద్దిసేపు ఘర్షణ పడతారు. మౌనిత ఇలాంటివి ఎన్ని చేసినా నా కార్తీక్ ని నా నుంచి దూరం చేయలేవు అని అంటుంది. అప్పుడు దీప నా డాక్టర్ బాబు ని తీసుకుంది నువ్వు నాకు నా డాక్టర్ బాబు నీ ఇచ్చేలా చేస్తా అని అంటుంది. అప్పుడు కార్తీక్ దీప చెప్పిన అన్ని పేర్లను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో దీప బిర్యాని తీసుకొని వచ్చి డాక్టర్ బాబుని పిలిచి మీకు ఏమి గుర్తు లేదా అని అడుగుతుంది. అప్పుడు ఈ మధ్యనే నాకు దెబ్బ తగలడం వలన అంత మర్చిపోయాను అని అంటాడు. అప్పుడు దీప మీకు గుర్తొస్తుంది లేండి అంతా గుర్తొస్తుంది లేని డాక్టర్ బాబు అని అంటుంది. తర్వాత ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే..

Advertisement