Intinti Gruhalakshmi 22 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 22-September-2022 ఎపిసోడ్ 744 ముందుగా మీ కోసం. సామ్రాట్, సామ్రాట్ వాళ్ళ భాబాయ్ ఇద్దరూ మందు తాగుతూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత లాస్య, నందు, లక్కీ వస్తారు, లాస్య లక్కీతొ నువ్వు హనీకి బోర్ కొట్టకుండా చెయ్యాలి అని చెపుతుంది. సామ్రాట్ దగ్గరికి వస్తారు లాస్య వాళ్లు ఇకనుంచి లక్కీ ఇక్కడే ఉంటారు అని చెప్పడంతో, సామ్రాట్ సంతోషపడతాడు. ఇంతలో తులసి వాళ్ళ కుటుంబం కూడా వస్తారు. సామ్రాట్ తులసి వాళ్లు రావడంతో మీ అందరికీ ధన్యవాదాలు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, ఇదంతా హనీ కోసమే అనగానే, ఇందులో మీరు థాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు అని, ఇలా సరదాగా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. పదండి అందరం హనీని లేపుదామని అందరూ హనీ రూమ్ దగ్గరికి వెళతారు, హని అందర్నీ అలానే చూస్తూ, తులసిని ఆంటీ అని పిలవగానే, తులసి దగ్గరికి వస్తుంది, ఏంటి అంటీ నన్ను చూడడానికి వచ్చారా అని అనగానే, తులసి లేదమ్మా నీకు నయమయ్యే వరకు ఇక్కడే వుంటాం అని అనడంతో, నిజంగానా అంటీ అనగానే, అవును అమ్మ అని తులసి అంటోంది.
అయితే నేను దేవుడికి దండం పెట్టుకుంటాను, నాకు తొందరగా నయం అవ్వొద్దు అని, నాకు నయం అవుతే, మీరందరూ మళ్లీ వెళ్లిపోతారు కదా అని అంటుంది. లక్కీ ఇంతలో ఆడుకుందాం హాని అనగానే, రెడీ అయ్యాక ఆడుకుందాం అని తులసి అంటుంది. నన్ను రెడీ చేయడానికి నాన్న రోజూ ఎంతో బతిమిలాడుతారు, ఈరోజు మీరే చేయాలి అని తులసి తొ అంటుంది హాని, అప్పుడు తులసి సరదాగా ఆడుతూ పాడుతూ హనీని తయారుచేస్తారు కుటుంబమంతా కలిసి. తరువాత తులసి దగ్గరికి నందు వస్తాడు, విడాకులైనా కూడా నువ్వు చెప్పినట్టు నేను చేయాల్సి వస్తుంది, అసలు నా కుటుంబాన్ని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు, చాకిరి చెయ్యటానికి తెలుసుకొని వచ్చావా అని ప్రశ్నిస్తాడు, ఏ హక్కుతో నువ్వు ప్రశ్నిస్తున్నాను అని తులసి అంటుంది.
Intinti Gruhalakshmi 22 September Today Episode : సామ్రాట్ ఇంట్లో సందడి చేస్తున్న తులసి కుటుంబం

కుటుంబాన్నంతటినీ తీసుకొచ్చి ఇక్కడ పడేశావ్ అనగానే, నేను చెప్పగానే చేయడానికి వాళ్ళేం చిన్నపిల్లలు కాదు, మేము అందరం కూర్చొని చర్చించుకొని ఏ పనైనా చేస్తాము ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా అని ఇలా కొద్దిసేపు వీళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు, నందు మాటలకి తులసి సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది. తరువాత అభి అంకితను తీసుకుని బయటికి వస్తాడు, ఏం జరుగుతుంది నువ్వైనా చెప్పు మామ్కి నాకు కరెక్టుగా అనిపించడం లేదు, మనం వచ్చిన పన్నెంటి, చేస్తున్నదేంటి మనం హనిని చూసుకోవడం వరకూ ఓకే, కానీ ఆ పాప అమ్మ నాన్నలు స్థానంలో సామ్రాట్ని, మామ్ కలిపి ఫోటోస్ దిగడం దానికి కుటుంబమంతా సపోర్ట్ చేస్తున్నారు, నాకిది కరెక్టుగా అనిపించడంలేదు అని అనగానే, అంకిత నువ్వు నెగిటివ్గా ఆలోచించడం మానేసి అంటీ గురించి అని సమాధానం చెబుతుంది. తర్వాత అందరూ సరదాగా క్యారం బోర్డు ఆడుతూ ఉంటారు.
అల్లరి చేస్తూ ఆడుతూ ఉంటారు, ఒకవైపు సామ్రాట్ వాళ్లు బిజినెస్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు లాస్య ఇలా అంటుంది మెల్లిగా ఆడుకోమని చెప్పనా సార్ అని అనగానే, ఏమీ వద్దు వాళ్ళని అలాగే ఉండనివ్వు అని సామ్రాట్ అంటాడు, ఒక వ్యక్తి వస్తాడు బిజినెస్ డీల్ మాట్లాడుతూ ఉంటారు, నీ మీద నాకు నమ్మకం వుంది నువ్వు ఓకే చెప్పితే నేను సైన్ చేస్తాను ఇంకేం చూసుకోకుండా అని ఒక వ్యక్తితో సామ్రాట్ మాట్లాడుతూ ఉంటాడు, ఇంతలో లక్కీ హనీతో ఇలా అంటాడు మీ డాడీని కూడా పిలువు ఆడుకుందాం అనగానే, హని పిలుస్తుంది సామ్రాట్ని లక్కీ పిలుస్తున్నాడు నాన్నా రమ్మని, ఫైవ్ మినిట్స్ తల్లి వస్తున్నాను అని చెప్పి, లాస్య వాళ్ళతో లక్కీ వల్ల హని చాలా సంతోషంగా ఉంది, థ్యాంక్స్ ఇక్కడికి తీసుకుని వచ్చినందుకు అని అంటాడు. నిజానికి మేము దగ్గర్లోనె ఇల్లు చూద్దాం అని అనుకుంటున్నాము అని అంటుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.