Intinti Gruhalakshmi 23rd July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 23-July -2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసం… బ్యాంక్ మేనేజర్ తులసి వాళ్ళ ఇంటికి వస్తాడు. తులసి మామగారు ఎవరు మీరు అని అడిగితే నేను బ్యాంక్ మేనేజర్ని సార్ అని చెప్పి, తులసిగారు ఉన్నారా అని అడిగితే, రండి అని లోపలికి తీసుకెళతాడు. తులసి ని పిలిచి నీ గురించి బ్యాంకు వాళ్లు వచ్చారు అమ్మా అని అంటాడు వల్ల మామయ్య. అప్పుడు తులసి నమస్తే అని, ఏంటి అని అడగ్గానే, బ్యాంక్ లోను గురించి మాట్లాడటానికి వచ్చాం అని అంటారు. అప్పుడు తులసి మనస్సులో అదేంటి లోన్ ఎమౌంట్ ఇచ్చాం కదా వీళ్లెoదుకు వచ్చారు అని అనుకుంటూ ఉంటుంది.
అప్పుడు మేనేజర్, మీరు మ్యూజిక్ స్కూల్ కట్టడానికి లోన్ కోసం ట్రై చేస్తున్నారు కదా అని అంటాడు. అప్పుడు తులసి అవునండి మీకెలా తెలిసింది, ఎవరు చెప్పారు అని అంటుంది. మీము బ్యాంకు వాళ్ళము మాకు అన్నీ తెలుస్తు ఉంటాయి. మీకు ఎంత కావాలి అంటే అంత అరేంజ్ చేస్తాము అని అంటాడు. అప్పుడు తులసి బ్యాంకువాళ్లు ఈమధ్య ఇళ్లకు వచ్చి అడిగి మరీ లోను ఇస్తున్నారా అని అంటుంది. గవర్నమెంట్ ఆడవాళ్ల కోసం కొత్త ఉపాధి తీసుకుని వచ్చింది. ఎక్కువ కండీషన్స్ ఉండవమ్మా, తొందరగా వస్తుంది అని అంటాడు. కానీ వాళ్ళ మాటలను తులసి నమ్మదు. మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు తెలుసు, అర్హత లేకుండా నాకు ఏదీ వద్దు అని ఆ పెద్దమనిషికి చెప్పండి అని అంటుంది.

దాంతో వాళ్లు వెళ్లిపోతారు. సామ్రాట్ చిరాకుగా ఉంటాడు. అప్పుడు వల్ల భాబాయ్ వచ్చి ఏమైంది అని అడుగుతాడు. ప్రతీ ఎగ్జామ్‌ని జీవితంలో డిస్టింక్షన్ తో పాటు పాసయ్యాను, కాలేజ్ టాపర్‌ని, గోల్డ్ మెడలిస్ట్‌ని, అవి నా రిప్యుటేషన్ .అలాంటిది తులసి విషయంలో కనీసం పాస్ మార్కులు కూడా రావటం లేదు అని అంటాడు. అప్పుడు ఏమైంది అని అడిగితే, ఎట్టిపరిస్థితుల్లో తులసికి కావల్సిన లోన్ శాంక్షన్ చేయాల్సిందే అని బ్యాంక్ మేనేజర్ని వాళ్ల ఇంటికి పంపించాను, అని అంటాడు. ఇంతలో తులసి ఫోన్ చేస్తుంది, సామ్రాట్‌కి. నెంబర్ చూసుకోకుండా ఆ మేనేజర్ పని అయిందా అని అంటాడు, దాంతో తులసి అవ్వలేదు సార్ అని అనడంతో షాక్ అవుతాడు సామ్రాట్.
Intinti Gruhalakshmi 23rd July Today Episode : తులసి ఇంటికి బ్యాంక్ మేనేజర్ని పంపించిన సామ్రాట్, తులసి సమాధానం ఏంటి ?
బ్యాంకుల చుట్టూ తిరుగుతేనే లోను రాలేదు. అలాంటిది బ్యాంక్ మేనేజర్ ఇంటికి వచ్చాడు అంటే అర్థం అవ్వదా అని తులసి అనడంతో, మీరు చాలా ఇంటెలిజెంట్ అని అంటాడు సామ్రాట్, అప్పుడు తులసి మీమీద నాకు జాలేస్తుంది అని, తెలిసో తెలియకో నా విషయంలో పొరపాటు చేశారు. అందుకు కారణం మీ కూతురు మీదున్న ప్రేమ అని నాకు అర్థమైంది. అక్కడితో కథ పూర్తయింది కదా ఏదో సహాయం చెయ్యాలి అని ఎందుకు ఇలా రకరకాలుగా వెంపర్లాడుతూ ఉన్నారో అని, అనవసరంగా మీ సమయం వృధా చేసుకుంటున్నారు అని తులసి అంటుంది.ఇలా కొద్దిసేపు మాట్లాడుతూ, మీ పని మీరు చూసుకోండి నా పని నేను చేసుకుంటాను అని చెప్పుతుంది తులసి.
అప్పుడు సామ్రాట్ ఏంటి బాబాయి ఈమె ఇలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటారు.అప్పుడు వాళ్ల బాబాయ్ ఇన్నాళ్లకి నెత్తిమీద మొట్టి కాయలు వేసేల ఆవిడ మాట్లాడింది నాకు సంతోషంగా ఉంది అని అనుకుంటూ, నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. ఇద్దరు ఇంతలో హనీ పాప వచ్చి నాన్నా అని పిలుస్తుంది. ఏంటి అమ్మ రెడీ అయ్యావు అని అడుగుతారు పాపని. ఇవాళ నేను సంగీతం నేర్చుకోవడానికి వెళుతున్నాను అందుకే ఇలా రెడీ అయ్యాను అని అంటుంది పాప. అప్పుడు ఎవ్వరు అమ్మ నేర్పించేది అని అంటే ఇంకెవరు తులసి ఆంటీ అని పాప అంటుంది.మీకు ఓకే కదా నాన్నా అని అడుగుతుంది.
అప్పుడు ఓకే దింపుతాను అని అనడంతో మీరు వద్దు మీరు వస్తే ఊరికే గొడవపడతారు. తాతయ్య తీసుకువెళ్తాడు అని తాతయ్యతో వెళుతుంది వాళ్ళ ఇంటిక. ఆ పాప తులసి ఇంటికి వెళ్లి తులసితో తాతయ్యతో వచ్చాను నేను రావొచ్చా అంటీ అని అడుగుతుంది. వద్దు అని చెప్పలేను, రమ్మని అందామంటే భయంగా వుంది అని అనడంతో, వాళ్ల బాబాయ్ తెలుసు అమ్మ ఎందుకు అలా అంటున్నావొ. ప్రతిసారి కలిసినప్పుడల్లా ఏదో ఒక గొడవ, చాలా నష్టపోయావు. అందుకే పాప సామ్రాట్ ని రావొద్దు అని చెప్పింది.
ఇలా కొద్దిసేపు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు సామ్రాట్ గురించి. అప్పుడు వాళ్ల తాతయ్య ఇంటికి వెళదాం అని అంటాడు పాప తో, అప్పుడు తులసి మీరు ఏదైనా పనిమీద వచ్చారా అని అడిగితే, మీ దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చాను అని అంటుంది. అప్పుడు తులసి నీకు చాలామంది ఇంటికే వచ్చి నేర్పిస్తారు కదా అమ్మా ఇక్కడి దాకా రావడం ఎందుకు అని అంటే ,అక్కడ అప్పుడు మీరు ఉండరు కదా అంటీ అని అంటుంది. మీ దగ్గర నేర్చుకోవచ్చ ఆంటీ అని, మీకు గురుదక్షణ అని డబ్బులు ఇచ్చి, నన్ను బ్లెస్ చేయండి అంటీ అని అంటుంది.
అప్పుడు తులసి ప్రేమతో పాపను దగ్గరికి తీసుకుని వెళ్లి కూర్చో అమ్మా అని చెప్పి, సామ్రాట్ వల్ల బాబాయ్‌తో వాళ్ళ నాన్నకి తెలుసుకదా ఇక్కడికి వస్తుంది అని అడుగుతుంది. వాళ్లనాన్నే పంపించారు అమ్మా ఎటువంటి సమస్య రాదు అని చెప్పి వెళ్లిపోతాడు.ఒకవైపు ప్రేమ్, శృతి గురించి వెతుకుతూ ఉంటాడు. ఇంతలో తులసి అభికి ఫోన్ చేసి మాట్లాడితే, అభి వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు.పండగకి ఇక్కడికి రా అని అడుగుతుంది. అసలు నీ సమస్య ఏంటి రా నీకు అంకితతో కలిసి ఉండాలని ఉందా , లేకపోతే అత్తగారింట్లో ఉండాలని ఉందా అని అడుగుతుంది. అప్పుడు అవి రెండూ జరగాలని ఉంది అని అంటాడు. అప్పుడు తులసి రెండు జరగవు అని నీకు తెలుసు.
నువ్వు ఇక్కడికి రా పండుగకి అంకిత కోసమైనా, ఇక్కడికి వచ్చి, మీరిద్దరే కూర్చుని మాట్లాడుకోండి. మధ్యలో నేను మాట్లాడను. మీరే ఒక నిర్ణయానికి రండి. ఈ అమ్మ ఎదురుచూస్తూ ఉంటుంది, అని ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో అంకిత వాళ్ల అమ్మ, అభితో ఎవ్వరు ఫోన్ చేసింది,అని అడగడంతో, అమ్మ ఫోన్ చేసింది పండక్కి రమ్మంటుంది అని, అంటాడు. ఏం చెప్పావు మరి అని అడుగుతుంది.ఏం చెప్పలేదు ఆంటీ అని అంటాడు.అప్పుడు బ్యాగ్ సర్దుకొని నువ్వు కూడా వెళ్లు. అంకిత రాదు.నీ కన్నా ఎక్కువ మొండితనం ఉంది. ప్రేమతో నువ్వు తిరిగివచ్చావు తన దగ్గరికి అని అనుకుంటుంది. నువ్వు వెళ్ళి సమయం చూసి తనని తీసుకొని రావాలి అని చెబుతుంది.ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.