Janaki Kalaganaledu : రామ ,జానకి ,గోవిందరాజు కలిసి దొంగతనంగా జానకి సర్టిఫికెట్స్ తీసుకొస్తారా… జ్ఞానంభ వీళ్ళ ప్లాన్ ని పసిగడుతుందా..

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ గా ఎపిసోడ్ ఈరోజు తాజాగా విడుదల కాదు. 25 సోమవారం ఎపిసోడ్ 351 హైలెట్స్ ఏంటో చూద్దాం… జానకి సర్టిఫికెట్స్ కోసం వాళ్ళ అత్తయ్య గారిని తన చదువు గురించి చెప్పాలని వెళ్తుంది. కానీ ఆగిపోతుంది. తర్వాత జానకి రామ తన సర్టిఫికెట్స్ గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఎలాగైనా సర్టిఫికెట్స్ ఇవ్వాలి. లేకపోతే నా చదువు ఇంతటితో ఆపివేయల్సి వస్తుంది. అని మాట్లాడుకుంటూ ఉంటారు.

ఆ టైంలో గోవిందరాజు అక్కడికి వస్తాడు. వాళ్ళ ఇద్దరి మాటలను వింటాడు. మీరిద్దరూ ఏం చేస్తున్నారు మీకు అర్థం అవుతుందా. మీ అమ్మ ఎంత బాధ పడుతుందో మీకు తెలుసా.. అని అంటాడు. అప్పుడు రామ జానకి కల ఐపీఎస్ అని తన కోరిక నెరవేర్చాలని వాళ్ళ నాన్నని ఒప్పిస్తాడు. అమ్మ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ తీసుకురమ్మని వాళ్ల నాన్నని బ్రతిమిలాడతారు. రామ, అప్పుడు గోవిందరాజు జ్ఞానంని ఎలాగైనా ఒప్పించి తీసుకురావాలి. అని అనుకుంటాడు.

Janaki Kalaganaledu serial latest 25th july 351episode
Janaki Kalaganaledu serial latest 25th july 351episode

కానీ తను ఇప్పుడు ఇవ్వను జానకి నెల తప్పిన తర్వాత ఇస్తాను. అని అంటుంది. అప్పుడు గోవిందరాజుకి ఏం చేయాలో అర్థం కాక రామ వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తాడు. ముగ్గురు ఎలా ఎలా అని కంగారు పడుతుంటే గోవిందరాజు కు ఒక ఐడియా గుర్తుకొస్తుంది. అప్పుడు గోవిందరాజు జ్ఞానాంబ అల్మారా తాళపు చెవిని తీసుకొస్తాడు. అది తీసుకొచ్చి రామా కి ఇస్తాడు. ఇది తీసుకొని నువ్వు అల్మారాలో ఉన్న జానకి చదువు కాగితాలను తీసుకొని రా అని అంటాడు. కానీ రామ దానికి ఒప్పుకోడు, అమ్మ ఇలా మనం దొంగతనం చేసాము అని తెలిస్తే చాలా బాధపడుతుంది అని అంటాడు.

Janaki Kalaganaledu : జ్ఞానంభ వీళ్ళ ప్లాన్ ని పసిగడుతుందా..

కొద్దిసేపుటి తర్వాత నువ్వే తీసుకురా నాన్న అని అంటాడు. ఎలాగైనా తన కలను తన చదువును ఆపకుండా ఉండాలి. అంటే నువ్వు ఈ పని చేయాలి. అని రామాకి చెప్తాడు. గోవిందరాజు, అవును కానీ నాన్న ఎలా ఇప్పుడు అని కంగారు పడుతూ ఉంటారు. రామ వాళ్ళ అమ్మ రూమ్ లోకి వెళ్లి జానకి చదువు కాగితాలను తీసుకొస్తాడు. తరువాత భాగం ఏం జరిగిందో తెలియాలి అంటే, సోమవారం వరకు ఆగవలసిందే.