Intinti Gruhalakshmi 24 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 24-September-2022 ఎపిసోడ్ 746 ముందుగా మీ కోసం. లాస్య, నందు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు, తులసి కింద పనిచేయాల్సి వస్తుందని అనుకోలేదు అని నందు అనడంతో, తులసికి చదువు రాదు అది మనకి ప్లస్ పాయింటు, మనము తనకి గైడ్ చేసినట్టే చేస్తూ, మనమే తను తప్పు చేసేలాగా చేస్తే, సామ్రాట్ దగ్గర బ్యాడ్ అవుతుంది అని ఇలా లాస్య చెబుతూ ఉంటుంది, తరువాత ప్రేమ్, శృతి, అంకిత, అభికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు తులసి విషయంలో, అప్పుడు అభి ఇలా అంటాడు, నాకు మామ్ అంటే ద్వేషం లేదు, ఆస్తి రాకుండా చేసింది అనే కోపమొక్కటే ఉంది అంతే తప్ప మామ్ మీద నాకెటువంటి ద్వేషం లేదు, మామ్ ఎదగాలని నేను కూడా కోరుకుంటున్నారు కానీ నిచ్చెన ఎక్కి ఎదగాలి ఇలా కాదు, తర్వాత మనమే ఇబ్బంది పడాల్సి వస్తుందని నా బాధ అని అభి అంటాడు. అయినా నేను నాన్న గురించి కూడా ఆలోచించొచ్చు అనే నందు గురించి మాట్లాడతాడు ఇలా కొద్దిసేపు వీళ్లు మాట్లాడుకుంటారు.
తర్వాత తులసి లక్కీ, హని లకి అన్నం తినిపిస్తూ ఉండగా, అక్కడికి ప్రేమ్, దివ్య, కుటుంబం అంతా వచ్చి మాకు తినిపించండి మామ్ అని దివ్య, ప్రేమ్ అనగానే, అంకిత శృతి కూడా మాకు తినిపించండి ఆంటీ అనడంతో, తులసి అందరికీ చేతిలో ముద్దలు కలిపి పెడుతూ ఉంటుంది, వాళ్లు సంతోషంగా ఉండడాన్ని సామ్రాట్ చూస్తూ ఉంటాడు, వాళ్ల బాబాయ్ తో ఇలా అంటూ ఉంటాడు, స్వార్ధానికి వాళ్ళ కుటుంబాన్ని వదిలేసిపోతే, తులసీ కూడా వదిలేసి వెళ్లాల్సింది కానీ అలా చేయలేదు అని అనగానే, ఆడవాళ్లు అంతే అలా చెయ్యరు అని నందు, లాస్య, తులసి కుటుంబం గురించి కొద్దిసేపు మాట్లాడుకుంటున్నారు, ఇంతలో డాక్టర్ వస్తుంది హని ని చూడటానికి, డాక్టర్ అంతా ఓకె నయమైంది అని చెప్పడంతో, హని సరదాగా లేదు డాక్టర్ నాకు కట్టు ఇలానే ఉంచండి, నాకు నయమైపోతే అందరూ వెళ్ళిపోతారు అని అంటోంది. పాప అలానే అంటోంది మీరు కట్టు తీసెయండి అని తులసి చెప్పడంతో, డాక్టర్ కట్టు విప్పుతుంది, తరువాత హనీ లాస్య ఇద్దరు ఆడుకోడానికి వెళతారు.
Intinti Gruhalakshmi 24 September Today Episode : ప్రెస్మీట్లో సామ్రాట్ తులసిపై కుట్ర పన్నబోతున్న లాస్య
అప్పుడు సామ్రాట్ ఇలా అంటాడు మళ్లీ ప్రెస్మీట్ పెట్టాలి, మనం బిజినెస్ స్టార్ట్ చేసినట్టు తెలియాలి కదా అని అనడంతో, అలా ఎందుకు సార్ మనమూ పనులు మొదలు పెడుతుంటే వాళ్ళకే తెలుస్తుంది కదా అని తులసి అంటోంది. ఒకప్పుడు మీడియా చేసిన విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు, అప్పుడు సామ్రాట్ ఇలా అంటాడు ఎవరొ తప్పు చేసింది, ఎవరైనా సరే వదిలిపెట్టను అని అనడంతో, తులసి ఇలా అంటుంది తెలుసుకొని ఏం చేస్తారు, నాకు ద్రోహం చేయాలనుకున్నారని, పగ పెంచుకోవాలనుకోవడం లేదు, కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలూ అని అనడంతో, తులసి మాటలకు సామ్రాట్ మీరు ఎంత గొప్పవాళ్లు అని మెచ్చుకుంటారు, నందు వాళ్లకు ప్రెస్ మీట్ ఎరేంజ్ చేయమని చెప్పి వెళ్లిపోతారు, నందు లాస్య ఇద్దరు కోపంతో రగిలిపోతూ ఉంటారు, ఎలాగైనా ప్రెస్మీట్లో తను అనుకున్నది జరగాలి అని లాస్య కుట్రపన్నుతూ ఉంటుంది. ఒకవైపు ప్రేమ్, శ్రుతి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. లాస్య ప్రెస్మీట్కు వచ్చిన వాళ్లందరికీ స్వయంగా మర్యాదలు చేస్తూ ఉండడాన్ని గమనించి, ఏంటి లాస్య ఇలా చేస్తుంది అని నందు అనుకుంటాడు, లాస్య వాళ్లతో కలిసి కుట్ర పన్నుతోంది తను అడగమన్న ప్రశ్నలనే అడగమని చెబుతుంది మీడియా వాళ్లకి, ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.