Intinti Gruhalakshmi 28 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 28-September-2022 ఎపిసోడ్ 749 ముందుగా మీ కోసం. అభి మాట్లాడిన మాటలకు ఆవేశంగా గతంలో జరిగిన విషయాన్ని బయట పెడతాడు సామ్రాట్ వల్లభాబాయ్, అస్సలు సామ్రాట్కి పెళ్లే కాలేదని, హని సామ్రాట్ వాళ్ల చెల్లెలి కూతురు అని, సామ్రాట్ వాళ్ల చెల్లెలు సామ్రాట్ దగ్గర పనిచేసే మేనేజర్ ని ప్రేమించిందని, ప్రేమించిన వ్యక్తి మంచివాడు కాదన్న నిజం తెలిసి సామ్రాట్ ఎంత నచ్చజెప్పినా వాళ్ళ చెల్లి వినకపోవడంతో, వాళ్లిద్దరికీ పెళ్లి చేసి, ఆస్తిలో వాటా కూడా ఇస్తాడు, కానీ ఆస్తి మొత్తం పోగొట్టుకుని మళ్లీ ఆస్తి తీసుకురమ్మని పుట్టింటికి పంపిస్తూ వేధిస్తూ ఉంటాడు, వాళ్ల చెల్లి అన్నను ఇబ్బంది పెట్టలేక తను ఆత్మహత్య చేసుకుంటుంది, అప్పటికే హాని పుడుతుంది, హనీని సామ్రాట్ ఇంటి గుమ్మం ముందు హనిని వదిలి పెట్టి, వాళ్ళ చెల్లి చనిపోతుంది, అప్పటినుంచి సామ్రాట్ హని నాన్న లా ఉంది పెంచుతూ ఉంటాడు, అంతే తప్ప నిన్ను అవమానిస్తుంటే మౌనంగా ఉండడానికి కారణం ఇదే అమ్మ నేను ఈ రోజు మాట తప్పాను, క్షమించరా సామ్రాట్ అని సామ్రాట్తో అంటూ ఉంటాడు, అప్పుడు సామ్రాట్ నేను జీవితాంతం హనీకి తండ్రిగా ఉందామనుకున్నాను.
Intinti Gruhalakshmi 28 September Today Episode : హనీ సామ్రాట్ చెల్లెలు కూతురు అన్న నిజం బయటపడడంతో, షాక్లో తులసి కుటుంబం.
అందుకే ఆ రిపోర్టర్ ప్రశ్నలకి నేను ఏమి సమాధానం చెప్పలేకపోయాను అని బాధపడుతూ ఉంటాడు, అప్పుడు తులసి క్షమాపణ అడుగుతుంది అభి తరపున, అప్పుడు సామ్రాట్ అభి మీద ఎటువంటి కోపం లేదు అని అంటాడు, తరవాత తులసి వాళ్ళ మామయ్య వేరొక పెళ్లి చేసుకుంటే హనికి అమ్మని తీసుకొచ్చినట్టు అయ్యేది కదా, ఎందుకు చేసుకోలేదు అని అడగ్గానే, నేను రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు, నేను ప్రాణంగా చుసుకొని, పెoచిన, దూరమైన నా చెల్లెలు రక్తాన్ని హని లొ చూసుకుంటున్నాను అని మాట్లాడుతూ ఉంటాడు. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోండి, ఎవరు హని కి నిజం చెప్పొద్దూ అని సామ్రాట్ అంటాడు. అప్పుడు తులసి ఇక్కడ ఉన్న వాళ్ళ తరపున నేను మాటిస్తున్నాను ఎవరికీ నిజం చెప్పాము అని అంటోంది, లాస్య కూడా నిజం చెప్పము సార్ అని అంటోంది అక్కడి నుంచి వెళ్లిపోతారు, తరవాత లాస్య నందుతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది జరిగిన విషయాన్ని, అప్పుడు నందు అంటాడు

అసలు అనుకున్నది జరిగిందా అని నేను నేను కరెక్టే చేశాను కానీ, ఇలా జరుగుతుందనుకోలేదు అయినా ఇది కూడా మంచిదే కదా సామ్రాట్గారూ బ్రహ్మచారి అని తెలిసింది, ఇక మీ అమ్మను రెచ్చగొట్టి తులసిని సామ్రాట్కి దూరం చేయొచ్చు అని పన్నాగం పన్నుతుా ఉంటుంది, ఒకవైపు తులసి వాళ్ళ మామయ్య, తులసి జరిగిన విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, తర్వాత హని, సామ్రాట్ దగ్గరికి వస్తూ ఉంటుంది, సామ్రాట్ బాధపడుతూ వుంటే, మ్యాజిక్ చేస్తూ ఇలా నవ్విస్తూ ఉంటుంది, తులసి వాళ్ళ ఇంట్లో టీవీ చూస్తూ ఉంటారు, టీవీలో జరిగిన ప్రెస్ మీట్ గురించి చెబుతూ ఉంటారు, తులసి సమాధానం చెప్పిన విధానాన్ని మెచ్చుకుంటారు కానీ, సామ్రాట్ సమాధానం చెప్పకపోవడంతో ఏం జరుగుతుందో తెలియడం లేదు అని కూడా అంటారు, దాంతో అభి మళ్లీ తులసిని ప్రశ్నిస్తారు.
చూడమ్మా ఏం జరిగిందో అని, అప్పుడు ఇంట్లో వాళ్లు మీ అమ్మ గొప్పగా మాట్లాడిందని, ధైర్యంగా మాట్లాడిందని చెప్పిన తర్వాత కూడా మీ అమ్మని ప్రశ్నిస్తున్నావ అని అనగానే, సామ్రాట్గారూ మౌనంగా ఎందుకున్నారని కూడా అక్కడ అడిగారు మీరు అది వినలేదా అని అంటాడు, కారణం మనకి తెలుసు కదా అని అనగానే, నాలుగు గోడల మధ్యన చెప్తే సరిపోదు అని అభి అంటాడు, అప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ లాస్య చేతిలో కీలుబొమ్మలాగా ఉండకు, దయచేసి మీ అమ్మని ఇబ్బంది పెట్టకు, మీ అమ్మ మీద నమ్మకాన్ని కోల్పోకుండా ఉండు అని చెబుతూ ఉంటారు. అప్పుడు దివ్య కూడా అంటుంది నువ్వు మామ్ నీకు ఆస్తి రాకుండా చేసిందని ఇలా ప్రవర్తిస్తున్నావా అని అనగానే, అభి బాధగా ఏడుస్తూ అందరూ నన్ను తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు, నువ్వైనా అర్థం చేసుకో అమ్మా, నీ మీద నాకు కోపం ఎందుకు ఉంటుందని చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు, ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.