Ram Gopal Varma : రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ కేసీఆర్… సినిమాలో వాళ్లంతా రీల్ స్టార్స్…. ఆర్ జీ వీ ట్వీట్…

Ram Gopal Varma : ఎప్పుడు ఏదో ఒక కాంట్రావర్సిటీ తెరలెపుతూ వార్తల్లో నిలుస్తుంటాడు రాంగోపాల్ వర్మ. తనకు నచ్చినట్లు తాను జీవిస్తానంటూ తనకు నచ్చిన విషయాలపై నిర్మోహమాటంగా తన అభిప్రాయాలు వెల్లడిస్తానని, ఎవరు ఏమనుకుంటారని విషయంతో తనకు సంబంధం లేదని అంటూ ఎవరు ఏమనుకున్నా నిర్మొహమాటంగా అతను అనుకున్న విషయాన్ని అనుకున్నట్లుగా బయటకి చెప్పేస్తుంటాడు. అంతేకాకుండా అప్పుడప్పుడు సినిమాలే కాకుండా రాజకీయాలపై కూడా తనదైన శైలిలో పంచులు వేస్తూ కొత్త కొత్త వివాదాలలో తల దురుస్తూ ఉంటాడు. గతంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి ఏదో చెప్పబోయే ఏదో చెప్పి తర్వాత సారీ చెప్పడం జరిగింది.

Advertisement

ఇదిలా ఉండగా ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్యాన్ ఇండియా పొలిటికల్ స్టార్ గా పొగుడుతూ బాహుబలి, పుష్ప, RRR, KGF సినిమాల మాదిరిగానే టిఆర్ఎస్ పార్టీ కూడా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో BRS గా వెళుతుందని రియల్ పాన్ ఇండియా స్టార్ కెసిఆర్ ఏ అని. ప్రభాస్, ఎన్టీఆర్, యాష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీరంతా రిల్ స్టార్స్ అని అసలైన పొలిటికల్ ఫ్యాన్ ఇండియా స్టార్ కెసిఆర్ అని రాసుకొచ్చాడు రాంగోపాల్ వర్మ.

Advertisement

Ram Gopal Varma : రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ కేసీఆర్…

Ramgopal Varma Viral tweet about Telangana cm kcr
Ramgopal Varma Viral tweet about Telangana cm kcr

ఈ మధ్యకాలంలోనే ఇందిరా గాంధీని ఉద్దేశించి పరోక్షంగా ట్విట్ చేసి కొత్త వివాదానికి తరలించారు ఆర్జీవీ. ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ తో “ఎమర్జెన్సీ” అనే సినిమాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. కాగా ఆ సినిమాలో ఇందిరా గాంధీ 1884లో ఇచ్చిన ఇంటర్వ్యూలో వీడియో లింక్ షేర్ చేసిన ఆర్జీవి. కంగనా రనోతు లాగానే ఇందిరా గాంధీ బాగా నటించారని కావాలంటే ఫుల్ ఇంటర్వ్యూ ఎపిసోడ్ చూడండి అంటూ తన ట్విట్టర్లో రసిలుకోవచ్చాడు. కానీ కానీ కాంగ్రెస్ వర్గాలవారు దీనిని పెద్దగా పట్టించుకోలేదు.

Advertisement