Intinti Gruhalakshmi 6 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 6-September-2022 ఎపిసోడ్ 730 ముందుగా మీ కోసం. నందు ఆలోచిస్తూ ఉంటే, లాస్య వచ్చి ఏమైంది నందు అని అడగ్గానే, నందు అంటాడు మనం తులసి వెళ్లిపోయిందని సంతోషపడేలోపు, మన జాబే పోయేలాగుంది, తులసి వల్ల అని తులసి గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు లాస్య ప్రాబ్లమ్ని కూడా మన ఆయుధంగా మార్చుకోవాలని నందు అని, నందూ చెవిలో తన ప్లాన్ గురించి చెబుతూ ఉంటుంది. ఇలా చేయడం కరక్ట్ కాదేమో అని నందు అంటాడు. లేదు నందు ఇదే కరెక్ట్ సామ్రాట్, తులసి ఇద్దరిని విడదీయచ్చు అని,నేను చెప్పినట్టు ఫాలో అవ్వు అని చెబుతుంది. ఓవైపు అభి తులసిని అడుగుతూ ఉంటాడు, డాడ్ విషయంలో నువ్వెందుకిలా బిహేవ్ చేస్తున్నావు, ఒకప్పుడు ఇలా లేవు అని అడుగుతాడు.
Intinti Gruhalakshmi 6 September Today Episode : తులసి విషయంలో సామ్రాట్ ని రెచ్చగొట్టిన లాస్య
నీకు నేను మాట్లాడింది గుర్తుందా, మీ డాడీ ఇంటికెళ్లి నేను బతిమిలాడింది గుర్తులేదా, నిజం చెప్పొద్దూ అన్నది మీ నాన్న, నేను విన్నాను, కానీ ఇప్పుడు నేను చెప్తుంటే వినట్లేదు వీలైతే వినమని మీ నాన్న ని ఒప్పించు అని అభికి సమాధానం చెపుతుంది.ప్రేమ్ ఈవెంట్ మేనేజర్ ని కలవడానికి బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడు తులసి ముందే చెపితే టిఫిన్ చేసే దాన్ని కదరా, అని ఇలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటే, శ్రుతి, ప్రేమ్ ని కొద్దిసేపు ఆటపట్టిస్తూ ఉంటుంది.ప్రేమ్ బైక్స్లో గాలి తీస్తుంది. శ్రుతి బట్టల మీద నీళ్లు పోసినందుకు, ప్రేమ్ ని ఆటపట్టిస్తూ ఉంటుంది శృతి.తులసి ప్రేమ్ కోసం తెచ్చిన పాలని తనే తాగుతూ, ఉంటుంది. ఇలా కొద్దిసేపు ప్రేమ్ ని ఆటపట్టిస్తూ ఉంటుంది శృతి.సామ్రాట్ ఆలోచిస్తూ ఉంటాడు తులసి గురించే,చిన్న విషయానికి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను, నేను మర్చిపోవాలి ఈ విషయాన్ని అని అనుకుంటాడు.

ఇంతలో లాస్య, నందు వస్తారు, సామ్రాట్ డోర్ వైపే చూస్తూ ఉంటాడు, అప్పుడు లాస్య అంటోంది, సార్ తులసి రాలేదు, రానని చెప్పింది అనగానే, ఎందుకు ఏంటి ప్రాబ్లమ్ అని సామ్రాట్ అంటారు.లాస్య మీరు చాలా చేశారు సార్, కానీ తులసి మాత్రం రానని మొహం మీదే చెప్పింది అని, ఇలా తులసి గురించి అన్ని చాడీలు చెబుతూ ఉంటుంది, సామ్రాట్కి లాస్య.తన ప్రాబ్లమ్ ఏంటో అర్థం కావడం లేదు, మేము ఉండటమే తనకి ఇష్టం లేకపోతే మేమే రిజైన్ చేసి వెళ్ళిపోతాము కదా అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అని అంటుంది. లేదు అవసరం లేదు, మీరు వెళ్లిపోవాల్సిన అవసరం లేదు అని అంటాడు సామ్రాట్.పోనీ మీరే ఒకసారి మాట్లాడతారా సార్ తులసీతో అని లాస్య అనగానే, లేదు, ప్రసక్తే లేదు అని,తనకి ఎంత పొగరు ఉందో నాకు అంతకంటే ఎక్కువే ఉంది, తను ఇక ఈ ఆఫీసులో అడుగు పెట్టడానికి వీల్లేదు, తను మనసు మార్చుకున్న నేను మార్చుకోను,నా మాటగా ఈ విషయాన్ని మీ మాజీ భార్యకి చెప్పమని నందు తొ సామ్రాట్ అంటాడు.ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.