Intinti Gruhalakshmi 9 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 09-September-2022 ఎపిసోడ్ 733 ముందుగా మీ కోసం సామ్రాట్, వాళ్ల బాబాయ్ తో ఎందుకు బాబాయి కావాలనే నువ్వు హనీని రెచ్చగొడుతున్నావ్, ఆ ప్రశ్నను అడగకుండా ఉండాల్సింది కదా అని అంటాడు. ఇక జీవితంలో నేను తులసి గురించి మాట్లాడే ప్రసక్తే లేదు అని చెప్పి వెళ్లిపోతాడు.లక్కీ షాప్లో డ్రాయింగ్ హిట్స్ కొంటాడు, ఈలోపు హాని కూడా వస్తుంది, తను కూడా డ్రాయింగ్ షీట్ కొంటుంది,ఈలోపు తులసి కనిపించడంతో, హనీ పరిగెత్తుకుంటూ వెళ్లి, ఆంటీ నేను దిగులు పెట్టుకున్నా, నైట్ కూడా రికార్డు చేసిన మీ పాటను వింటూ, నిద్ర పోతాను అని అంటూ ఉంటుంది.మీరు ఊరికెళ్లేటప్పుడు నాకొక మాట చెప్పొచ్చు కదా అంటీ అనగానే, ఊరెళ్ళనని ఎవరు చెప్పారు అమ్మా అని అంటుంది. మా నాన్న చెప్పారు, ఎందుకంటీ అలా అడుగుతున్నారు, మీరు వెళ్లలేదా, మా నాన్న అబద్ధం చెప్పారా అని అనడంతో, లేదమ్మా మీ నాన్న ఎందుకు అబద్ధం చెబుతాడు, నిజంగానే ఊరికి వెళ్లాను అని తులసి అంటోంది.
లక్కీ ని కూడా పలకరిస్తారు తులసి, దివ్య. ఇలా మాట్లాడుతూ ఉండగా, చేతిలో విగ్రహం ఏంటి అని అడగ్గానే, వినాయక చవితి కదా అమ్మా అని అనగానే, హాని ఆంటీ నేను రావొచ్చా మీ ఇంటికి పూజకి,ఒక దాన్ని బిక్కుబిక్కుమంటూ ఉండాలి, పూజ ఎలా చేయాలో నాకు నేర్పించవచ్చు కదా అని అడుగుతుంది.అలాగే అమ్మా ప్రతీ పండక్కి నన్ను పర్మిషన్ అడక్కుండానే నువ్వు రావొచ్చు అని అనగానే, లక్కీ నేను రావొచ్చా ఆంటీ అనగానే, నువ్వురా, కానీ ఇద్దరూ ఇంట్లో చెప్పి రండి అని చెబుతోంది తులసి.ఓవైపు శ్రుతిని, ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. ఎందుకు నా మీద ఇంత కోపం పెంచుకున్నావు మనసులో, ఏమైంది ఎందుకు ఈ ద్వేషం అని ప్రశ్నిస్తూ ఉంటూ ఉంటాడు.నీకు నా భార్యగా ఉండటం ఇష్టం లేదు, ఈ ఇంట్లో కోడలిగా ఉంటున్నావు, నీ బాధ్యత నాది, ఏ అవసరం వచ్చినా, డబ్బయినా అమ్మని కాదు అడగాల్సింది, నన్నే, నన్ను అడగడం నీకిష్టం లేకపోతే, కనీసం మెసేజ్ అయినా చెయ్యి అని బాధగా చెబుతాడు శృతికి.ఒకవైపు సామ్రాట్ ఫోన్లో కోపంగా మాట్లాడతాడు.
Intinti Gruhalakshmi 9 September Today Episode : తులసి ఆంటీ వాళ్ల ఇంటికి పూజకి వెళతాను అని సామ్రాట్ తో చెప్పిన హాని.

ఇంతలో హాని రావడంతో నెమ్మదిగా మాట్లాడతాడు, నాన్న ఏమైంది మళ్లీ అనగానే, ఏమీ లేదమ్మా అంటాడు. నాన్న నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను అని అంటుంది.తులసి ఆంటీ తనకి రోడ్డు మీద కనిపించిందని, ఊరెళ్లి ఎప్పుడొచ్చారు అనగానే, అంటీ షాకైందని, ఇలా జరిగింది అంతా చెబుతూ ఉంటుంది, హని ఇంకొక సర్ప్రైజ్ చెప్పనా నాన్నా అని, రేపు పూజకి తులసి ఆంటీ వాళ్ల ఇంటికి రావొచ్చా అని అడిగాను అనగానే, సామ్రాట్ వాళ్ల బాబాయ్ ఏమని అంది అమ్మ అంటాడు, రమ్మని చెప్పింది, నేను అడిగితే, ఆంటీ వద్దు అనడం జరుగుతుందా అని అంటుంది. మరి మీ నాన్న వద్దు అంటే, వెళతావా అని సామ్రాట్ బాబాయ్ అడగడంతో, వెళ్ళను కానీ, నాన్న వద్దు అని చెప్పాడు. ఖచ్చితంగా తీసుకెళతాడు అని అంటుంది.మీ నాన్న తీసుకెళ్లకపోతే ఏం చేస్తున్నావమ్మా అనగానే, అక్కడే ఉండిపోతాను అని చెప్పి వెళ్లిపోతుంది. అసలు ఏమనుకుంటుంది తులసి అని, వాళ్ళ బాబాయ్తో సామ్రాట్ అనగానే, నువ్వెన్ని చెప్పినా తాను ఎప్పుడు తప్పు చేయదు.
నువ్వేదో భ్రమలో ఉన్నావు అని అంటాడు.తరువాత దివ్య, తులసితో ఇలా అంటుంది, అమ్మ ఎందుకో నువ్వు సమస్యని కోరి తెచ్చుకుంటున్నావు అనిపిస్తుంది, హనీని ఒక్కదాన్నే పిలిచావు, పరిస్థితులు ఇలా ఉన్నా కూడా, ఎందుకు రిస్క్ చేయడం అని అనగానే, చిన్నపిల్ల అడిగింది కాదనలేకపోయాను, అయినా మనం రేపు పూజించేది విఘ్నేశ్వరుడిని అన్ని విఘ్నాలను దేవుడే పోగొడతాడు అని మాట్లాడుతుంది.ఒకవైపు లక్కీ డ్రస్సులన్నీ తీసి ఆలోచిస్తూ వుండగానే, లాస్య, నందు వస్తారు,లాస్య ఏంటి ఏం చేస్తున్నావు అనగానే, రేపు తులసి ఆంటీ వాళ్ల ఇంటికి ఏ డ్రెస్ వేసుకొని వెళదాం అని ఆలోచిస్తున్నాను అని అనగానే, రేపు మనం కూడా ఇక్కడ పూజ చూస్తున్నాం కదా అని లాస్య అంటుంది, అప్పుడు లక్కీ చేసుకోండి అని అంటాడు, అయినా మమ్మల్ని పిలవకుండా నిన్నొక్కణ్నే పిలిచిందా అని లాస్య అనగానే, ఎవరైనా తలనొప్పిని కొనితెచ్చుకోరు కదా అమ్మా అని అంటాడు లక్కీ.మీరు తులసి ఆంటీకి సంబంధించిన ఏ ఫంక్షన్ కి వెళ్లినా, గొడవపెట్టి కానీ రారు. అందుకే మీరిద్దరూ నాతోపాటు రాకండి, మీరు ప్రశాంతంగా ఇంట్లో పూజ చేసుకోండి నేను వెళతాను అని లక్కీ అంటాడు వాళ్లతో , అన్నట్టు హని కూడా రేపు తులసి ఆంటీ వాళ్ల ఇంటికి పూజకి వస్తుంది అని అంటాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.