Intinti Gruhalakshmi 8 July Today Episode : ప్రేమ్ కు ధైర్యం చెప్పిన తులసి.. ప్రేమ్ పాటల పోటీల్లో గెలుస్తాడా? లాస్య గెలవనిస్తుందా? 

Intinti Gruhalakshmi 8 July Today Episode : లాస్య నందుతో నందు ఇలా నాలుగు గోడల మధ్య ఉంటే, జరిగింది గుర్తు తెచ్చుకుంటే అలానే ఉంటుంది, నాకు ఇప్పుడే సంజన కాల్ చేసింది రేపు సింగింగ్ కాంపిటీషన్ ఉంది అంటా నిన్ను కూడా రమ్మని ఇన్వైట్ చేసింది   అక్కడికి వెళదాం కొంచెం  ఛేంజ్ కోసం సరదాగా వెళదాం అని లాస్య నందు తో అంటుంది అప్పుడు నందు సరే అంటాడు.ఒకవైపు ప్రేమ్ పేపర్పైన పాటలు రాయడానికి ఎంతో ప్రయత్నిస్తాడు కానీ రాయలేకపోతాడు.

తులసి ఒక్కత్తే కూర్చొని ప్రేమ్కీ ఒక మంచి అవకాశం వచ్చింది ఇది నిరూపించుకోవచ్చు కానీ ఎందుకో ప్రేమ్ నిరాశగా ఉంటున్నాడు అమ్మగా నేను కూడా ఏం చేయలేక పోతున్నాను అని బాధపడుతూ ఉంటుంది. సంజన తులసికి ఫోన్చేసి ప్రేమ్ ఇంకా నన్ను కలవలేదు తను ప్రిపేర్ అవుతున్నాడట సింగింగ్ కాంపిటీషన్ కి అని అడుగుతుంది అప్పుడు తులసి ప్రేమ్ బాధ్యత నాది తను ప్రిపేర్ అవుతున్నాడు అని సంజనకి చెపుతుంది.

intinti gruhalakshmi july 8 2022 today full episode
intinti gruhalakshmi july 8 2022 today full episode

తర్వాత తులసి ఫ్రేమ్ రాసిన పుస్తకాల బుక్కు తీసి అరే ప్రేమ్ ఎంత మంచిగా ఇన్ని పాటలు రాసారు కానీ ఇప్పుడు నువెందుకు ఒక్క పాట కుడా రాయలేకపోతున్నావు నేను దూరంగా ఉన్నాను అని రాయలేకపోతున్నా వా అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో అంకిత అక్కడికి వచ్చి మీరు అనుకుంటున్నది నిజం ఆంటీ తను మీ ప్రేమ దూరమైన బాధతోనే రాయలేకపోతున్నాడు.

మీరు ప్రేమతో మాట్లాడకపోయినా మీ మీద ప్రేమ, గౌరవం కొంచెం కూడా తగ్గదు కానీ తన అమ్మ ప్రేమ లేకపోవడంతో తన మీద తనకు నమ్మకం పోయి  నిరాశపడుతున్నాడు, అమ్మ ధైర్యం లేదే అని బాధపడుతున్నాడు,మీరు ఇక్కడ బాధపడుతూ ఉంటే, ప్రేమ్ అక్కడ బాధపడుతూ ఉన్నాడు మీరు ఇద్దరూ సంతోషంగా లేరు అంటీ, మీకు చెప్పే అంత దానిని కాదు కానీ నాకు అనిపించింది చెప్తున్నాను అంటీ మీరు ఎప్పుడు ప్రేమకి బలం, బలహీనత కాదు, ఈ టైమ్ కి మీరు ప్రేమ్ పక్కన ఉండటం ఎంతో అవసరం అంటూ,  ఆలోచించుకోండి అని చెప్పి అంకితం అక్కడినుండి వెళ్లిపోయింది.

తర్వాత తులసి నేను ప్రేమ్ పక్కన ఉండటం చాలా అవసరం అని అనుకొని ప్రేమ్ దగ్గరకి వెళుతుంది, తులసి ప్రేమ్ తో  నా కొడుకు రేపు గెలిచాక గుండెలకు హత్తుకొని, గర్వంగా అందరికీ వినపడేలా గట్టిగా అరిచి చెప్పాలని అనుకున్నాను, కానీ నా కలల్ని ఎక్కడ మోసం చేస్తావో అని ఇంతరాత్రి ఈ అమ్మ ఆరాటంగా నీకోసం వచ్చింది.

Intinti Gruhalakshmi 8 July Today Episode : ప్రేమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన కుటుంబ సభ్యులు

అమ్మ అంటే నీకు ఇష్టం, ప్రాణం, ప్రపంచం  అది నాకు తెలుసురా, అమ్మ సంతోషంగా ఉండే పని నువ్వు చేయాలి అంతేకానీ అమ్మ దూరం పెట్టింది అని దిగులుగా వుంది ఇలా చేయకూడదు, కష్టాన్ని ధైర్యంగా ఎదిరించాలి లేకపోతే నీ కోసం ఎదురుచూస్తున్న గెలుపు నీ ఇంటి గుమ్మం దగ్గరే ఆగిపోతుంది, నువ్వు కోరుకుంది అదేనా అని తులసి నిలదీస్తుంది.

అప్పుడు ప్రేమ్ ఎందుకో తెలీదు కానీ నాలో ఉన్న శక్తి అంతా అణచి పోయింది అమ్మ, నా మనసు కూడా నాతో కలిసి రాలేదు అమ్మ, ఎంతో ప్రయత్నించాను కానీ బాదో భయబో అర్థం కావట్లేదు అమ్మా అని ప్రేమ్ అంటాడు. అప్పుడు తులసి ఇప్పుడు నీ గుండెలమీద చెయ్యేస్కుని చెప్పు మా అమ్మ ఉంది అని ఉంటుంది, అప్పుడు ప్రేమ్ అమ్మ ఒకసారి నీ దగ్గరికి రావొచ్చ నీ భుజంపైన తల పెట్టుకోవచ్చా అని అంటాడు దాంతో తులసి రా నాన్నా అని అంటుంది.

తులసి ప్రేమ్, శృతి  ఇద్దరిని పట్టుకుని హద్దుకుని చాలా సంతోషపడుతుంది. తెల్లవారగానే తులసి కుటుంబం అందరు సింగింగ్ కాంపిటీషన్ దగ్గరికి చేరుకుంటారు అక్కడ అందరూ  ప్రేమ్ కి ఆల్ ది బెస్ట్ చెబుతారు.అక్కడికి అభి కూడా వస్తాడు వచ్చి ప్రేమ్ కి  ఆల్ ది బెస్ట్ చెపుతాడు. తర్వాత అక్కడికి లాస్య నందు భాగ్య వస్తారు అక్కడ తులసి ప్రేమ్ ని  చూసి లాస్య  తల్లి కొడుకులు కలిసిపోయారు  అని వెటకారంగా మాట్లాడుతుంది. దానికి  తులసి, తులసి కుటుంబం సమాధానం చెబుతారు.

తరువాత తులసి వాళ్ల అత్తామామలు నందుని ఏరా ప్రేమ్ కి  ఆల్ ది బెస్ట్  చెప్పవా అని అడిగితే అప్పుడు నందు ప్రేమ్ కీ వాళ్ళ అమ్మ అంటేనే ఇష్టం నా మాట వినడు కదా నా మాట విన్న అభి డాక్టర్ అయ్యాడు దివ్య కూడా డాక్టర్ కాబోతుంది ప్రేమ్ నా మాట వింటే ఎప్పుడో  బాగుపడే వాడు అని వెటకారంగా మాట్లాడతాడు.తరువాత తులసి ప్రేమ్ తో నువ్వు సమాధానం మాటలతో కాదు ప్రేమ్ నీ పాటతో వాళ్లకి అర్థమయ్యేలా చెయ్యాలి అని ధైర్యం చెపుతుంది.ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.