వాస్తవాలు కొన్ని వెంటనే వెలుగులోకి వస్తాయి. మరికొన్ని ఆలస్యంగా వెలుగుచూస్తాయి. మొత్తానికి నిజం ఏదో ఒకరోజు నిజం బయటికి వస్తుంది. అలాంటి ఓ చేదు నిజం ఇప్పడు చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే అక్కేనేని నాగార్జున, దగ్గుబాటి లక్ష్మీ విడాకులు తీసుకున్న ౩౩ ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది.
స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు ముద్దుల కూతురు లక్ష్మీ. స్టార్ హీరో అక్కేనేని నాగేశ్వర రావు కొడుకు నాగార్జున. రెండు కుటుంబాలు సినీ ఫీల్డ్ లో ఉండటంతో రెండు కుటుంబాలు ఎంతో అనుబంధం ఉండేది. అయితే అప్పుడే అమెరికాలో ఎంబిఏ చదువు పూర్తి చేసుకున్న నాగర్జున ఇండియాకు వచ్చాడు.
అప్పుడు లక్ష్మీ, నాగార్జున ప్రేమలో పడ్డారు. ఆమె పెట్టిన మొదటి కండిషన్ ఒక్కే. సినిమాల్లో నటించరాదు అని. దానిని అతను ఒప్పుకున్నాడు. అప్పటికి హీరో కావాలనే తలంపు అతనికి ఏ కోశానా లేదు. ఈ ప్రేమను పెద్దలు ఒప్పుకున్నారు. వీళ్ళిద్దరి పెళ్లి 1984 లో జరిగింది. 1986లో నాగచైతన్య పుట్టాడు. అప్పటివరకు అందరు సంతోషంగా ఉన్నారు.
అప్పటికే నాగార్జున ఓ కొత్త పరిశ్రమ పెట్టాలని యోచించారు. ట్యూబ్ లైట్ నిర్మాణంలో వాడే వైట్ లెడ్ పౌడర్ విదేశాలనుంచి తెప్పించేవాళ్ళు. ఆ ఫాక్టరీ ఇండియాలో తొలిసారి పెట్టాలని నాగార్జున పట్టుదలతో ఉన్నాడు. కానీ విధి చాలా విచిత్రమైనది. హీరో కావాలి అనుకున్న అక్కినేని వెంకట్ హీరో కాలేకపోయాడు. అతను ఆ ఫాక్టరీ బాధ్యతలు తీసుకోగా, నాగార్జున హీరోగా మారాల్సి వచ్చింది. అది ఇష్టంలేని లక్ష్మీతో గొడవలు మొదలయ్యియి.
అప్పటికే నాగార్జునన్ను వల్లో వేసుకుని హీరోయిన్ వేషాలు కొట్టేయాలని కొత్త అమ్మాయిలు వెంటపడే వాళ్ళు. నాగార్జున ఎంత క్రమశిక్షణ తో ఉన్నపటికీ పలు పుకార్లు రాజ్యమేలేవి. అవికాస్త లక్ష్మీ చెవిన పడ్డాయి. ఆమె ఇక సహించలేకపోయింది. తాను కావాలో, సినిమా కావాలో తేల్చుకోమని ఆమె తిరగబడింది. సినిమా రక్తం పంచున్న అతను సినిమా వైపే మొగ్గు చూపారు.
1990లో నాగార్జున, లక్ష్మి ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత అతను అమలను రెండో పెళ్లి చేసుకున్నారు. తర్వాత లక్ష్మీ తాను కోరినట్లు సినిమా పరిశ్రమకు సంబంధం లేని వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకుని బెంగుళూరులో స్టిరపడింది. ఆమె తన కొడుకు చేతుని సినిమాల్లోకి రాకుండా కట్టుదిట్టం చేసింది. కానీ నాగార్జున సినిమా రక్తం ఎటుపోతుంది? అతను కూడా సినిమాల్లోక్కి రాగానే లక్ష్మీ మరో సారి జీవితంలో ఓడిపోయింది.