మైత్రీ మూవీస్ పై ఐటీ రైడ్స్ – స్టార్ హీరోల పారితోషకంపై ఆరా

ఇటీవల మైత్రి మూవీస్ పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థతోపాటు డైరక్టర్ సుకుమార్ నివాసం, కార్యాలయంలోనూ ఐటీ తనిఖీలు చేపట్టింది. ఇందులో అధికారులు కొన్ని కీలకమైన ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది.

Advertisement

మైత్రీ మూవీస్ సినిమాల ద్వారా హీరో, హీరోయిన్లకు ఇచ్చే పారితోషకం వివరాలను గుర్తించినట్లు సమాచారం. జనరల్ గా హీరో, హీరోయిన్స్ కు ఇచ్చే పారితోషకాలు బ్లాక్, వైట్ లలో ఇస్తుంటారు. మొత్తాన్ని వైట్ లో అస్సలు చూపించరు. హీరోలకు ట్యాక్స్ నుంచి వెసులుబాటు కల్గించేందుకు ఇలా చేస్తుంటారు.

Advertisement

మైత్రీ మూవీస్ అగ్రశ్రేణి హీరోస్ తో సినిమాలు చేస్తోంది. హీరోస్ కు ఇచ్చే పారితోషకం ఎనభై కోట్ల వరకు ఉంటుంది. బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ తో ఓ సినిమాను నిర్మిస్తోంది మైత్రీ మూవీస్. ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ తోపాటు టెక్నిషియన్లకు అడ్వాన్స్ చెల్లింపులు కూడా పూర్తయ్యాయి.

ఈ సమాచారమంతా ఐటీ సేకరించింది. ప్రభాస్ తోపాటు మైత్రీలో పని చేస్తోన్న హీరోలకు ఎంత పారితోషకం ఇచ్చారు..? ఎలా ఇచ్చారు..? ఇందులో వైట్ ఎంత..? బ్లాక్ ఎంత..? అనే సమగ్ర సమాచారాన్ని ఐటీ సేకరించింది. దీంతో మైత్రీ నిర్మిస్తోన్న సినిమాలో హీరోలుగా చేస్తోన్న వారిలో కొంచెం ఆందోళన కనిపిస్తోంది.

Advertisement