సుప్రీంకోర్టులో షాక్ – మరికాసేపట్లో అవినాష్ రెడ్డి అరెస్ట్

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేకా కూతురు సునీతా వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యాహ్నం విచారణ చేపట్టింది. అవినాష్ రెడ్డి తరుఫున ముకుల్ రోహాత్గీ వాదించగా…సునీత తరుఫున సిద్దార్థ లూద్రా వాదించారు. ఈ సందర్భంగా హైకోర్టు ఉత్తర్వులపై సీజేఐ ధర్మాసనం మండిపడింది.

Advertisement

హైకోర్టు ఉత్తర్వులను అపార్ధం చేసుకున్నారని ముకుల్ రోహాత్గీ వాదించారు కానీ ఆయన వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. సుప్రీంకోర్టు ధర్మాసనం వాలకం అర్థమైన అవినాష్ రెడ్డి తరుఫు న్యాయవాది చివరికి పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంటామని ప్రతిపాదన పెట్టారు. మామూలుగనైతే ఇందుకు అంగీకరించేవారమని కాని ఇక్కడ హైకోర్టు అసాధారణ ఉత్తర్వులు ఇచ్చిందని అందుకే తాము అంగీకరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేశారు. అయితే…వేరే న్యాయమూర్తి ముందు పెట్టాలనే ప్రతిపాదనను అవినాష్ రెడ్డి తరుఫు న్యాయవాది సుప్రీం ధర్మాసనం ముందు ఉంచారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టుఉత్తర్వులను కొట్టి వేయడమే కాకుండ వివేకా హత్య కేసు విచారణలో సీబీఐకి ఇచ్చిన గడువును పొడిగించింది. జూన్ 30 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అనేక ప్రయత్నాలు చేశారు లాయర్లు. కానీ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అయితే… చివరికి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందని తెలిసి… హై కోర్టులో ఇంకా కొన్ని పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి కనుక విచారణ పూర్తయ్యే వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించాలని అభ్యర్థించారు. కానీ అందుకు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో అవినాష్ రెడ్డిని సీబీఐ ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకష్మ ఉంది.

Advertisement