Janaki Kalaganaledu 15th July Today Episode : జానకి కలగలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా విడుదలైంది. 15 శుక్రవారం ఎపిసోడ్ 345 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జానకి వాళ్ళ అత్తయ్య మామయ్య మాట్లాడుకున్న మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. మొన్న జరిగిన ఫస్ట్ నైట్ కార్యక్రమంలో వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండే సీన్లో తన ఐపీఎస్ బుక్ కింద పడుతుంది. రామాకి తను ఐపీఎస్ కళ గుర్తుకొస్తుంది. నా బాధ్యతను గుర్తు చేయడం కోసం అది కింద పడినట్టుంది. అని అంటాడు.
మీకు ఇష్టమైన ఐపీఎస్ ను అందించడం నా బాధ్యత అని జానకికి చెప్పాడు , జానకి నా చదువుతో పాటు అలాగే అత్తయ్య గారి ఆశయాన్ని కూడా నెరవేరుస్తానండి. అని అంటుంది. తల్లి అయిన తర్వాత ఐపీఎస్ కి సెలెక్ట్ చేస్తారా. ఒకసారి ఆలోచించండి .తీసుకుంటారా అసలు ఆలోచించండి అని రామా అంటాడు. మీ ఐపీవ్స్ కల నెరవేరకపోతే మీరు తట్టుకోగలరా చెప్పండి. మీ అమ్మానాన్న కోరిక కూడా అదే కదా వాళ్ళ ఆత్మ శాంతించాలని మనం మీ కల నెరవేర్చాల్సిందే అని రామా అంటాడు. జానకి కన్విన్ చేయాలని చూస్తుంది. కానీ రామ అసలు వినిపించుకోడు నేను మీ కల నువ్వు కచ్చితంగానెరవేరుస్తాను.
Janaki Kalaganaledu 15th July Today Episode : రామ జానకి మాట వింటాడా…
మీరు ఏది చెప్పినా అని అంటాడు. రామ గారు మీరు దయచేసి ఒక్కసారి నా బాధను అర్థం చేసుకోండి. మన మీద పెట్టుకున్న ఆశలను మనం నెరవేర్చాలండి అని రామని ఎంతో కన్విన్స్ చేయాలని చూస్తుంది. కానీ రామ జానకి చెప్పింది. వినిపించుకోకుండా తన నా బాధ్యతని నేను నెరవేరుస్తాను. రెండేళ్ల తర్వాత మన కొత్త సంసార జీవితాన్ని సాగిద్దాం అనేసి అంటాడు. అత్తయ్య మామయ్యను బాధపెట్టే రైట్స్ నాకు లేవండి నా మాట వినండి అని అంటుంది. జానకి, నా భార్య కళ్ళలో నీరుని చూసి తట్టుకునే శక్తి నాకు లేదండి. మీ చదువు పూర్తి అయిన తర్వాత అప్పుడు కచ్చితంగా అమ్మకి ఇచ్చిన మాటను నెరవేర్ధం.
అని రామ అంటాడు. జానకి అదంతా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య గారు నా మీద పెట్టుకున్న నమ్మకం నాకు పిల్లలు పుడతారని ఇంటికి వారసలు వస్తారని తను సంతోషపడుతున్నారు. కానీ ఆవిడ నమ్మకాన్ని మేము మోసం చేస్తున్నాం. ఇదంతా నాటకమని ఆవిడకి తెలిస్తే నన్ను క్షమించడం కాదు కదా నా మొహం కూడా చూడడానికి కూడా ఇష్టపడరు, ఆవిడే నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నా బాధ్యత అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రామ షాప్ కెళ్ళి అక్కడ కూడా అలా ఎలా జరిగింది. అని ఆలోచిస్తూ ఉంటాడు. నేను నా మనసుని చాలా అదుపులో పెట్టుకున్నాను.
అలా జరిగే అవకాశం లేదు అని అనుకుంటూ ఆలోచిస్తాడు. ఇంతలో జానకి ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నారండి అని అడుగుతుంది. ఏం లేదండి ఆలోచిస్తున్నానండి అని అంటాడు. ఏంటండీ జానకి గారు ఫోన్ చేశారు. జానకి మీరు బాగా గుర్తొస్తున్నారు మీరు చేసిన అల్లర్లు మీరు చేసిన అలజడి అన్ని బాగా గుర్తొస్తున్నాయండి. అని జానకి అంటుంది.నాకు గుర్తున్నంతవరకు రాత్రి ఏమీ జరగలేదు ఈ విషయం కోర్టులో చెప్పమన్నా చెప్తాను. అని అంటాడు. ఏంటి చేయాల్సినంత చేసి తూచుంటే సరిపోతుందా అని ఆటపట్టిస్తోంది. జానకి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అయ్యా నువ్వు అని గట్టిగా అంటుంది. జానకి, హాయ్ బాబాయ్ మీరేంటంటే అలా మాట్లాడేసారు ఒక్కసారే అని రామ అంటాడు.
మీరు ఇంటికొచ్చే ముందు ఒక ఐదు మురలు మల్లెపూలు, స్వీట్స్ తీసుకుని రండి. అంటుంది.జానకి, ఎందుకండీ దేవుడి కోసమా అని అడుగుతాడు రామ తెలిసే అడుగుతున్నార,తెలియక ,అడుగుతున్నారు మీరు, అ పూలు దేవుడు కోసం కాదు మీ దేవి పూజ కోసం, అంటూ జానకి తనని సరసమాడుతుంది. రామ కంగారు పడుతూ ఉంటాడు తనకి ఏం చేయాలో అర్థం కాదు. జానకి రామ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మల్లికాకు ఎక్కిల్లుతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. చికితను పిలుస్తూ ఉంటుంది. చికిత రాకపోయేసరికి తనని తిట్టుకుంటూ ఉంటుంది. అని నీళ్లు తాగడానికి బయటికి వస్తుంది. అంతలో జానకి రామ కోసం ఎదురుచూస్తూ డోర్ దగ్గర కనపడుతుంది. మల్లిక ఆశ్చర్యంగా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది.
కంగారుగా జానకి వెనక పరిగెడుతుంది. వాళ్లను గమనిస్తూ ఉంటుంది. రామ వస్తాడు. పదండి అని రామని చేయి పట్టుకొని తీసుకొని వెళుతుంది. జానకి, మల్లిక వాళ్ళ ఏకాంతం చెడగొట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది. విష్ణు ఈ పిచ్చిది నాకోసం ఎదురు చూస్తూ ఉంది. పాపం అని అనుకుంటూ మల్లిక దగ్గరికి వస్తాడు. మల్లికా నాకోసం ఎదురు చూస్తున్నావా అయితే వెళ్లి వెడి నీళ్లు పెట్టు అని అంటాడు. విష్ణు, మల్లిక ఆశ్చర్యంగా చూస్తూ మల్లికా, విష్ణు ను తిడుతుంది. విష్ణు ఫ్రస్టేషన్ తో అక్కడినుంచి వెళ్ళిపోతాడు.
మల్లిక వాళ్ళని ఎలా డిస్టర్బ్ చేయాలని చూస్తూ ఉంటుంది. మల్లిక వాళ్ళ గది వైపు చూస్తూ ఏం చేయాలి ఏం చేయాలో అని ఆలోచిస్తుంది. అంతలో జ్ఞానంబ, గోవిందరాజులు ఇద్దరు వస్తారు. మల్లిక అత్తయ్య గారు మీరా అని భయపడినట్లు డ్రామా చేస్తుంది. నీకు బుద్ధి ఉందా అసలు నీ భర్తను నువ్వు సరిగా పట్టించుకోవా అసలు గౌరవం ఉంటుందా. అని జ్ఞానం మల్లికను తిడుతుంది. అయ్యో అదేంటి అత్తయ్య గారు నా భర్త అంటే నాకు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది. మరి అదేంటే విష్ణు వేడి నీళ్లు పెట్టమంటే వాన్ని చిరాకు పడుతున్నావ్.
అయ్యో అది చిరాకు కాదు అది సరసం అండి అని సిగ్గుపడుతూ ఉంటుంది. చాల్లే ఆపు ఇంకొక్కసారి వాడు చెప్పిన మాట వినకపోతే తెలుసుగా అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. జ్ఞానంభ, అమ్మ మల్లికా ఎక్కడికి వెళ్తున్నావ్ గోవిందరాజు అంటాడు. అత్తయ్య గారుకి మాటిచ్చాను కదా అందుకే వెళ్తున్నాను మావయ్య గారు అంటుంది. పిచ్చిపిచ్చిగా ఆలోచించుకుంటూ జానకి రామ వాళ్ళ గదిలోకి వెళ్తున్నావు అని అంటాడు గోవిందరాజు, అవునా అని ఆశ్చర్యంగా చూస్తుంది .మల్లిక, తర్వాత ఏం జరుగుతుందో చూడాలి అంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…