Janaki Kalaganaledu 20th July Today Episode : జానకి కలగలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా ప్రసారం అయ్యింది. 20 బుధవారం ఎపిసోడ్ 348 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. జానకి గారు మీరు దెబ్బ తగలకుండా ఇలా ఎందుకు చేస్తున్నారు. అని రామా అడుగుతాడు. మీకు నాతో గడపాలని ఉంది. అది నేను రాత్రి గమనించాను, మీరు నా చదువు కోసం మీ ఇష్టాలని, కోరికలను, అన్ని చంపుకుంటున్నారు. అందుకే నేను ఇలా చేశాను. అని అంటుంది. జానకి, మీ చదువు కోసం మనిద్దరం మనుసు నీ అదుపులో పెట్టుకోవాలండి. అని నీ షాప్ కి వెళ్తాను. అని అంటాడు. జానకి అత్తయ్య గారు మిమ్మల్ని ,ఈరోజు మొత్తం నాతో ఉండమని చెప్పారు.
ఇప్పుడు ఏం చెప్పి మీరు షాప్ కి వెళ్తారు. మీరు ఏం చెప్పి వెళ్తారో చెప్పండి. నేను చెప్పనా నాతోనే ఉండిపోండి, ఈరోజు మొత్తం అని హత్తుకుంటుంది. రామ తన మనసుని కంట్రోల్ చేసుకుంటూ మీ అల్లరికి నేను ఒక శిక్ష వేస్తాను. అని అంటాడు, మల్లిక ఆ అరటి తొక్కను పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఏదో ఉంది అనుకుంటుంది, రామ బుక్స్ తీసుకొచ్చి జానకి ఇచ్చి ఈరోజు మొత్తం మీరు చదువుతూనే ఉండాలి. నేను ఇంట్లో ఉన్నందుకు మిమ్మల్ని చదివిస్తూ ఉంటాను. మనం మళ్లీ అకాడమీకి వెళ్లే వరకు అని జానకి బుక్స్ చేతిలో పెట్టి, చదువుకోమని చెప్తాడు. మల్లిక వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చి చాటుగా చూస్తుంది.

జానకి చదువుతుందా అయితే ఈ విషయాన్ని వెంటనే పోలేరమ్మకి చెప్పాలి అని జ్ఞానంబ దగ్గరికి వెళుతుంది. జ్ఞానంబ, గోవిందరాజు ఇద్దరు జానకి దెబ్బ తగిలిందని బాధపడుతూ ఉంటారు. ఇంతలో మల్లిక అక్కడికి వచ్చి జానకి మీద చాడీలు చెప్పడం స్టార్ట్ చేస్తుంది. జానకి కోసం కాలేజీ నుంచి ఫోన్ చేశారు రాత్రి అని నేను చెప్తే మీరు నమ్మలేదు, కదా ఇప్పుడు జానకి పెద్ద పుస్తకాలు ముందేసుకుని చదువుతోంది. అత్తయ్య గారు, అనగానే జ్ఞానంబ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది. ఏంటి జానకి చదువుకుంటున్న అని జ్ఞానంబ మల్లికను అడుగుతుంది.
Janaki Kalaganaledu 20th July Today Episode : మల్లిక చెప్పింది నిజంగానే జరుగుతుందా…
మల్లిక అవునత్తయ్య గారు ఇంకో గంటలో ఎగ్జామ్ ఉంటే ఎలా చదువుతారు శ్రద్ధగా అలా చదువుతుందుంది అండి, రండి మీరే చూద్దురుగాని, అని అని అంటుంది మల్లికా, నా నంబర్ ఎక్కడికే ఇచ్చేది తను కాళ్ళు నొప్పితో బాధపడుతుంటే నువ్వు తన మీద చాడీలు చెప్తున్నావా, వెళ్ళు ఇక్కడనుంచి విసిగించకు అని మల్లికను తిడుతూ ఉంటుంది. మీరు ప్రేముంటే నమ్ముతే నమ్మొచ్చు గాని మరీ ఇంత గుడ్డిగా నమ్మకూడదు అత్తయ్య గారు నేను చెప్పేది నమ్మాలంటే మీరు ఒకసారి చూడాల అత్తయ్య గారు అని ప్లీజ్ ప్లీజ్ అత్తయ్య గారు అంటుంది. జ్ఞానం ఎక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా అని తిడుతుంది.
గోవిందరాజు నీ కాళ్లు కాలింది కదా ఎలా మామూలుగా నడుస్తున్నాము అని అడుగుతాడు. అప్పుడు మల్లికా నా రూమ్ లో ఎక్స్ట్రా కాలు ఒకటుంది. మావయ్య గారు దాన్ని పెట్టుకొని కాలిన కాలునీ తీసి పక్కన పెట్టి వచ్చాను. అని అంటుంది. గోవిందరాజు అబ్బో ఈ ఎటకారం మామూలుగా లేదుగా అని అంటాడు. అవునండి చెప్పిన మాట వినకపోతే కడుపులో మంట ఎటకారం గానే మారుతుంది. అని అంటుంది. మల్లికా, గోవిందరాజు తోటి కోడలు మీద చాడీలు చెప్పడం ఈ మల్లికా ఎప్పుడు మాంటుందో ఏంటో అని అంటాడు.
మల్లిక జానకి చదువుతుందని ఎలా తెలియజేయాలి అని ఐడియా ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. రూమ్ లో జానకిని రామ చదువుకోమని అంటుంటాడు జానకి నేను చదువుకోను అని మారం చేస్తూ ఉంటుంది. మల్లిక వాళ్ళ అత్తయ్య గారిని మావయ్య గారిని తీసుకొని వస్తుంది. జానకి వాళ్ళ రూమ్ దగ్గరికి, జానకి చదువుకోవడం అన్నది అబద్ధం అయితే నేను గుండు గీయించుకుంటాను, అత్తయ్య గారు రండి అని అంటుంది. చూడండి అత్తయ్య గారు చూడండి అని వాళ్ళ రూం డోర్ తీసి చూడమని చెప్తుంది. జానకి రామ ఒకరినొకరు కౌగిలిగించుకుని ఉంటారు.
మీరే చూశారుగా అత్తయ్య గారు ఇప్పుడు ఏమంటారు అత్తయ్య గారు అని జ్ఞానం దగ్గరికి వెళ్తుంది. మల్లికా, అప్పుడు జ్ఞానంబ, మల్లికను ముట్టికాయ వేస్తుంది. ఏంటి అత్తయ్య గారు నన్ను కొడుతున్నారు జానకి చదువుకునేది చూసి కూడా మీరు అని అంటుంది. మల్లిక, పిచ్చిదానా, ఒకసారి అటువైపు చూడు అని చూపిస్తుంది. జానకి రామ ఒకరిని ఒకరు అత్తుకొని ఉండడం చూసి, మల్లిక అవాక్కయితుంది. జానకి అంతకుముందు నేను చదువుకోవాలంటే మీరు నాకు ఒక హాగ్ ఇవ్వాలి. అని రామని అడుగుతుంది. అప్పుడు రామ కష్టంగా ఒప్పుకుంటాడు.
ఇచ్చాను కదా ఇప్పుడు బుద్ధిగా చదువుకోండి అని చెప్తాడు. మల్లిక అత్తయ్య గారు నేను చూసినప్పుడు జానకి బుక్స్ పట్టుకొని ఉండండి. జ్ఞానాంబ జానకి నిన్ను చెల్లెల్లగా చూసుకుంటుంది ఏ రోజైనా నీ మీద ఇలా చాడీలు చెప్పిందా, నువ్వెందుకు ప్రతిసారి ఆ అమ్మాయి మీద ఏదో ఒకటి చెప్పాలి. అని చూస్తావు అని గట్టిగా క్లాస్ పీకుతుంది. ఇంకొక్కసారి ఇలా చెప్పావనుకో నువ్వు మీ పుట్టింట్లో ఉంటావు అని వెళ్ళిపోతుంది. గోవిందరాజు అమ్మ మల్లికా ఏదో శబ్దం గుండు గీయించుకుంటాను అన్నావు కదా. అవన్నీ ఎప్పుడమ్మా అని ఇంకెప్పుడు ఇలా చేయకు అని చెప్పి వెళ్ళిపోతాడు.
మల్లిక కుళ్లుకుంటూనే ఉంటుంది. రామతో జోక్స్ చేస్తూ ఉంటుంది జానకి ఇంకొకసారి హగ్ ఇస్తారా అని అంటూనే ఉంటుంది. రామ ఇంకోసారి లేదు ఏం లేదు చదువుకోండి అని అంటాడు. మల్లిక మల్లి వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చి చూస్తుంది. అప్పుడు జానకి చదువుకుంటూ ఉంటుంది. జ్ఞానంబ ఇంతలో అక్కడికి వస్తుంది. అక్కడ ఏం చేస్తున్నావని ఇట్రా అని తిడుతుంది. కొడుతుందేమోనని ఏడుస్తూ ఉంటుంది మల్లిక, జ్ఞానంబ రావే వంట చేద్దువు గాని నువ్వు, ఈరోజు అందరికీ నువ్వే, వంట చేయాలి అని దగ్గరుండి చేపిస్తుంది. జానకి రామ అకాడమీకి వెళ్లడానికి రెడీ అయి బయటికి వస్తారు. మల్లిక మల్లి అది చూస్తుంది రూమ్ దగ్గరికి వెళ్లి జానకి హ్యాండ్ బ్యాగ్ లో బుక్స్ పెట్టుకోవడం చూస్తుంది.
ఈ టైంలో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు. అని ఆలోచిస్తూ ఉంటుంది. జ్ఞానాంబ గోవిందరాజు బయట కూర్చుని ఫ్రూట్స్ తింటూ ఉంటారు. అప్పుడు జానకి, రామ వీళ్ళు బయటే ఉన్నారు. ఎలా వెళ్లాలని ఆలోచిస్తూ వారి దగ్గరికి వస్తారు. జ్ఞానాంబ ఎక్కడికి రామ మీరు అని అడుగుతుంది. అప్పుడు రామ కంగారు పడుకుంటూ జానకి గారు ఏదో చిన్నచిన్న వస్తువులు తీసుకుందాం అనుకుంటున్నారు. అందుకే వెళ్తున్నాను అమ్మ అని అంటాడు. ఇంతలో మల్లిక అక్కడికి వచ్చి జానకికి అసలే కాలు నొప్పి కదా. ఈ టైంలో ఎలా బయటికి తీసుకెళ్తారు, బావగారు అని అంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..