Guppedantha Manasu 20th July Today Episode : రిషి ని భోజనానికి పిలిచిన సాక్షికి, షాకిచ్చిన రిషి ఏం జరిగుంటుంది.

Guppedantha Manasu 20th July Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ 20-july-2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసం. రిషి వసుదార ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి జగతి,మహీంద్రా వస్తారు. వాళ్ళు రాగానే రిషి టాపిక్ మారుస్తాడు.వసుదార చదువుల పండుగ సందర్బం మనం గ్రాండ్గా చెయ్యాలి.అని అనగానే మహీంద్రా జగతి ఇద్దరూ సైగ చేసుకుంటూ ఉంటారు. రిషి వసుదార ఇద్దరూ వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోగానే మహేంద్ర చూడు జగతి మనం రాగానే ఇద్దరూ వెళ్లిపోతున్నారు అని అంటాడు.నేను అలిగాను జగతి అని మహీంద్రా అంటాడు. ఎందుకు మహీంద్రా ఎవరిమీద అలిగావు అని అంటుంది జగతి. నీమీదే అలిగాను జగతి అని మహీంద్రా చెప్తాడు.

నేనేం అన్నాను మహీంద్రా నామీద ఎందుకు అలిగావు అని అడుగుతుంది జగతి.రిషి , వసుధార చూడు వాళ్ళెంత,వాళ్ళ పరిచయం ఎంత అప్పుడే డ్రెస్సులు, గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. ఇన్నిరోజులు పరిచయంలో మనం ఎప్పుడైనా అలా చేస్తావా అని మహీంద్రా అంటాడు. ఒక్కరోజన్నా అయినా ఒక గిఫ్ట్ అయినా ఒక్క కర్చీఫ్ అయినా ఇచ్చావ అని మహీంద్రా జగతితో అంటాడు. నువ్వు కథ మహేంద్రనాకు ఇవ్వాల్సింది అని జగతి అంటుంది. సరే వెళ్దాం పద అని అనుకొని వెళ్లిపోతారు.ఇకపోతే రిషి అటువైపుగా వెళుతుంటే వసుధార బోర్డుపైనా వేసినా డ్రాయింగ్ చూసి లోపలికి వచ్చి దాన్ని చూస్తూ ఉంటాడు.

Guppedantha Manasu 20th July Today Episode : రిషి ని భోజనానికి పిలిచిన సాక్షికి, షాకిచ్చిన రిషి ఏం జరిగుంటుంది.

Guppedantha Manasu 20th July Today Episode
Guppedantha Manasu 20th July Today Episode

ఒకసారి రెస్టారెంట్లో రిషి వసుదారకి ఇచ్చిన నెమలీక గుర్తుకు వస్తుంది దాన్ని గుర్తు తెచ్చుకొని రిషి ఆశ్చర్యపోతాడు.ఆ డ్రాయింగ్ వసుదార వేసింది అని కన్ఫమ్ చెసుకుంటాడు. అందమైన జ్ఞాపకం ఎక్కువగా వసుధార నోటి నుంచే విన్నాను అని అనుకొని ఆ డ్రాయింగ్తో రిషి సెల్ఫీ దిగుతాడు.రిషి బయటికి వెళ్తుంటే సాక్షి ఎదురుపడి రిషి నీతో ఒక విషయం మాట్లాడాలి ఇది నా పర్సనల్ అని ఆపుతుంది.పర్సనల్ అంటే ఏదో అనుకునెవు ఏంలేదు రిషి నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి అని సాక్షి చెప్తుంది. నేను ఏదో అబద్ధం చెప్పి నిన్ను పిలవడంలేదు రిషి కేవలం భోజనానికి కథ పిలిచేది నువు నన్ను ఎందుకు శత్రువులాగా చూస్తున్నావు రిషి.

భోజనానికే కదా పిలుస్తుంది రావొచ్చు కదా అని సెంటిమెంటుగా మాట్లాడుతుంది సాక్షి.రిషితో మాట్లాడుతుంది వసుదార కూడా చూస్తూ ఉంటుంద. రిషి సార్ ఒప్పుకోవద్దూ ఒప్పుకోదు అని మనసులో అనుకుంటు౦ది.రిషి మాత్రం సరె సాక్షి నేను భోజనానికి వస్తాను అని ఒప్పుకుంటాడు.సాక్షి రెడీ అవుతూ ఏదోవిధంగా రిషి ని పెళ్లికి ఒప్పించాలి నువ్వూ భోజనానికి రావడానికి ఒప్పుకున్నామంటే అదే నాకు ఒక కొత్త విషయం అని మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది.ఫుడ్ వచ్చిందేమో అని సాక్షి అనుకుంటుంది కానీ చూస్తే రిషి వస్తాడు.రిషి అని ఆశ్చర్యపోయి నా గెటప్ చూసి ఆశ్చర్యపోయినట్టు వున్నాడు అని మనసులో అనుకుంటు౦ది సాక్షి.

లోపలికి రమ్మంటావా అని రిషి అంటాడు.వెల్కమ్ రిషి అని సాక్షి అనగానే వెల్కమ్ నా ఒక్కడికే కాదు అని రిషి అంటాడు. వెంటనే వెనకనుండి గౌతమ్ హాయ్ అని చెప్తూ వస్తూ ఉంటాడు అలాగే జగతి వస్తుంది అలాగే మహీంద్రా వస్తాడు.ఏంటి సాక్షి షాక్ అయ్యావా అని గౌతమ్ అంటాడు. సర్ప్రైజ్ అయినట్టుంది అని జగతి అంటోంది. మనమందరం వచ్చినందుకు సాక్షి సంతోషపడుతుంది అని మహేంద్ర అంటాడు. ఎలాగో చదువుల పండగ మీటింగ్ ఉంది కథ సాక్షి దానికోసం అందర్నీ ఇక్కడికి రమ్మని చెప్పాను భోజనం చేస్తూ మాట్లాడుకోవచ్చు అని రిషి సాక్షితో చెప్తాడు.

ఇంతలో గౌతమ్ రిషి మనమందరం చెప్పకుండా వచ్చాము భోజనానికి ఇబ్బందవుతుందేమో మనమందరం వస్తామని సాక్షికి తెలవదు కదా అని గౌతం అంటాడు. వెంటనే రిషి సాక్షి ఆల్రౌండర్గా తను భోజనం వెంటనే రెడీ చేసేది తనకెలాంటి ఇబ్బంది ఉండదు అని రిషి అంటాడు.ఎవరో మిస్సయినట్టే ఉన్నారు అని గౌతమ్ అనగానే నేనెలా మిస్ అవుతాను సార్ అంటూ వసుధార వస్తుంది. వసుధారని చూసి సాక్షి షాక్ అవుతుంది సాక్షి.మీ ఇంటికి పిలిచినందుకు ధన్యవాదాలు అని వసుధార సాక్షితో చెప్తుంది. లోపలికి వెళ్దామా అని అందరూ లోపలికి వెళ్తారు.

అందరూ సోఫాలో కూర్చున్న తర్వాత గౌతమ్ సాక్షి గారు కిచెన్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు కిచెన్ ఎందుకు అని సాక్షి అంటోంది.మీరు ఏమేం వంటలు చేశారో చూడాలని చాలా ఆశగా ఉంది అని గౌతమ్ అంటాడు.ఏంటి నేను రిషిని పిలిస్తే వీళ్లందరూ వచ్చారు నేను నా కోసం రిషి కోసం మాత్రమే ఫుడ్ ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది సాక్షి.ఏంట్రా నువ్వు అలా అంటున్నావు అని రిషి అనగానే తప్పేముందిరా మనం వచ్చింది భోజనం తినడం కోసమే కదా అందుకే సరదాగా అడిగాను అనే గౌతం అంటాడు.నేనడిగిందాంట్లో ఏమైనా తప్పుందా వసుదార అని గౌతం అంటాడు. ఏం తప్పు లేదు సార్ అని వసుధార చెప్తోంది

. వసుధరా ఇప్పుడు మనిద్దరం ఒక గేమ్ ఆడుదాం మనిద్దరం సాక్షి ఏమేం వంటలు చేసిందో అని అనుకుందాం.సౌత్ సైడ్ ఫుర్డ్ చేసినట్టుంది అనే గౌతమ్ అంటాడు.వెంటనే వసుధార ఏంటి సార్ మీరు సాక్షి ని తక్కువ అంచనా వేస్తున్నారు తాను అన్ని దేశాల నుండి తిరిగి వచ్చింది కాబట్టి తను మనమూ ఊహించిన దానికంటే ఎక్కువ చేసి ఉంటుంది అని వసుధార అంటోంది. ఇంతలో జగతి ఏంటి సాక్షి భయపడుతున్నావవు ఒకేసారి ఇంతమంది వచ్చామని ఆలోచిస్తున్నావా ఏం ఫర్వాలేదు ఉన్నదాంట్లోనే సర్దుకొని తిందాం అని జగతి అంటోంది.

సరే ఇక మీటింగ్ మొదలుపెడదాము చదువులు పండగ గురించి మాట్లాడుకున్న తర్వాత భోజనం చేద్దాం అని రిషి అంటాడు.లేదు ముందే తినాలి అని గౌతమ్ అంటాడు.ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది.ఎవరొచ్చుంటారు అని అందరూ అనుకుంటూ ఉంటారు సాక్షి మాత్రం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేశాను కదా అది వచ్చినట్టుంది ఇప్పుడు ఎలాగా అని అనుకొని వెళ్ళబోతుంటే, నువ్వు వెళ్లు అని గౌతమ్ని పంపిస్తాడు రిషి .నా పని అయిపోయింది అని అనుకుంటూ ఉంటుంది సాక్షి మనసులో .గౌతమ్ వెళ్ళి చూస్తే ఫుడ్ ఆర్డర్ వచ్చింది సార్ అని చెప్పారు. ఆ కవర్ని తీసుకుని లోపలికి వస్తాడు గౌతమ్.సాక్షి నీకు వంట రాగా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తావా.

ఎవర్నైనా భోజనానికి పిలచినప్పుడు స్వయంగా మనం చేసి పెడితే బాగుంటుంది అని అందరూ ఒకరి తర్వాత ఒకరు అంటూ ఉంటారు.ఈ ఫుడ్ నా ఒక్కడికే సరిపోదు మరి మీ అందరికీ ఎలా అని గౌతమ్ అంటాడు. ఏముందిలే సాక్షి క్షణాల్లో వంట చేసి పెడుతుంది అని గౌతం అంటాడు.అలా అనగానే సాక్షి చాలా ఇబ్బంది పెడుతోంది ఏమైనా ఇబ్బందా సాక్షి అనే రిషి అడుగుతాడు నీకు వంటలు రావా అని అడుగుతాడు రిషి .జగతి వెంటనే వసుదార నువ్వు వెళ్లి ఏమన్నా సాయం చెయ్యి అని అంటోంది. వసుదార లేచి సాక్షిగారు వంటలు చేయడం పెద్ద ఇబ్బంది కాదు అదొక పని కాదు అని చెప్తుంది వసుదార.

సాక్షి గారు వంటగదిలో ఏమేం ఉన్నాయో చెప్పండి నేను వెళ్లి క్షణంలో వంట చేస్తాను అని అంటోంది వసుధరా. కిచెన్లో అసలు ఏమేం ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు అని సాక్షి అంటోంది. నేను వెళ్ళి చూస్తాను అని వెళ్తుంది వసుదార.కిచెన్లోకి వెళ్లి చూస్తుందట అసలు కిచెన్లో ఏమైనా ఉంటే కదా ఎలా వంట చేస్తాదొ నేను కూడా చూస్తాను అని అనుకుంటుంది మనసులో సాక్షి.రిషి మమ్మీ డాడీ లేరుకదా కిచెన్లో ఏమేం ఉన్నాయో అవన్నీ వంటమనిషి చూసుకునే ఉంటుంది నాకు తెలియదు అని అంటోంది సాక్షి.

ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానా అని అడుగుతోంది సాక్షి వద్దమ్మా ఇంతమంది ఉన్నాం కదా ఇంట్లో చేసుకుని తింటే బావుంటుంది అని మహీంద్రా అంటాడు. వంట గదిలో ఏం లేవు కదా అని సాక్షి చెప్తోంది. అన్నీ ఉంటే చెయ్యడం కాదు ఏం లేక పోయినా వంట చేయడమే గ్రేటు, వసుధార చేస్తాను అంది కదా అని అంటాడు గౌతమ్. ఇకపోతే మహేంద్ర,జగతితో వసుధార వంట చేస్తే రిషి తింటాడా లేదో అని అంటోంది. ఎందుకు తిన్నడు జగతి ఒకరి గురించి ఒకరికి అభిరుచులు ఇద్దరికీ తెలుసు. అందుకే తను వంట చేస్తాను అని వెళ్లింది అని చెప్తాడు మహీంద్ర. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది