Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు తిరిగి సోమవారం ప్రసారమవుతుంది. 11 జులై 2022 సోమవారం ఎపిసోడ్ 341 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. రామ జానకి ఏకాంతంగా ఉండడాన్ని మల్లిక చూడలేక వాళ్ళ ఏకాంతాన్ని డిస్టర్ బ్ చేసి ,ఇక ఐదు సెంట్ల భూమి నాకే అనుకుంటూ,వెంటనే పిల్లలు కనే పనిలో ఉండాలి .అని అనుకుంటుంది. మల్లికా, జానకి రామ గారు ఆయన సంసార జీవితాన్ని నాకోసంత్యాగం చేస్తున్నాడు. ఎంత కన్విన్స్ చేద్దామన్న అస్సలు వినడం లేదు ఆయనను ఎలా ఒప్పించాలి.
అని అనుకుంటుంది. జానకి, మరోవైపు మల్లికా విష్ణు తో ఇలా అంటుంది. మనం పిల్లల్ని తొందరగా కనేసి ఆ ఐదు సెంట్లు భూమిని మన పేరు మీద రాపిచ్చుకుందామండి, అని విష్ణుకు చెప్తుంది. మల్లిక అరటి పండ్లు గబగబా తింటూ తొక్కలు కింద ఇసురుతు అదే తొక్కపై తను నడుస్తూ కింద పడుతుంది. ఇంకొకపక్క ఇవాళ ఏరువాక పౌర్ణమి అని మనం అందరం పొలానికి వెళ్లి అక్కడ పూజలను నిర్వహించాలని అందరూ తొందర తొందరగా రెడీ అవ్వాలని చెప్తుంది. జ్ఞానాంబ, చెప్పగానే అందరూ రెడీ అయిపోయి పొలానికి వెళ్తారు. రామ జానకి ఇద్దరు కలిసి బండిమీద వెళ్తారు.
Janaki Kalaganaledu : మల్లిక ప్లాన్ రివర్స్ అయిందా.. జ్ఞానాంబకు ఈ విషయం తెలుస్తుందా?

రామ జానకి గారికి ఏదో ఒక రూపంలో అడ్డంకి వస్తుంది. ఇలా అయితే తను ఐపీఎస్ చదువును ఎప్పుడు పూర్తి చేస్తుంది. అని కంగారుపడుతూ ఉంటాడు. రామ, మీరేంటి ఏం మాట్లాడరు అలా కామ్ గా ఉన్నారు అని అడుగుతుంది. జానకి, దాంతో ఏం లేదు జానకి గారు అంటాడు. రామ, తర్వాత పొలం దగ్గర అందరూ కలిసి పూజలు నిర్వహిస్తారు. తరువాత మగవాళ్లు పలుగు, పార పట్టుకొని ఆడవాళ్లు విత్తనాలు పట్టుకొని రండి అని చెప్తుంది. జ్ఞానాంబ, ఆడవాళ్లు విత్తనాలను నాటుతూ వెళ్ళాలి మగవాళ్ళు పారతో మట్టి తీసుకుంటూ వెళ్లాలి అని చెప్తుంది.
జ్ఞానంభ, ఇలా విత్తనాలు చల్లేటప్పుడు మధ్యలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండాలి అలా ఆటంకాలు వస్తే ఈ సంవత్సరంలో పంట పండే విషయాలలో అడ్డంకులు వస్తాయని నమ్ముతారు. అంటుంది జ్ఞానంభ, అప్పుడు మల్లికా ఇదేదో బావుంది. జానకిని ఏదో విధంగా ఈ అడ్డంకులకు కారణమయ్యేలా చేయాలి, పోలేరమ్మతో తనను తిట్టించాలి. అని ప్లాన్ వేస్తుంది. విత్తనాలు నాటడం స్టార్ట్ చేస్తారు. రామ, విష్ణు ఇద్దరు పలుగు, పార పట్టుకుని భూమిని తవ్వుతూ పోతూ ఉంటారు. జానకి, మల్లిక జ్ఞానంబ, చికిత వీళ్ళు విత్తనాలు వేసుకుంటూ వెళ్తుంటారు.ఇంతలో జానకి కాళ్లకు మల్లిక కాళ్ళను అడ్డం పెడుతుంది.
దీంతో జానకి పట్టు తప్పి ముందు ఉన్న గడ్డపార మీద పడబోతుంది. ఇంతలో అక్కడికి రామ వచ్చి జానకిని పడకుండా పట్టుకుంటాడు. తననిపట్టుకుని ఇంకొంచెం ఉంటే జానకి గారికి గడ్డపార కుచ్చుకునేది. ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో అని అందరూ ఊపిరి పీల్చుకుంటారు. మల్లిక వామ్మో నేనేదో జానకిని కింద పడేద్దామనుకుంటే ఇలా జరిగింది ఏంటి కొద్దిగా అయితే గడ్డపార తగిలేది అని అనుకుంటుంది. మల్లికా, జానకి చేతిలో ఇత్తనాల బుట్టని కూడా కింద పడకుండా పట్టుకుంటాడు. రామ, దాంతో మల్లిక షాక్ అవుతుంది. దీని తర్వాత ఏం జరుగుతుందో తెలియాలి అంటే మనం తరువాయి భాగం కోసం వేచి చూడాల్సిందే.