Prabhas : ప్రభాస్ గురించి ఎక్కువగా చెప్పనక్కర్లేదు. ఒక్క బాహుబలి సినిమాతో ఇండియా మొత్తం బాగా పాపులర్ అయ్యాడు. బాహుబలి కి ముందు ప్రభాస్ తెలుగు పరిశ్రమపైనే ఆసక్తి ఉండేది. కానీ ఇప్పుడు తన రేంజ్ పూర్తిగా మారిపోయింది. కేవలం పాన్ ఇండియా అంటున్నారు ప్రభాస్. దానికి తగ్గట్టుగా ప్రతి సినిమాను రూ.200 నుంచి రూ.400 కోట్ల బడ్జెట్ తో చేస్తున్నారు. అలాంటివే సాహో, రాదే శ్యామ్. ఇవి కొద్దిగా నిరాశపరిచిన వెనక్కి తగ్గే ప్రసక్తి లేదంటున్నారు ప్రభాస్.
ఇప్పుడు ప్రతి సినిమాలో స్టార్ పవర్ ఉండేలా చూసుకుంటున్నారు. ప్రతి చిత్రంలో స్టార్ హీరోయిన్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. చాలా కాలంగా ప్రభాస్ సెలెక్ట్ చేసే హీరోయిన్లు చాలా యూనిక్ గా ఉంటున్నారు. పాన్ ఇండియా క్రేజ్ కి బాలీవుడ్ లోని పెద్ద హీరోయిన్లను జత చేస్తున్నారు రెబల్ స్టార్. అయితే ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ భామతో ప్రభాస్ జోడి కట్టబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే సాహోలో శ్రద్ధ కపూర్ తో నటించాడు. తాజాగా సలార్ లో శృతిహాసన్, ప్రాజెక్ట్ కె లో దీపిక పదుకొనే, దిశ పటాని, ఆది పురుష్ లో కృతి సనన్ లతో జోడి కట్టనున్నాడు.
Prabhas : నేను చేసే ప్రతి సినిమాలో వారు ఉండాల్సిందే అంటున్న ప్రభాస్.
అయితే తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో జోడి కట్టనున్నట్లు సమాచారం. సందీప్ రెడ్డి వంగా తో చేయనున్న ‘ స్పిరిట్ ‘ సినిమాలో హీరోయిన్ గా కరీనాకపూర్ ని తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ జోడి అంతగా బాగోదని టాక్ అప్పుడే సోషల్ మీడియాలో మొదలైంది. ఒకవేళ కరీనా కాకపోయినా ఖచ్చితంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఎవరో ఒకరు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని సమాచారం. మొత్తానికి తాను నటించే సినిమాలో కేవలం పెద్ద హీరోయిన్లకే ఎంట్రీ అంటున్నారు ప్రభాస్.