Kiara Advani : కియారా అద్వానీ చేసినవి ఒకటి రెండు సినిమాలే అయినప్పటికీ ఈమె అందం తో తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితం అయిన భామ. తక్కువ కాలంలో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన ఈ భామ తన అందంతో నటనతో ప్రేక్షకులు చూపు తిప్పకుండా చేయటం లో చాలా సక్సెస్ అయిందని చెప్పాలి. ఈమె చేసిన ప్రతి సినిమా లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తో దూసుకుపోతుంది. కియారా అద్వానీ తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంటుంది.
కియారా అద్వానీ టాలీవుడ్ లో భరత్ అనే నేను సినిమాతో మహేష్ బాబు తో జత కట్టి ఇ తన అందాల ఆరబోతతో తెలుగు ప్రేక్షకుల కు బాగా దగ్గరయ్యింది. మహేష్ బాబు తో పోటీగా ఈమె చేసిన అందాల ప్రదర్శన సినిమా కి ఒక గుర్తింపు తెచ్చింది అనడంలో అతిశయోక్తి లేదు. తరువాత కియారా అద్వానీ వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ జత గా చేసి తన అందంతో నటనతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇప్పుడు ఈ భామ విజయ్ దేవరకొండ తో ఒక ఫ్యాన్ ఇండియా సినిమాలో జతకట్టినట్టు ఊహగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడించాల్సి ఉంది.
Kiara Advani : కుర్రాళ్ళ మనసు దోచుకుంటున్నకియారా అద్వానీ.

కియారా అద్వానీ బాలీవుడ్లో ప్రస్తుతం బాగా బిజీగా ఉంటూ వరుస సినిమాలు చేస్తూ పోతుంది. ఈమె చేసిన ప్రతి సినిమా మంచి హిట్లు కావడంతో ఏమిటి వరుస ఆఫర్లు వస్తున్నాయి. కైరా అద్వాని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె చేసిన ప్రతి ఫోటో షూట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఈ మధ్యలో ఒక బ్లాక్ కలర్ డ్రెస్ లో తాను చేసిన ఓ ఫోటో షూట్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. నల్ల చీర కట్టులో ఈ భామ ఓరచూపులు కుర్రాళ్ళ మనసుని దోచే ఎలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ విధంగా ఈ భామ ఎప్పుడూ నెట్టింట హల్చల్ చేస్తూ తన అందాలతో సోషల్ మీడియాలో బాగా క్రేజ్ తెచ్చుకుంటుంది.