Kajal Agarwal : కమల్ హాసన్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్ 2. ఈ సినిమాకు శంకర్ డైరెక్షన్ వహిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది. కొన్ని కారణాల వల్ల ఇండియన్ టు సినిమా ఆగిపోయింది. తిరిగి ఈ సినిమాని యూనిటీ వాళ్లు మొదలుపెట్టడం జరిగింది. ఈ చిత్రంలో కథానాయకగా కాజల్ అగర్వాల్ చేస్తుండగా ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతి పురాతనమైన కిలారిపాయట్టును ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సాధన చేస్తుంది.
తాను కత్తి డాలు పట్టుకొని తెగ కసరత్తులు చేస్తుంది. అయితే ఈ వీడియోని కాజల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా కాజల్ ఈ మధ్యనే బాబుకి జన్మనిచ్చింది. తిరిగి ఇప్పుడు షూటింగ్లో పాల్గొనడం కోసం తిరిగి సాధన చేయడం మొదలుపెట్టింది. ఈ పాత్ర కోసం గుర్రపు స్వారీ కూడా ప్రాక్టీస్ చేయడం ఆ వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ లో కిలరిపాయట్టు అనేది ఓ పురాతన మార్షల్ ఆర్ట్స్. శ్రీలంకలో ఈ మార్షల్ ఆర్ట్స్ పుట్టిందని ఈ యుద్ధ క్రీడ సాధారణంగా గెరిల్లా యుద్ధంలో వినియోగిస్తారని.
Kajal Agarwal : ఇండియన్ 2 సినిమా కోసం కాజల్ అగర్వాల్ కసరత్తులు…
శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండేలా ఈ విద్య ఉపయోగపడుతుంది. అయితే ఈ విద్యని మూడేళ్లగా అతను సాధన చేస్తున్నట్లు ఎంతో ఓపిగ్గా తనకు నేర్పించిన మాస్టర్ కి ధన్యవాదాలు అని తన సోషల్ మీడియాలో తెలియజేసింది. ఈ సినిమాలో సిద్ధార్థ మరియు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, బాభి సింహ, కీలకపాత్రలలో నటించబోతున్నారు. అయితే రెండేళ్ల క్రితమే ఇండియన్ 2 సినిమా మొదలు కాగా ఈ షూటింగ్ లో ప్రమాదం జరిగి ముగ్గురు కార్మికులు మరణించడంతో హఠాత్తుగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.
View this post on Instagram