Viral Video : రోడ్డు మీద బైక్ పై స్టంట్స్ చేసి పోలీసులకు అడ్డంగా బుక్ అయిన యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Viral Video : రోడ్డు మీదికి వచ్చిన ఏ వాహనదారుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలను అడ్డందిడ్డంగా నడిపితే జైలు శిక్ష ఖాయం. ఫైన్ కూడా వేస్తారు. రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. అలా ఉంటేనే జనాలు కూడా సేఫ్ గా రోడ్డు మీదికి రాగలరు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు ప్రవర్తిస్తే.. రోడ్డు మీద వాహనాలు నడిపితే యాక్సిడెంట్లు అవుతాయి. ఒక్కోసారి ప్రాణాలే పోతాయి.

Advertisement
man performs stunt on moving bike video viral
man performs stunt on moving bike video viral

అందుకే.. ఓవర్ స్పీడ్ గా వెళ్లినా, తాగి వాహనాన్ని నడిపినా.. నిర్లక్ష్యంగా నడిపినా పోలీసులు ఊరుకోరు. ఫైన్ వేస్తారు. ఇంకా కావాలంటే జైలు శిక్ష కూడా విధిస్తారు. తాజాగా ఓ యువకుడికి అదే జరిగింది. కానీ.. ఆ యువకుడు ఓవర్ స్పీడ్ గా బైక్ ను నడపలేదు. ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించాడు.. అయినా అతడికి పోలీసులు ఫైన్ ఎందుకు వేశారంటే.. ఆ యువకుడు రోడ్డు మీద బైక్ పై స్టంట్స్ చేశాడు.

Advertisement

Viral Video : బైక్ పై స్టంట్ చేసిన యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్

ఛత్తీస్ ఘఢ్ లోని దుర్గ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు బైక్ పై వెనుక సీటులో కూర్చొన్నట్టు కూర్చొని బైక్ ను నడిపిస్తున్నాడు. కేవలం రైట్ హ్యాండ్ తో ఎస్కలేటర్ ను పట్టుకొని బైక్ ను నడుపుతూ రోడ్డు మీద ఆ యువకుడు హడావుడి సృష్టించాడు. రోడ్డు మీద వెళ్తున్న చాలామంది వాహనదారులు ఆ యువకుడిని చూసి షాక్ అయ్యారు. అతడు చేసే బైక్ స్టంట్స్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే కాదు.. ఆ యువకుడు చేస్తున్న బైక్ స్టంట్ ట్రాఫిక్ రూల్స్ కు విరుద్ధం అని దుర్గ్ పోలీసులు అతడికి రూ.4200 ఫైన్ విధించారు. అలాగే.. అతడితో సారీ కూడా చెప్పించారు. దానికి సంబంధించిన వీడియోను దుర్గ్ పోలీసులు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement