Kajal Agarwal : తెలుగులో ‘ లక్ష్మీ కళ్యాణం ‘ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది కాజల్. ఈ సినిమాను తేజ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా హిట్ కావడంతో తన నెక్స్ట్ మూవీ కృష్ణవంశీ దర్శకత్వంలో ‘ చందమామ ‘ సినిమాలో నటించి మరింత పాపులర్ అయింది. ఇక ఆ సినిమా తర్వాత ఆమె వెనుతిరిగి చూడలేదు. తర్వాత ఎన్నో సినిమాలతో కెరీర్ లో దూసుకెళ్లిపోయింది. తర్వాత మంచి ఫామ్ లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. అయితే శంకర్ దర్శకత్వం వహిస్తున్న కమల్ హాసన్ హీరోగా నటించబోతున్న ఇండియన్ 2 సినిమాలో కాజల్ కీలక పాత్ర నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలై కొన్నాళ్లు షూటింగ్ జరుపుకొని ఆగిపోయింది. ఈ సినిమా మొదలుపెట్టినప్పటినుంచి ఏదో ఒక అడ్డంకులు వచ్చి పూర్తికాకుండా ఆగిపోయింది. ఈ సినిమా కొంత భాగం షూటింగ్ జరిగిన తర్వాత సెట్ లో ప్రమాదం జరగటం వలన నటుడు వివేక్ మృతి చెందడంతో దర్శకుడు శంకర్ కు లైక ప్రొడక్షన్స్ మధ్య అభిప్రాయం భేదాలు రావడం వలన సినిమా ఆగిపోయింది.
తర్వాత కొన్నాళ్లకు డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ తో సినిమాను చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా పూర్తి అవగానే ఇండియన్ 2 ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మరో సమస్య వచ్చి పడిందంట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను తీసుకున్నారు. అయితే ఆమె వివాహం చేసుకొని ఈ మధ్యనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే కాజల్ ప్లేస్ లో మరొక హీరోయిన్ తీసుకునే ప్లాన్లో ఉన్నారట. కాజల్ ప్లేస్ లో హిందీ టాప్ హీరోయిన్లు దీపికా పదుకొనే, కత్రినా కైపులను తీసుకోవాలని అనుకుంటున్నారని సమాచారం వచ్చింది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Kajal Agarwal : బంపర్ ఆఫర్ మిస్ చేసుకున్న కాజల్, అతడి తో జరిగిన వ్యవహారం వల్లనేనా…

అయితే ‘ ఇండియన్ 2 ‘ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ పోగొట్టుకున్న కాజల్ అభిమానులు ఎంతో బాధపడుతున్నారు. తమ హీరోయిన్ ఈ సినిమా ఛాన్స్ ని కోల్పోయిందని ఫీలవుతున్నారు. కాజల్ చివరిగా చిరంజీవి నటించిన ‘ ఆచార్య ‘ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమాలో ఆ పార్ట్ ను దర్శక నిర్మాతలు తొలగించారు. సినిమాకు పెద్దగా ఉపయోగం ఉండదు అని కాజల్ నటించిన పార్ట్ ను ను తొలగించారు. దీనివలన కాజల్ సీన్స్ తొలగించిన అభిమానులు బాధతో కామెంట్లను వ్యక్తం చేశారు. అందువల్లే ఆచార్య సినిమా ఏడు కోట్ల భారీ నష్టాన్ని చవి చూసింది అంటున్నారు.