Kajol : రాను రాను సోషల్ మీడియా అనేది మరింత దారుణంగా తయారవుతూ వస్తుంది. సోషల్ మీడియా వలన ఎక్కువ ప్రయోజనాల కంటే నష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీనిని చాలామంది మంచి కోసం కాకుండా చెడుకు ఉపయోగిస్తున్నారు. మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీలను హీరోయిన్స్ ను టార్గెట్ చేస్తూ ఆకతాయిలు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. అంతేకాక ప్రస్తుత కాలంలో పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా అనేక రకాల ఫ్యూచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక వీటన్నింటినీ ఉపయోగించుకుని పిచ్చిపిచ్చి పనులకు తెగిస్తున్నారు.
ఇలాంటివి మనం ఎప్పటికే చాలానే చూసాం. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన విషయంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఇక ఈ విషయంపై సినీ సెలబ్రిటీలతో పాటు రష్మిక కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అది జరిగి కొన్ని రోజులు కాకముందే మరో వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.అవును నిజమే రీసెంట్ గా సోషల్ మీడియాలో బాలీవుడ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది.
అయితే నిజానికి ఆ వీడియో ఉన్నది కాజోల్ కాదు . వేరే ఎవరో అమ్మాయి. కానీ వీడియో లో అమ్మాయి ఫేస్ ను మస్కింగ్ చేసి కాజోల్ మొఖాన్ని రీప్లేస్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో చూసిన జనాలు మాత్రం విపరీతంగా బూతులు తిడుతున్నారు. ఫేస్ మాస్కింగ్ పేరుతో సెలబ్రిటీల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ తిట్టిపోస్తున్నారు.