Karthika Deepam 16 September Today Episode : మోనిత ఎత్తుని తెలుసుకున్న దీప.. ఇక ఏం చేయబోతుందో చూడాలి..

Karthika Deepam 16 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1459 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… ఆశ్రమం నుంచి ఒక ఇద్దరు వచ్చి మౌనితాకి మేము మీ భర్తకి మందు ఇస్తాము తప్పకుండా గతం గుర్తుకొస్తుంది అని అంటుండగా మౌనిత మీలాంటోల్ని చాలామందిని చూశాను. డబ్బుల కోసం ఇలా చేస్తూ ఉంటారు అని అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్లు మాకు డబ్బులు ఏమీ అవసరం లేదు మేము మందు ఫ్రీగా ఇస్తాము. వారం రోజులు మీ భర్తకి గతం గుర్తుకొస్తుంది. అని అంటారు. అప్పుడు మాకు ఏమి అవసరం లేదు అని అంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్తుంది. ఇక ఇదంతా సాటుగా ఉంటున్న దీప సంతోష పడిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా.. దీప ఎదురై ఆ మందు వాడితే నిజంగా గతం గుర్తుకొస్తుందా అని వాళ్ళని అడుగుతుంది. అప్పుడు మీ తాలూకా ఎవరైనా ఉన్నారా.. తప్పకుండా గుర్తుకొస్తుందమ్మా అని చెప్తారు.

Advertisement

అప్పుడు దీప నా భర్త ఆశ్రమానికి వచ్చే పరిస్థితిలో లేడమ్మా అది తీసుకొచ్చి ఇక్కడ వాడొచ్చా అని వాళ్ళని అడుగుతుంది. అప్పుడు వాళ్లు ఆ తప్పకుండా వాడొచ్చమ్మ మా ఆశ్రమం స్వామీజీ చెప్పిన విధంగా వాడుకోవచ్చు అని చెప్తారు. అయితే నేనే వస్తాను నన్ను తీసుకెళ్లండి అని దీప అంటుంది. ఇది ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకునేది కాదమ్మా రాత్రి సమయంలో వచ్చి తెచ్చుకోవాలి అని చెప్తారు. అప్పుడు సరే అమ్మ అని అంటుంది దీప. ఇక తర్వాత దీప వచ్చి అదంతా డాక్టర్ కి చెప్తుంది. అప్పుడు డాక్టర్ ఈ ఆయుర్వేదంలో ఎంతో గొప్ప ఔషధాలు ఉన్నాయమ్మా ఇది చాలా బాగా పనిచేస్తాయి. కాకపోతే ఇది ఎవరిస్తున్నారు ఏంటి అనేది మనకి చాలా ముఖ్యం అవి తెలుసుకోవాలి అని అంటాడు. అప్పుడు దీప వాళ్ళు అడ్రస్ కూడా ఇచ్చారు అన్నయ్య ఫోన్ చేసి ఒకసారి మాట్లాడు అని అంటుంది. అప్పుడు డాక్టర్ అన్ని వివరాలను కనుక్కుంటాడు. ఆ ఆశ్రమం వాళ్లు వచ్చి మందులు తీసుకెళ్లండి అని చెప్తారు. అప్పుడు నేను వెళ్తాను అన్నయ్య వెళ్లి ఆ మందులు తీసుకొని వస్తాను అని చెబుతుంది.

Advertisement

Karthika Deepam 16 September Today Episode : మోనిత ఎత్తుని తెలుసుకున్న దీప..

Karthika Deepam 16 September Today Episode
Karthika Deepam 16 September Today Episode

అప్పుడు డాక్టర్ నీకు రెండు రోజులు టైం పడుతుంది నన్ను కూడా తోడు రమ్మంటావా అని అడుగుతాడు. అప్పుడు వద్దులే అన్నయ్య నీకు ఇబ్బంది ఎందుకు నేను వెళ్తాను కానీ నువ్వు ఆ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచు అన్నయ్య అని అంటుంది. అప్పుడు ఈ రెండు రోజులు బావగారి బాధ్యత నాది అని చెప్తాడు. కట్ చేస్తే మౌనిత కార్తీక్ తలనొప్పితో బాధపడుతుంటే తగ్గిందా అని అడిగి తన పైన ఎంతో ప్రేమ ఉన్నట్టు డ్రామా చేస్తూ ఉంటుంది. అప్పుడు నేను గతం గుర్తు తెచ్చుకోవట్లేదు అప్పుడప్పు డు అదే గుర్తుకొస్తుంది అని అంటూ బాబుని తీసుకొస్తా అన్నావ్ కదా వెళ్లి తీసుకురా అని అంటాడు. అప్పుడు మౌనిత నీకు హెల్త్ బాగోలేదు కదా ఆలోచిస్తున్నాను అని అంటుండగా.. నాకేం కాదులే నువ్వు వెళ్ళు అనగానే సరే ఈ శివ తీసుకుని వెళ్తా అని చెబుతుంది మౌనిత. కట్ చేస్తే దీప ఆశ్రమానికి వెళుతూ ఉండగా… అప్పుడు మౌనితా ఎక్కడికో బయలుదేరి పోతున్నావ్ అక్క అని అడుగుతుంది. నా భర్తకి గతం గుర్తు రాబోతుంది. ఇక తెలిసిపోతుంది ఎవరు భార్య ఎవరు భార్య కాదు అని అంటుంది. నువ్వు నా ఇంటి ఎదురుగా తిష్ట వేసి కూడా నువ్వు ఏం చేయలేకపోతున్నావు. నువ్వు ఏమి చేయలేవు అని అంటుంది మౌనిత.

అప్పుడు దీప ఛాలెంజ్ చేసి నా భర్త నా సొంతమవుతాడు. అని వెళ్తుంది. ఇక దీప వస్తు గండ ఆటో మీద ఉన్న అమ్మానాన్న టైటిల్ ని చూసి దీప సౌర్యని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు దీప, గండ దగ్గరికి వెళ్లి బస్టాండ్ కి వస్తారా అన్న అని అడగగానే ఎక్కమ్మ అని అంటాడు. అని అనగానే అంతలో జ్వాల గండకీ ఫోన్ చేస్తుంది. కొన్ని సరుకులు తీసుకురమ్మని చెప్తుంది. అప్పుడు గండ ఆవిడకి ఇస్తాను ఫోను. ఆవిడ రాస్తుంది నువ్వు చెప్పమ్మా అని అంటూ తను డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతూ ఉంటాడు దీప చెప్పమ్మా అని అనగానే.. అమ్మ గొంతులా ఉందేంటి అని సౌర్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు సౌర్య చెప్తుండగా.. దీప రాస్తుంది. తర్వాత బస్టాండ్ వచ్చింది అని గండ దిగమని చెప్తాడు. అప్పుడు దీప దిగి వెళ్తుండగా ఎక్కడికి వెళ్తున్నారు అమ్మ అని గండ అడుగుతాడు. అప్పుడు ఆశ్రమం కి వెళ్తున్నాను అని చెప్పగానే గండ అలాంటి హాస్పిటల్స్ ఇక్కడ ఏది లేదమ్మా..

మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు అని చెప్పగానే మౌనిత అన్న మాటలను గుర్తు చేసుకుంటూ అది నన్ను మోసం చేసింది. అని అనుకోని వెనక్కి తిరిగి వెళుతుంది. అప్పుడు సౌర్య ఫోన్ చేసి బాబాయ్ నాతో ఇందాకల మాట్లాడిన ఆవిడ ఫోటో పంపించు బాబాయ్ అని అంటుండగా.. గండ ఎందుకమ్మా అని అడుగుతుంటాడు. అప్పుడు సౌర్య ఆ గొంతు వింటే అమ్మ గొంతులా ఉంది బాబాయ్ అని ఉంటుంది. అప్పుడు గండ ఫోన్లో గొంతు విన్నంత మాత్రాన అమ్మ అనుకుంటే ఎలా తల్లి చాలామంది గొంతులు అలాగే అనిపిస్తూ ఉంటాయి. సరేలే ఈసారి కనిపిస్తే నేను ఫోటో తీసి పంపిస్తానులే అని చెప్తాడు. కట్ చేస్తే దీప గురించి మాట్లాడుకుంటూ ఉండగా.. దీప వస్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ మందు కోసం ఇంకా లేదా అని అంటుండగా.. దీప మందు లేదు పాడు లేదు అది నన్ను ఊరు పంపించడం కోసం ఆడిన డ్రామా అన్నయ్య అని చెప్తుంది. ఇక తర్వాత ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

Advertisement