Intinti Gruhalakshmi 16 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 16-September-2022 ఎపిసోడ్ 739 ముందుగా మీ కోసం. లాస్య తులసి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు, తులసి లాస్యతో ఇలా అంటుంది, నా జోలికి రావొద్దని నా మాజీ భర్తకి చెప్పు అనగానే,లాస్య అలాగే అనడంతో, అలాగే కాదు ముందు నీ బుర్రలో నుంచి తీసేసి, సాటి ఆడది ఎదుగుతుంటే సహాయం చెయ్యాలి, అడ్డుపడవద్దు అని చెబుతూ ఉంటుంది, అలాగే తులసి సంతోషం, కాని అని ఆగిపోతుంది, ఏంటో చెప్పు అనగానే, సామ్రాట్ గారికి నందు నీ మాజీ భర్త అని తెలుసు,అది మనసులో పెట్టుకొని మమ్మల్ని సాధిస్తాడేమో అనగానే, ఇన్నిరోజులు సామ్రాట్ గారితో పని చేస్తున్నారు, ఆయన మంచితనం ఏంటని ఇంకా అర్థం కాలేదా అని తులసి చెబుతూ ఉంటుంది, తులసి వెళ్ళిపోయాక లాస్య అనుకుంటూ ఉంటుంది ఒక్క అవకాశం రాని నీ సంగతి చెబుతాను అని, తర్వాత తులసి సామ్రాట్ చాంబర్ కి వెళుతుంది, లాస్య నన్ను కలిసింది అనగానే, ఆ విషయం పోనివ్వండి తులసి గారూ మీరు టిఫిన్ చేశారా అనగానే, మీరు తిన్నారా అనడంతో, లేదు బయటికి వెళ్ళి తిందాం వస్తారా కంపెనీ ఇవ్వడానికి అని అడగడంతో, వెళదామని తులసి అంటుంది.
Intinti Gruhalakshmi 16 September Today Episode : నందు ని ప్రశ్నించిన సామ్రాట్
ఒకవైపు నందు లాస్య కోసం ఎదురుచూస్తూ వుంటాడు ,లాస్య వచ్చి జరిగింది అంత చెప్పడంతో, నిజమేనా అని అంటాడు,లాస్య నందూకి కోపం రాకుండా, అనుగుణంగా జరిగిన విషయాన్ని లాస్య చెబుతుంది, ఇంతలో నంది కి ఫోన్ వస్తుంది. దివ్య ఫస్టుక్లాసులో పాసయింది అని, నందు సంతోషపడతాడు,తరువాత లాస్య,నందు సైట్ దగ్గర ఎదురుచూస్తూ వుంటారు, అయినా కూడా ఇంకా రాకపోవడంతో సామ్రాట్ తులసి గురించి కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు, టైమ్ సెన్స్ లేదా అని, ఇంతలో వాళ్లు వస్తారు. సామ్రాట్ అంటాడు, తులసి గారూ మీరు చెప్పిన ఐడియా ఒకసారి చెప్పండి అనడంతో, వెంటిలేషన్ నాలుగు వైపులా ఉండేలాగా గది ఉండాలి అనడంతో, అలానే ప్లాన్ చేయండి నందు అని సామ్రాట్ అనడంతో, లాస్య అంటోంది, అలా చేస్తే మనకి లాస్ కదా అని, అప్పుడు తులసి అడుగుతుంది నువ్వు కట్టుకున్న చీర ఖరీదు ఎంత అని,ట్వంటీ థౌజండ్ అని లాస్య అంటుంది. ఒక్కసారి కట్టుకునే చీర కి అంత రేటు పెట్టావు, మన దగ్గరకొచ్చే పిల్లలు ఆరోగ్యంగా ఉండటం కూడా ముఖ్యమే కదా అని ఇలా మాట్లాడుతూ ఉంటుంది.
అప్పుడు సామ్రాట్ తులసి గారు చెప్పినట్టే చేయండి అని, సైట్ మొత్తం చూపిస్తూ ఉంటాడు,ఒకవైపు తులసి ఇంట్లో అందరూ సరదాగా ఉంటారు, అప్పుడు ప్రేమ్ శృతిని పాలు తీసుకురమ్మని ఆటపట్టిస్తూ ఉండగా, తిరిగి శ్రుతినే మళ్లీ పాలలో ఉప్పు కలిపిన పాలను ఇస్తూ, ప్రేమ్ తాగేలాగా చేసి మళ్లీ ప్రేమ్ ని ఏడిపిస్తుంది, తర్వాత సైట్ దగ్గర తులసి అన్నీ పనులు చూసుకోవడాన్ని సామ్రాట్ చూస్తూ ఉంటాడు, నందు పిలిచినా కూడా పట్టించుకోడు,ఏంటి సార్ ఏదో ఆలోచిస్తున్నారు అనడంతో, ఒక మూర్ఖుడు గురించి ఆలోచిస్తున్నాను అని,దేవుడు అన్నీ ఇచ్చిన ఎలా వదులుకున్నాడో అర్థం కావట్లేదు అని ఇండైరక్టుగా అనడంతో, ఏం మాట్లాడుతున్నారు సార్ అనడంతో, డైరెక్టుగానే అడుగుతాను నేను బాస్ లాగా కాదు, ఒక ఫ్రెండ్లా అడుగుతున్నాను, అసలు నువ్వెందుకు తులసిని వదులుకున్నావు అని అనడంతో, సార్ మళ్లీ పీడకలల్ని నాకు గుర్తు చెయ్యకండి అనడంతో, ఏంటి అవి పీడకలలా ఒక్కరోజు మీ కుటుంబంతో ఉంటేనే నాకు సంతోషంగా ఉంది, నువ్వు వాటిని పీడకలలు అంటున్నావా అని నన్ను ప్రశ్నిస్తూ ఉండగా, ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.