Guppedantha Manasu 2 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 2-September-2022 ఎపిసోడ్ 545 ముందుగా మీ కోసం. రిషి, వసుధార కోసం కాలేజ్ లో వెతుకుతూ ఉంటాడు. కానీ వసుధార కనిపించదు, జగతి మహేంద్ర గౌతమి లని ఇంటికి వెళ్లమని చెప్పి, తను కాలేజ్ లోనే ఉంటాడు గెస్ట్హౌస్లో.ఆలోచిస్తూ, ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో తెల్లవారుతుంది. తరువాత కాలేజ్ కి జగతి మహేంద్ర వాళ్ళు వస్తారు. వాళ్ళని అడుగుతాడు వసుధార గురించి ఏమైనా తెలిసిందా అని, ఇంతలో పుష్ప వస్తుంది. ఎప్పుడు చూశావు వసుధారని చివరిసారి అని అడుగుతూ ఉంటాడు. లైబ్రరీకి వెళతాను అని చెప్పింది సార్ అని అంటుంది.
Guppedantha Manasu 2 September 2022 Episode : వసుధార ఎగ్జామ్ రాయగలుగుతుoదా?
ఇలా అందరూ కంగారుగా ఉంటారు.రిషి చాలా బాధగా కాలేజ్లో వెతుకుతూ ఉంటాడు. ఎలాగైనా కనిపించే వసుధార అని అనుకుంటూ వెళుతూ ఉంటాడు.అప్పుడు వసుధార దాచుకున్న కొన్ని వస్తువులు కింద పడి ఉంటాయి.అలా ఒక రూమ్లో ఉన్న వసుధార ని కనిపెట్టి, గౌతమ్ ని డాక్టర్ని తీసుకురమ్మని చెప్పి, రిషి అక్కడినుంచి వసుధార ని తీసుకెళతాడు.వసుధార ఎలాగైనా ఎగ్జామ్ రాయాలి, నీ లక్ష్యాన్ని సాధించాలి అని, ఎంతో బతిమిలాడుతూ ఉంటాడు. కానీ ఎంత ట్రై చేసినా వసుధార స్పృహలోకి రాదు.పొగరు కళ్ళు తెరువు, నన్ను ప్రిన్స్ అని అనవా,జెంటిల్ మెన్ అని అనగా, అని ఎంతో బాధగా అడుగుతూ ఉంటాడు.

నీ ఇంట్లో నువ్వు దేనికోసం ఇంట్లో వాళ్లను ఎదిరించి వచ్చావో అది నెరవేరాలి, నీ లక్ష్యం చేరుకోవాలి, కళ్ళు తెరువు అని లేపుతూ ఉంటాడు రిషి, వసుధార ని.ఎగ్జామ్హాల్లో జగతి చాలా బాధ పడుతూ ఉంటుంది. వసుధార కెరియర్ పాడైపోతుంది, ఇంతటితో ఆగిపోతుంది అని, ఇంతలో వసుధార వచ్చి, మేడమ్ క్వశ్చన్ పేపర్ అని అడుగుతుంది. ఏమైంది వసుధార, ఇలా ఉన్నావు, నువ్వు రాయగలవా అని అంటుంది. మేడం నేను రాస్తాను, ఒకరికి మాటిచ్చాను అని అంటుంది.ఇంతలో ఎగ్జామ్ హాల్ కి రిషి కూడా వస్తాడు. వసుధార స్పృహ కోల్పోతుంది. అప్పుడు రిషి, జగతి ఇద్దరూ వాటర్ ఇస్తారు వసుధార కి. నేను రాస్తాను సార్ ఎగ్జామ్ అని చెప్పి అంటుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.