Karthika Deepam 20 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1462 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కార్తీక్ నిద్రలేచి రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంతలో దీప కార్తీక్ దగ్గరికి వచ్చి మంచిగా నిద్ర పట్టిందా డాక్టర్ బాబు అని అంటుండగా… రాత్రి నేను కొంచెం మందు తాగినట్టు ఉన్నాను కదా ఆ బాగానే పట్టింది కాకపోతే కొంచెం తల పట్టినట్టుగా ఉంది. అనగానే దీప కార్తీక్ కి టీ పోసి ఇస్తుండగా… దీప వచ్చి ఆ టీ ని ఈసిరి కొడుతుంది. అప్పుడు కార్తీక్ ఏంటి వచ్చి రాగానే ఈ ఘర్షణ అని అనగానే… మౌనిత దీపని నేను లేని ది చూసి తనకు దగ్గరవుదామనుకుంటున్నావా అని.. దీప ,మౌనిత కొద్దిసేపు ఘర్షణ పడతారు. అప్పుడు కార్తీక్ ఈ బాబు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు మౌనిత ఈ బాబు కోసం వెళ్తున్న అని చెప్పాను కదా.. అప్పుడే మర్చిపోతే ఎలా అని అంటుంది.
అప్పుడు దీప ఎటకారంగా డాక్టర్ అమ్మ బాబు కోసం వెళ్ళావా అని అంటుంది. అప్పుడు మౌనిత నువ్వు ఊరికి వెళ్లావు రెండు రోజుల్లో రాను అని చెప్పావు కదే మళ్లీ ఎందుకు వచ్చావే అని దీప నీ అంటుంది. అప్పుడు వాళ్లు నన్ను ఊర్లో లేకుండా చేయాలని ట్రై చేశారు.. అదంతా ప్లాన్ అని నాకు తెలిసిపోయి నేను తిరిగి వచ్చాను అని అంటుండగా.. కార్తీక్ నిన్ను ఊర్లో లేకుండా చేయాలి అనుకున్నది ఎవరు అని అడుగుతాడు. అప్పుడు అదంతా ఒక పెద్ద కథ డాక్టర్ బాబు వదిలేయండి అని.. బాబు చాలా ముద్దుగా ఉన్నాడు అని తీసుకోబోతుండగా మౌనిత ఇవ్వదు.. అప్పుడు ఆ బాబు ఏడుస్తూ ఉంటాడు. ఎవరు ఎత్తుకున్న ఏడుపు ఆప డు.. అప్పుడు దీప కి ఒక ఐడియా వచ్చి డాక్టర్ బాబు మీరు ఎత్తుకోండి బాబు ఏడుపు ఆపుతాడు అని చెప్పగానే డాక్టర్ బాబు ఎత్తుకుంటాడు.
Karthika Deepam 20 September Today Episode : ఎటువైపు దారి తీస్తుందో చూడాలి…

అప్పుడు ఆనంద్ ఏడుపు ఆపేస్తాడు. కార్తీక్ నిజమే వంటలక్క బాబు నా దగ్గరికి రాగానే ఏడుపు ఆపేశాడు అని అంటుండగా… దీప మీకు ఆ బాబుకి ఏదో అనుబంధం ఉంది. మీకు ఏమైనా గుర్తుకొస్తుందా అని గతాన్ని గుర్తు చేయడానికి ట్రై చేస్తూ ఉండగా మౌనిత అడ్డుపడి నువ్వేంటే గతం గుర్తు చేయడానికి ట్రై చేసేది నేను తన భార్యని నేను గుర్తు చేస్తాను.. అని దీపపై మండిపడుతుంది. ఇక తర్వాత కార్తీక్ కూడా వీడు ఉంటే చాలు వీడితో సరదాగా ఆడుకుంటాను. అని తనని తీసుకొని ఇంట్లోకి వెళ్లిపోతాడు. అప్పుడు మౌనిత కూడా వెళ్తూ దీప వైపు చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోతుంది. దీప బాధపడుతూ ఇంటికొచ్చి డాక్టర్ కి ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. తను వచ్చి ఏంటమ్మా రమ్మన్నావు ఏమైంది అనగానే.. డాక్టర్ బాబు రిపోర్ట్స్ ని చూపించి బాధపడుతూ ఉంటుంది.
అప్పుడు డాక్టర్ ఆ రిపోర్ట్ ని చూసి మంచి పని చేసావ్ అమ్మ అని నువ్వు ఎందుకు బాధగా ఉన్నావు అనగానే జరిగిందంతా తనకి చెప్తుంది. అప్పుడు డాక్టర్ ఉండనీ అమ్మ తన కొడుకే కదా అని అంటాడు. అప్పుడు దీప, డాక్టర్ బాబు వల్ల కొడుకును కనలేదు అన్నయ్య దాని డాక్టర్ తెలివితేటలు చూపించి ఆ బాబుని కన్నది. అంటూ ఏడుస్తూ ఆ బాబును చూసి నా కొడుకే అంటున్నాడు డాక్టర్ బాబు అని ఏడుస్తూ ఉంటుంది. నువ్వు టెన్షన్ పడకు ఈ రిపోర్టులు ఇచ్చావుకదా.. నేను స్పెషలిస్ట్ లకి చూపిస్తాను నేను ప్రయత్నం చేస్తాను నువ్వు బాధపడకు అని అంటాడు. తర్వాత కూరగాయలు కోస్తూ ఉండగా దీప ఏలు కట్ చేసుకుంటుంది. అంతలో డాక్టర్ బాబు వచ్చి తన చేయి చూసి కంగారు పడుతూ ఉండగా… సరేగాని ఏం కాదులే గాని ఈ మీరు ఎందుకు వచ్చారు కూర్చోండి టీ తీసుకొస్తాను అని అంటుండగా…
లేదు వంటలక్క ఉదయం మీరు టీ తీసుకొచ్చి ఇస్తుండగా మౌనిక దాన్ని పడేసి నీ మీద మండిపడింది కదా.. సారీ చెబుదామని వచ్చాను అని అంటుండగా.. నేను ఇప్పుడు తీసుకొస్తాను అని దీప లోపలికి వెళ్లి బాధపడుతూ తనకి గతం గుర్తుకురాడానికి గట్టిగా ప్రయత్నం చేయాలని డిసైడ్ అయ్యి టీ తీసుకొచ్చి కార్తీక్ ఇచ్చి మీది ఏ ఊరు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఏమో అంటుండగా.. నేను మీకు గుర్తు చేయనా అని అంటూ.. దీప మీది హైదరాబాదు మీ అమ్మానాన్నలు, నీ భార్య, పిల్లలు ఉన్నారు అని అంతా చెప్తూ ఉండగా.. కార్తీక్ గతం గుర్తు చేసుకుంటూ గట్టిగా మొత్తుకుంటూ కళ్ళు తిరిగి పడిపోతాడు. అంతలో మౌనిత వస్తుంది. నా కార్తిక్ ని ఏం చేశావని దీప పై మండిపడుతూ..
వాటర్ తాపిస్తూ.. కార్తీక్ ని లేపుతుంది. అప్పుడు కార్తీక్ ఒక్కసారి గా లేచి దీప వైపు అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు మౌనిత దీపని గుర్తుపడతాడా గతం గుర్తుకొచ్చిందా అని భయపడుతూ ఉంటుంది. దీప దేవుడా నన్ను గుర్తుపట్టేలా చేయి అని అనుకుంటూ ఉంటుంది.. కార్తీక్ మాత్రం మనం ఎక్కడున్నాం ఏంటి మోనిత నాకు ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు మౌనిక మనం వంటలక్కతో మాట్లాడడానికి వచ్చాము.. అని మాట మారుస్తుంది. రెస్ట్ తీసుకోవాలి పద కార్తీక్ అని తనను తీసుకెళ్తుంది. అప్పుడు మౌనిత, దీప గతం గుర్తు రావడం కోసం గట్టిగా ప్రయత్నం చేసి ఉంటుంది అందుకే అలా జరిగింది. అని ఆలోచిస్తూ..
కార్తీక్ ని బాబుని ఇక్కడనుంచి తీసుకెళ్లాలి ఇక్కడే ఉంటే డేంజర్ అని అనుకుంటూ ఉండగా… అప్పుడు కార్తీక్ అటువైపు వచ్చి బాబు పేరేంటి అని అడగగా…అసలు పేరు చెప్పాలా వద్దా.. అని ఆలోచిస్తూ ఆనంద్ అని చెప్పగానే కార్తీక్ ఈ పేరు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది. అని అనగా మౌనిత కంగారు పడుతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో మౌనిత, దీప కార్తిక్ గతం గుర్తుకొస్తుంది అని దీప అంటూ ఉంటుంది. మౌనిత గుర్తొచ్చే ఛాన్సే లేదు అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…