Intinti Gruhalakshmi 20 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 20-September-2022 ఎపిసోడ్ 742 ముందుగా మీ కోసం. ఇంటికి వచ్చాక నందు ఆలోచిస్తూ వుంటాడు, నేను ఇంత క్రూరంగా ప్రవర్తించానా అని జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉండగా, అక్కడికి లాస్య వస్తుంది, నువ్వు నైటు ఎందుకు తాగి వచ్చావు నందు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు తప్ప ఇంకెప్పుడూ తాగవు, ఇప్పుడేమయిందని నువ్వు తాగావు నిన్న అని అడగడంతో, ఏమీ లేదు అని నందు అంటాడు. నేను చెప్పనా నాకు కారణం తెలుసు అని నిన్న సామ్రాట్ని తులసిని సైడ్ దగ్గర చూసినందుకు నువ్వు కుళ్లుతో తాగావు కదా అని అడుగుతూ, నందు పాయింట్ని తీసుకొని వస్తుంది, పాయింట్కి గ్రీజు అంటడాన్ని చూయిస్తుా, ఇది ఏంటి ఏం చేశావు అని అడిగి మొత్తం నిజాన్ని తెలుసుకుంటుంది. సామ్రాట్ కార్ బ్రేక్ తీసే అంత క్రూరంగా ఎలా ఆలోచించావు, నాకు తులసి మీద కోపం ఉంది కానీ నేను ఎప్పుడూ చంపాలని చూడలేదు, ఇదొకరకంగా హత్యాయత్నం చేసినట్టే అని అనడంతో, ఇంకెప్పుడూ చెయ్యను లాస్య అని నందు అంటాడు. ఈ విషయం ఎవరికైనా చెప్పావా నువ్వు అని అనడంతో, ఒకరికి తెలుసు అని నందు అంటాడు.
Intinti Gruhalakshmi 20 September Today Episode : యాక్సిడెంట్ విషయంలో నందుని నిలదీసిన లాస్య
ఒకవైపు హనీ కి పనిమనిషి అన్నం తినిపిస్తూ ఉండగా, తినదు నేను వెళ్లి పడుకుంటాను నాన్నా అని చెప్పి వెళ్ళిపోతుంది, దాంతో సామ్రాట్ చాలా బాధపడతాడు, సామ్రాట్, వాళ్ల బాబాయ్ తో హనీకి అమ్మ ప్రేమ లేదు బాబాయ్, తను మన ఇంట్లో పుట్టి ఎంత దురదృష్టవంతురాలో నాకు చాలా బాధగా ఉంది, జరిగిన యాక్సిడెంట్ లో ఏదైనా అయ్యుంటే పరిస్థితి ఏంటి అని, ఇన్ని రోజులు ఆలోచించలేదు కానీ, హనీ తల్లి ప్రేమ లేక చాలా బాధ పడుతుంది అని అర్థమౌతుంది బాబాయ్ అంటూ, ఇలా చాలా సేపు బాధపడుతూ ఉంటాడు. తరువాత తులసి ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అక్కడికి కుటుంబ సభ్యులందరూ వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటారు, ఇప్పుడు హనీకి బాగానే ఉంది కదా మళ్లీ ఎందుకు ఏడుస్తున్నావని తులసిని ప్రశ్నిస్తారు, బాధల్ని మోసే వారికి కష్టాలు వచ్చినా పర్వాలేదు, కానీ హని పాపం చిన్నపిల్ల తనకి అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలియదు, ఇలాంటి సమయంలో తనకు అమ్మ ప్రేమ చాలా అవసరం అని అంటూ వుండగా, అభి అక్కడ చాలా మంది పనివాళ్లు ఉంటారు కదా అని అనడంతో, పనివాళ్లు ఎప్పుడూ అమ్మ లాగా చూసుకోలేరు అని, ఇలా కుటుంబ సభ్యులు అందరూ అంటూ వుండగా, తులసి వాళ్ళ మామయ్య నేనొక నిర్ణయం తీసుకుంటాను అని హనీకి నయమయ్యేవరకు మనింట్లో తీసుకొచ్చి పెట్టుకుందాం.
మన అందరి మధ్య తను త్వరగా కోలుకుంటుంది అని అంటాడు, తెల్లవారాక లాస్య లక్కీని రెడీ చేస్తూ ఉంటుంది, స్కూల్లో సామ్రాట్ గారికి యాక్సిడెంట్ అయింది అని అంటున్నారు, నిజమేనా అమ్మ అని అనడంతో, అవును అని అనగానే, మరి నాకు చెప్పలేదేంటి హాని నా ఫ్రెండే కదా, నేను కూడా వెళ్లి చూసేవాణ్ని కదా అనడంతో, ఏం అవసరం లేదు స్కూల్కు వెళ్ళు అని నందు అంటాడు, అప్పుడు లాస్య లక్కీ స్కూల్కి వెళ్లడం లేదు, హని ని చూడడానికి వెళ్తున్నాడు అని చెబుతుంది. ఒకవైపు తులసి పాయసం చేస్తూ ఉంటుంది వంటగదిలో ఇంట్లో వాళ్లు అందరూ మెచ్చుకుంటూ ఉంటారు ఎంత బాగా చేస్తుందో అని, తులసి వాళ్ళ అత్తామామలు ఆ పాయసాన్ని తినడం కోసం, చిన్నపిల్ల ఏడుస్తూ ఉన్న వాయిస్ ని ఫోన్లో పెట్టడంతో, అందరూ ఎవరు చిన్నపిల్లలు వచ్చారా అని ఇల్లంతా వెతుకుతూ ఉంటారు బయటికి వెళ్లి, ఆ సమయంలో కిచెన్ లోకి వచ్చి తింటూ ఉంటారు రహస్యంగా, వీళ్లు ఇలా తినడాన్ని కుటుంబ సభ్యులు అందరూ రహస్యంగా చూస్తూ సరదాగా ఆటపట్టిస్తూ ఉంటారు తులసి వాళ్ల అత్తమామలను, ఇంతటితో ఈ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.