Karthika Deepam 27 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1468 హైలెట్స్ ఏంటో మనం చూద్దాం… మోనిత కారు ఆపి దిగి వెళ్తూ ఉండగా డిక్కి తీసి సౌర్య బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు మౌనిత సౌర్యను చూసి కంగారుపడుతూ సౌర్యానీ ఏంటమ్మా ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు అమ్మ నాన్నలు బ్రతికే ఉన్నారని ఇక్కడే ఉండి వెతుకుతూ ఉన్నాను అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మౌనిత అమ్మ నాన్నలు లేరమ్మ చనిపోయారు అని డ్రామాలాడుతూ ఉంటుంది. అప్పుడు శౌర్య లేదు కచ్చితంగా అమ్మ నాన్న లు బ్రతికే ఉన్నారు అని గట్టిగా అంటుంది. అప్పుడు మౌని తా నా చేతుల మీదుగా నేనే దహన సంస్కారాలు చేయించాను అని అంటుంది. అనగానే శౌర్య మీరు అబద్ధం చెబుతున్నారు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మౌని తా కార్తీక్, దీప కనపడకుండా ఉండాలని నువ్వు నాయనమ్మ తాతయ్య దగ్గరికి వెళ్లి పోమ్మా అని చెప్తూ ఉంటుంది. అప్పుడు సౌర్య ,మౌని తా చెప్పిన మాటలను నమ్మి సరే అని అంటుంది.
అప్పుడు మౌనిత పద హైదరాబాద్ బస్సు ఎక్కి వస్తాను నేను అనగానే లేదు నేను ఇక్కడే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళని కలిసి వెళ్తాను అని సౌర్య అంటుంది. ఇక సరే అక్కడే దింపుతాను పద అని అక్కడ నుంచి తీసుకొని వెళుతుంది. కట్ చేస్తే కార్తీక్ నాటకం చూడ్డానికి కూర్చొని ఉండగా పక్కన వాళ్ళు కార్తీక్ దీప ల కథ నిజంగా భార్యాభర్తల కథ అంట అని అనగానే కార్తీక్ అక్కడ్నుంచి వచ్చి దీపని తిడతాడు. ఆ క్యాప్షన్ ఏంటి నేను కార్తీక్ నువ్వు దీప మనిద్దరం భార్యాభర్తలమా.. ఇలా అందరికీ చెప్పాలనుకుంటున్నావా.. ఎందుకు ఇలా చేస్తున్నావ్ నేనిక్కడ ఉండను నీ బాగోతం ఇక్కడే అర్థమవుతుంది. అని తిడుతూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ దీప భర్త పేరు కూడా కార్తీక్ అందుకే కార్తీక దీపం అనే టైటిల్ పెట్టాను అని కార్తీక్ ని కాన్వెంట్ చేసి అక్కడ కూర్చునేలా చేస్తాడు.
Karthika Deepam 27 September Today Episode : కార్తీక్ కి గతం గుర్తొచ్చేలా చేసిన వంటలక్క…

కట్ చేస్తే సౌందర్య, ఆనంద్ రావు, హిమ నీ తీసుకెళ్తూ .. హిమ ఒక హోటల్ దగ్గర ఆపుతాను ఏం కావాలో చెప్పు అని అంటుంది సౌందర్య. అప్పుడు హిమ వద్దు నాయనమ్మ అని అంటూ ఉంటుంది. ఆనంద్ రావు ఇప్పుడు నీకు దాన్నిబట్టి ఏం అర్థమైంది హేమ అని అడుగుతాడు. అప్పుడు హిమ ఇక సౌర్య ఇంటికి రాదని అర్థమైంది నాయనమ్మ అని అంటుంది. అప్పుడు సౌందర్య సౌర్యని ఇంటికి తీసుకువచ్చే బాధ్యత నాది ఇక దాని గురించి నువ్వు మర్చిపో అని అంటుంది. కట్ చేస్తే దీప తన జీవితం ఎక్కడ మొదలైందో అక్కడినుంచి మొదలు పెడుతుంది. తన జీవితంలో ఎలా జరిగిందో అలాగే నాటకం వేస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ అదంతా చూడలేక నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటారు. పక్కన డాక్టర్ ఆపుతూ ఉంటాడు.
అప్పుడు ఆ నాటకంలో దీప కడుపులో ఉన్న బిడ్డకి నేను కారణం కాదు అని గట్టిగా మొత్తుకొని ఉండగా… కార్తీక్ ఒక్కసారిగా గతం గుర్తుకొస్తూ ఉంటుంది. స్టేజ్ పై వేస్తున్న నాటకాన్ని చూస్తూ తనకి గతంలో ఏం జరిగిందో అంత గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ దీపను ఇంట్లో నుంచి కార్తీక్ వెళ్లిపో అంటున్న ఎపిసోడ్లో దీప ఇల్లు వదిలి పోతున్న ఎపిసోడ్ చూసి కార్తీక్ గతమంతా గుర్తుకు వచ్చి దీపా వెళ్ళద్దు ఆగు దీప అని గట్టిగా అరుస్తూ స్టేజ్ దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారిగా కార్తీక్ కింద పడిపోతాడు. ఇక దాంతో దీప డాక్టర్ హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా… మౌనితా కూడా అక్కడికి వస్తుంది. అప్పుడు కార్తీక్ ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి దీప అని అంటాడు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ లో తెలుసుకోవాల్సిందే