Guppedantha Manasu 27 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 27-September-2022 ఎపిసోడ్ 566 ముందుగా మీ కోసం. జగతి రిషి దగ్గరకి వెళుతుంది, వసుధారని వదిలి పెట్టుకోకు రిషి అని అనగానే, తన చేతిలోనే ఉంది మేడమ్ అని రిషి సమాధానం చెపుతాడు, వసుధార నీ జీవితంలో ముఖ్యమైన బంధం కదా అని అనగానే, ఆ బంధాన్ని నిలబెట్టుకునే బాధ్యత ఇద్దరికీ ఉంటుంది కదా మేడమ్, నేను వసుధార కోసం ఒక అడుగు వెనక్కి వేయలేను, వసుధారనే నా కోసం ఒక అడుగు ముందుకు వేయాలి అని చెప్పడంతో, జగతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది, తరువాత రోజు జగతి వసుధార ఇంటికి వెళుతుంది. అసలు ఏం జరుగుతుంది వసుధార రిషికి నీకు మధ్య ఏం గొడవ జరుగుతుంది, అంతిమ నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది అని అంటున్నాడు అనగానే, వసుధార నిజాన్ని చెప్పేస్తుంది గురుదక్షిణ విషయాన్ని మర్చిపొమ్మని చెప్పాడు, మూడు రోజుల గడువు ఇచ్చాడు మేడమ్ అని చెప్పడంతో, ఇక ఆ విషయం గురించి మర్చిపో నన్ను అమ్మా అని పిలవకపోయినా ఫర్వాలేదు, నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, రిషి ప్రేమను దూరం చేసుకోవద్దు అని జగతి చాలా నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది.
వసుధారకి కానీ వసుధార మాత్రం వినదు, రిషి సార్ మిమ్మల్ని అమ్మా అని పిలవడం నాకవసరం, రిషి సార్ లొ మార్పు అవసరం, రిషి సార్ ని ఎలాంటి మచ్చ లేకుండా చూడాలి, నాకు అవసరం ఏ మచ్చలేని చంద్రుని లాగా రిషి సార్ ని చూడాలి మేడమ్ అని సమాధానం చెబుతుంది. ఎంత చెప్పినా వసుధార వినకపోవటంతో, జగతి అక్కడి నుంచి కోపంగా వస్తుంది, కోపంగా వస్తున్న జగతిని రిషి చూసి ఏమైంది మేడమ్కి అని అనుకుంటూ ఉంటాడు, గదిలోకి వచ్చి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది, నేను వెళ్ళిపోతున్నాను మహేంద్ర, నా కారణంగా వాళ్లు విడిపోయేలా గా ఉన్నారు, నేను వెళ్ళిపోతాను మహేంద్ర అని జరిగిన విషయమంతా మహేంద్రతో చెబుతూ ఉంటుంది జగతి, నువ్వు వెళ్ళిపోతే నేనేమైపోవాలి అని మహేంద్ర అనగానే, నేను మధ్యలోనే వచ్చాను, మధ్యలోనే వెళ్లిపోతాను అని అనగానే, అయితే నేను కూడా వస్తాను అని మహేంద్ర బట్టలు సర్దుకుంటూండగా, రిషి ఏమైపోతాడు, నా మీద కోపంతో దేవయాని అక్కయ్య రిషి ని ఇబ్బంది పెడుతుంది, రిషి ని ఇబ్బంది పెట్టొద్దు, నువ్వు రిషిని అపురూపంగా చూసుకో, తనను ఇబ్బంది పెట్టేలా, కష్టపడే లాగా నువ్వు ఎప్పుడూ ప్రవర్తించకు అని చెబుతుంది.
Guppedantha Manasu 27 September 2022 Episode : వసుధారాని నిలదీసిన జగతి
మహేంద్రతో, జగతి బట్టలు సర్దుకొని వెళుతుా ఉండగా రిషి వచ్చి ఏంటి మేడమ్ వెళుతున్నారా, మంచి నిర్ణయం తీసుకున్నారు, మీరు తెలివైన వాళ్లు అని తెలుసు కానీ ఇంత తెలివైన వాళ్లు అని తెలియదు, మీరు చిన్నప్పుడు వెళ్లి వెళ్లిపోవడానికి కారణం ఏంటో కూడా నేను అడగను, కానీ మీరు ఇప్పుడు వెళ్లడానికి కారణం నేను అంటున్నారు అంతా విన్నాను, మీకు మీరే ఏదో జరుగుతుందని ఊహించుకుంటూ దానికి నన్నే కారణంగా చూపిస్తూ, మీరు ఇంటి నుంచి వెళ్లబోతున్నారు, ఇదేంటి మేడం అని నా చిన్నప్పుడు నన్నెందుకు వద్దనుకున్నారు నాకు తెలియదు, కానీ మీరు వద్దనుకున్నా, యాడ్ మీద ప్రేమతో మీమీద గౌరవంతో మిమ్మల్ని ఇంటికి రమ్మన్నాను, మీరు వస్తాను అని నన్నడగలేదు నేనే మీ దగ్గరికి వచ్చి రమ్మని ఆహ్వానించాను.
డాడీ ఆనందంకోసం రమ్మన్నాను వచ్చారు, డాడీ కళ్లల్లో ప్రతిరోజూ సంతోషాన్ని చూస్తున్నాను, నేను సంతోషంగా ఉండటం మీకిష్టంలేదా, మీరు వెళ్లిపోతే వసుధార నాకు దగ్గరవుతుందని మీరెలా అనుకుంటున్నారు, అయినా ఒకవేళ మీరు వెళ్లాలని అనుకుంటే అది డాడ్ తోటే కలిసి వెళ్లండి, మీ ఇద్దర్నీ విడదీశాను అనే బాధ నేను తట్టుకోలేను అని అంటాడు జగతి తొ, రిషి వెళ్లిపోతూ ఉంటే అక్కడికి దేవయాని వచ్చి, ఈ అవకాశాన్ని నీను వదిలి పెట్టకుడదు అని, జగతిని ప్రశ్నిస్తూ ఉంటుంది ఎందుకు రిషి ని బాధపెడుతున్నావు, ఇలా ఇంట్లోనుంచి వెళుతున్నాను అని నాటకాలాడుతూ రిషిని బాధ పెడతావా అని అనగానే, జగతి నేను నాటకాలాడ్డం ఏంటక్కయ్యా అని అంటుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.