Keerthi Suresh : కీర్తి సురేష్ అంటే ప్రస్తుతం తెలియని సినిమా ప్రేక్షకులు ఎవరు ఉండరు. రామ్ పోతినేని తో తీసిన నేను శైలజ సినిమా ద్వారా తెలుగులో అడుగు పెట్టి తన అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. తరువాత నేను లోకల్ అనే సినిమాలో నానితో చేసిన ఈ భామ తన అందంతో ప్రేక్షకులను అలరించిందని చెప్పొచ్చు. కీర్తి సురేష్ తరువాత తెలుగులో అనేక సినిమాలతో అలరించింది. మహానటి సినిమాతో కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. మహానటి సినిమాతో కీర్తి సురేష్ ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపును మొత్తం తన వైపు తిప్పుకోగలిగింది.
సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటనకు గాను ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఆమెకు నీరాజనాలు తెలిపింది. తరువాత కీర్తి సురేష్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ మహేష్ బాబు తో నటించిన సర్కారీ వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటించి తన అందంతో మరియు అభినయంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పుడు కీర్తి సురేష్ తెలుగు తమిళ్ మరియు హిందీ భాషలలో అనేక ఆఫర్లతో దూసుకొని పోతుంది. కీర్తి సురేష్ చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీ హిట్ అవడంతో ఈమె గోల్డెన్ లెగ్ గా మారిందని చెప్పొచ్చు.

Keerthi Suresh : గుండెల్లో తీపి గాయాలు చేస్తుంది..
కీర్తి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా మారిపోయింది.. ఇంస్టాగ్రామ్ మరియు ట్విట్టర్లలో తన ఫోటో షూట్ లతో తన అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. కీర్తి సురేష్ ఇప్పుడు చేసిన ఓ ఫోటోషూట్ ప్రేక్షకులను తెగ ఆకర్షిస్తుంది. ఈ ఫోటో షూట్ లో తాను చేసిన అందాల ప్రదర్శనకు ప్రేక్షకులు అనేక రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. కీర్తి సురేష్ ఫొటోస్ చూసిన తన అభిమానులు కైపెక్కించే చూపులతో చూపు తిప్పుకొని అందంతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతుందని సోషల్ మీడియా వేదికగా అనేక కామెంట్లు పెడుతున్నారు