Keerthi Bhat : మనసిచ్చి చూడు, కార్తీక దీపం, మనసిచ్చి చూడు సీరియళ్లలో నటించిన కీర్తి భట్ బయోగ్రఫీ.

Keerthi Bhat : కీర్తి భట్ జూన్ రెండు న కర్నాటక రాష్ట్రంలో, బెంగుళూరులో జన్మించింది. కీర్తి ఒక కన్నడ అమ్మాయి. చిన్న వయసులోనే కీర్తికి డ్యాన్స్, నటన అంటే చాలా ఇష్టం. భరతనాట్యంలో కీర్తికి మంచి ప్రావీణ్యత కూడా ఉంది. నటి కావాలనే కోరికతో తన చదువు పూర్తి కాగానే మొదట కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కన్నడలోని మూడు సీరియల్స్ లో, రెండు సినిమాలలో నటించింది. 2016 లో జరిగిన ఒక పెద్ద యాక్సిడెంట్ కీర్తి భట్ జీవితాన్నే మలుపు తిప్పింది. ఆ యాక్సిడెంట్లో అమ్మా, నాన్న, అన్నయ్య ముగ్గురిని కోల్పోయింది. ఇది కీర్తి భట్ జీవితంలో ఒక చేదు జ్ఞాపకం.

Advertisement

యాక్సిడెంట్ వలన కీర్తి భట్ కోమాలోకి వెళ్లింది . అలా కొన్ని రోజులు కోమాలో ఉన్న కీర్తి భట్ ఒక రోజు కళ్ళు తెరిచి చూసే సరికి కుటుంబాన్ని కోల్పోయి అనాథలా ఉండి పోయింది. ఆ సమయంలో అయినవాళ్లు దగ్గరకు తీసుకోలేదు అందరూ దూరంగా పెట్టారు. కుటుంబాన్ని కోల్పోయిన బాధను దిగమింగుకొని, కుంగిపోకుండా మళ్లీ తన కెరియర్ ను ప్రారంభించింది . స్టార్ మా లో ప్రసారమయ్యే మనసిచ్చిచూడు సీరియల్ లో హీరోయిన్ పాత్రలో భానుగా నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఆ సీరియల్ లో ఆది, భాను జంట బాగుండటంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తర్వాత స్టార్ మా పలు ఈవెంట్స్ లో కనిపించి సందడి చేసింది. కుటుంబాన్ని పోగొట్టుకుని అనాథలా మిగిలిన కీర్తి భట్ ఒక అనాథ అమ్మాయిని దత్తత తీసుకొని జీవితం ఇచ్చింది.

Advertisement

Keerthi Bhat : కీర్తి భట్ జీవితం జీవితం అందరికీ ఆదర్శప్రాయం.

Kirti Bhatt Biography
Kirti Bhatt Biography

పాప పేరు ధను భట్. కీర్తి భట్ కి ఖాళీ సమయంలో డ్యాన్స్ చేయడం, పుస్తకాలు చదవడం అలవాటు. ఒత్తిడి గా ఫీల్ అయినప్పుడు కీర్తి భట్ ఎక్కువగా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. స్టార్ మా లో మంచి సక్సెస్ తో వెళ్తున్న కార్తీక దీపం సీరియల్ లో ఈ మధ్యకాలంలోనే జనరేషన్ ఛేంజ్ చేశారు. జెనరేషన్ ఛేంజ్ తర్వాత హీమగా ఎంట్రీ ఇచ్చిన కీర్తి భట్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. 24 గంటల బిగ్ బాస్ ఇంట్లో మా పరివార్ అనే షో లోకి కూడా వెళ్లి ఎందరినో ఆకట్టుకుంది. ఇలా వరుస షోస్, సీరియల్స్ లో బిజీగా ఉంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంటోంది. నిజ జీవితంలో కష్టాలను తట్టుకుని నిలబడి, ఒక పాపను దత్తత తీసుకొని పాపకు జీవితాన్ని ఇచ్చిన విషయం తెలుసుకున్న తన అభిమానులు అందరూ తన మంచి మనసుకి ఫిదా అయిపోయారు. కీర్తి భట్ ఇంకా ఎన్నో మంచి సీరియల్స్ చేయాలని, లైఫ్లో సక్సెస్ సాధించాలని తన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.

Advertisement