Brigida Saga : సౌత్ ఇండియాలో తెలుగు ఇండస్ట్రీ ఎంత ఫేమసో.. తమిళం ఇండస్ట్రీ కూడా అంతే ఫేమస్. కోలీవుడ్ డైరెక్టర్, యాక్టర్ పార్తిబన్ ఇటీవల ఓసినిమాలో నటించాడు. ఆ సినిమా పేరు ఇరవిన్ నిళల్. ఆ సినిమాకు దర్శకత్వం వహించింది కూడా పార్తిబనే. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియాంకా రుత్, రోబో శంకర్ తో పాటు.. బ్రిగిడ సాగా అనే నటి కూడా ముఖ్య పాత్రలో నటించింది. ఈ సినిమా ఇటీవలే జులై 15 రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది.
అయితే.. ఈ సినిమాలో బ్రిగిడ సాగా.. చిలకమ్మ అనే పాత్రలో నటించింది. ఆమె ఈ సినిమాలో నగ్నంగా నటించిన కొన్ని సీన్లు ఉంటాయి. ఆ పాత్రే చాలెంజింగ్ పాత్ర. అందుకే ఆ పాత్రలో బ్రిగిడ నటించింది. నిజానికి.. బ్రిగిడ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసేది. కానీ.. తనను పార్తిబన్.. హీరోయిన్ గా చేశాడు. ఆయన చెప్పడంతోనే ఇరవిన్ నిళల్ అనే సినిమాలో కూడా బ్రిగిడ నటించింది. అందులోనూ అది నగ్నంగా ఉండే పాత్ర.
Brigida Saga : ఇరవిన్ నిళల్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వెళ్తే.. సినిమాలో హీరోయిన్ గా చాన్స్
నిజానికి ఈ సినిమాకు బ్రిగిడ సాగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేందుకు పార్తిబన్ ను కలిసింది. కానీ.. ఆ సినిమాలో బ్రిగిడనే హీరోయిన్ గా ఎంపిక చేశాడు పార్తిబన్. ఈ సినిమాలో నగ్నంగా ఉండే ఒక సీన్ చేయాల్సి రావడంతో.. ఈ పాత్రలో నటించడానికి తన తల్లిదండ్రులను ఒప్పించడానికి బ్రిగిడ చాలా కష్టపడిందట. సినిమాలో నగ్నంగా ఉండే సీన్ కనిపిస్తుంది కానీ.. షూటింగ్ సమయంలో తను పూర్తిగా నగ్నంగా లేదు. కొంత గ్రాఫిక్స్ ను జత చేసి తనను పూర్తి స్థాయిలో నగ్నంగా కనిపించేలా చేశారు. ఏది ఏమైనప్పటికీ బ్రిగిడ డేర్ చేసి ఈ క్యారెక్టర్ ను చేసిందని తమిళ ప్రేక్షకులు తెగ మెచ్చుకుంటున్నారు.
View this post on Instagram