Mahesh Babu : విజయ్ తో మహేష్ బాబు కాంబినేషన్… ఇదే నిజమైతే బాక్సాఫీస్ బద్దలే…

Mahesh Babu : ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా చాలామంది హీరోలు మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు హీరోలకు అయితే దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడుతుంది. ఇక తమిళ హీరోలు కొందరు టాలీవుడ్ లో మంచి స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే తమిళ హీరోలలో ఒకరైన విజయ్ దళపతికు టాలీవుడ్ లో అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. అందుకనే ఈసారి విజయ్ నటించబోయే సినిమాలో మహేష్ బాబు నటించబోతున్నట్లు సమాచారం. ఈ మధ్య విజయ్ నటించిన ‘ బీస్ట్ ‘ సినిమాకు అనుకున్నంత పాజిటివ్ టాక్ రాలేదు. ఇకా ఎలాగైనా నెక్స్ట్ చేసే సినిమాలో తమిళంలోనే కాకుండా తెలుగులో మంచి విజయాన్ని అందుకోవాలని విజయ్ దళపతి చూస్తున్నారు.

దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ వారసుడు ‘. ఈ సినిమాలో విజయ్ దళపతి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా భారీ అంచనాలతో విడుదల చేయబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత షూటింగ్ అయితే పూర్తయింది. ఇక మిగిలిన షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనన్నారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

Mahesh Babu : విజయ్ తో మహేష్ బాబు కాంబినేషన్

Mahesh babu act guest role in Vijay thalapathy' s movie
Mahesh babu act guest role in Vijay thalapathy’ s movie

‘ వారసుడు ‘ సినిమాలో ఒక ముఖ్యమైన అతిథి పాత్రలో మహేష్ బాబు నటించబోతున్నట్లుగా సమాచారం.. తమిళంలో విజయ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో తెలుగులో మహేష్ బాబుకు అంతే క్రేజ్ ఉంది. కనుక వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే బాక్సాఫీస్ వద్ద ఊహించని రికార్డులు ఉంటాయని అంటున్నారు. అంతేకాకుండా మహేష్ బాబుకు కూడా తమిళంలో విజయ్ అభిమానుల నుంచి మంచి సపోర్ట్ కూడా పెరుగుతుంది. అలా చేస్తే రాజమౌళితో చేయబోయే సినిమాకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కాబట్టి సూపర్ స్టార్ మహేష్ బాబు విజయ్ దళపతి నటించబోయే సినిమాలో నటించే అవకాశం ఉంటుందని అంటున్నారు.