Rajamouli – Mahesh Babu : రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో సినిమా అంటే మామూలు విషయమా. రచ్చ రంబోలా కావాల్సిందే కదా. అందుకే.. మహేశ్, రాజమౌళి సినిమా కోసం చాలా రోజుల నుంచి అందరూ తెగ ఎదురు చూస్తున్నారు. అయితే.. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ఇంకా పూర్తి కాలేదు. కథ కూడా ఇంకా పూర్తి కాలేదు. కానీ.. సినిమా నేపథ్యం ఏంటో రాజమౌళి అప్పుడే చెప్పేశారు. అందులోనూ మహేశ్ బాబుతో సినిమా కాబట్టి.. సాహసాలు చేయడంలో మహేశ్ ఎప్పుడూ ముందుంటారు.
అందుకే మహేశ్ తో రాజమౌళి తీసే సినిమా పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ రేంజ్. ఇటీవల ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడిన రాజమౌళి.. తన రాబోయే సినిమా గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. పెద్ద బాంబే పేల్చాడు. ఇప్పటికే మేము స్క్రిప్ట్ పని మీద ఉన్నాం. నాన్న, నేను స్క్రిప్ట్ పని ప్రారంభించాం. ఇంకా దీనిపై ఎలాంటి విషయాలు చెప్పలేను కానీ.. ఈ సినిమా మాత్రం ఇండియానా జోన్స్ రేంజ్ లో ఉంటుంది. ఆ రేంజ్ అడ్వెంచర్ అయితే ఉంటుంది అంటూ రాజమౌళి.. మహేశ్ బాబు సినిమా గురించి చెప్పుకొచ్చారు.
Rajamouli – Mahesh Babu : అడ్వెంచర్ త్రిల్లర్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న రాజమౌళి
రాజమౌళికి ఎప్పటి నుంచో అడ్వెంచర్ త్రిల్లర్ సినిమా తీయాలని ఉందట. ఆ కోరిక ఇప్పుడు మహేశ్ బాబుతో తీయబోయే సినిమాతో నెరవేరుతోంది. అయితే.. ఈ సినిమా ప్రపంచాన్ని చుట్టే ఓ సాహసం అంటూ ఒక్క ముక్కలో చెప్పేశాడు రాజమౌళి. అంటే.. ఈ సినిమా జేమ్స్ బాండ్ 007 తరహా సాహసాలతో రానుందని రాజమౌళి వ్యాఖ్యలతో అర్థం అవుతోంది. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తవుతుండటంతో ఇక మహేశ్ బాబు త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు పూర్తి చేస్తే అప్పుడే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. చూద్దాం మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రపంచాన్ని ఫిదా చేస్తుందో.