Liger Movie : హిందీ పరిశ్రమలో బాయ్ కాట్ ట్రేడింగ్ నడుస్తుంది. ఈ మధ్యనే అమీర్ ఖాన్ ‘ లాల్ సింగ్ చడ్డా ‘,అక్షయ్ కుమార్ ‘ రక్షాబంధన్ ‘ తాప్సి ‘ దొబారా ‘ సినిమాలకు ఈ బాయికాట్ తగిలింది. సినిమాలను బహిష్కరించాలని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ బాయికాట్ సెగ విజయ్ దేవరకొండ ను తాకింది. విజయ్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ‘ లైగర్ ‘ ను బహిష్కరించాలంటు #BoycottLiger అనే హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, సినీ ప్రియులు ఐ సపోర్ట్ లైగర్, అన్ స్టాపబుల్ లైగర్ అనే హ్యాష్ ట్యాగ్లను ట్రెండింగ్ చేస్తున్నారు.
లైగర్ బాయ్ కాట్ అనే దాన్ని ఎందుకు ట్రెండింగ్ చేస్తున్నారు. ఇది కరణ్ జోహార్ ప్రాజెక్ట్ అనా లేక ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలకు వస్తున్న క్రేజ్ చూడలేకనా అని కొందరు విమర్శిస్తున్నారు. ఎంతోమంది ఆధారపడిన అతిపెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమాలను బాయ్ కాట్ చేయాలని పిలుపు ఇవ్వడం అర్థం లేదు అని అంటున్నారు. ఇప్పుడు ‘ లైగర్ ‘ సినిమాకు దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఏర్పడింది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఈ సినిమా టిమ్ ని చూసేందుకు ఎగబడుతున్నారు.
Liger Movie : గట్టిగా కౌంటర్ ఇచ్చిన రౌడీ స్టార్ ఫ్యాన్స్…
ఈ క్రేజ్ తట్టుకోలేని కొంతమంది బాలీవుడ్ బిగ్గెస్ట్ సినిమాలతో పాటు లైగర్ ను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ఏదేమైనా బాయ్ కాట్ ట్రెండ్ చిత్ర పరిశ్రమ కు కొత్త సమస్యగా మారింది. ఇక లైగర్ సినిమా విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ. ఈ సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 25న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాను పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్మి, కరణ్ జోహార్ ,అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా అనన్య పాండే నటిస్తుంది. ఇక ఈ సినిమా కనుక రిలీజ్ అయితే విజయ్ దేవరకొండకు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు వస్తుందని అభిమానులు అనుకుంటున్నారు.