Mahesh Babu : మహేష్ బాబు మరోసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మూవీ, మరో బ్లాక్ బస్టర్ కు త్రివిక్రమ్ ప్లాన్ సిద్ధం.

Mahesh Babu : ప్రిన్స్ మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మూవీ ఎంత సక్సెస్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా అదరగొట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మహేష్ బాబు మరోసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో త్రివిక్రమ్ ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడు అన్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వరుస హిట్ల తో ఎవరు జోరు మీద ఉన్న మహేష్ బాబు ఫ్యామిలీ ఇప్పుడు అకేషన్ లో ఫ్యామిలీతో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే, ఫారెన్ లో తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు.

Advertisement

అకేషన్ నుంచి తిరిగి రాగానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ఇంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలేజా అనే సినిమా చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్లీ ఇంకో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు మహేష్ సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు రాజకీయ నేపథ్య ఉండడంతో మహేష్ బాబు ఈ సినిమాలో ఐటి మినిస్టర్ గా కనిపించబోతున్నారు అని తెలుస్తోంది. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాలో సీఎంగా చేసి బ్లాక్ బస్టర్ అందుకోవడం జరిగింది.

Advertisement

Mahesh Babu : మరో బ్లాక్ బస్టర్ కు త్రివిక్రమ్ ప్లాన్ సిద్ధం.

mahesh babu once aagin in political back drop movie with trivkram srinivas
mahesh babu once aagin in political back drop movie with trivkram srinivas

అంతేకాకుండా మహేష్ బాబు నిర్మాతగా కూడా మేజర్ సినిమాతో బిగ్ హిట్ ని అందుకోవడం జరిగింది. ఇలా వరుస సినిమాలతో జోరు మీద ఉన్న మహేష్ రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తుండడంతో వరుస సినిమాలతో నెక్స్ట్ ప్రాజెక్ట్ లలో బిజీ అయిపోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. కొడుకు గౌతమ్ గట్టమనేని చదువు నిమిత్తం మరోసారి లండన్ వెళ్లిన మహేష్ బాబు తిరిగి రాగానే ఈ షూటింగ్స్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తెలుగుకరం దర్శకత్వంలో మహేష్ బాబు 28వ సినిమాగా హారిక హాసిని క్రియేషన్ బ్యానర్లలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతుండగా తమన్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చున్నట్లు తెలుస్తోంది.

Advertisement