Viral Video : ఢిల్లీ మెట్రోలో మరో రచ్చ…

Viral Video : ఢిల్లీ మెట్రో ట్రైన్ అంటే కేవలం ప్రయాణించడానికి మాత్రమే కాదు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి కూడా తగ్గేదెలే అంటుంది. అయితే ఢిల్లీ వాసులు ఎక్కువగా మెట్రోలో డ్యాన్సులు , స్టంట్ లు మరియు రొమాన్స్ చేయడం వంటివి చేస్తూ తెగ రెచ్చిపోతున్నారు. ఇక ఆయా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోఎన్నో వైరల్ గా మారాయి. కొన్ని జంటలు ఢిల్లీ మెట్రోలో అందరి ముందే రొమాన్స్ కూడా చేశారు. ఇక ఇటీవల ఢిల్లీ మెట్రో లో రొమాన్స్ చేసుకుంటున్న జంటకు ఓ బామ్మ వారికి వార్నింగ్ ఇచ్చిన వీడియో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరొక వీడియో వెలుగులోకి వచ్చింది. ఇక ఈ వీడియోలో ట్రైన్ లో సీట్ కోసం ఓ యువతి మరియు యువకుడు వాదించుకుంటున్నారు.

Advertisement

అయితే వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుర్రాడు మహిళ వద్దకు వచ్చి సీట్ కావాలని అడిగాడు. అలా అతను అడగడంతో వివాదం మొదలైంది. దీంతో మహిళలతో యువకుడు వాదనకు దిగాడు. ఇంతలో తన పక్కనే ఉన్న మరో మహిళ జోక్యం చేసుకొని సదరు మహిళకు మద్దతుగా నిలిచింది. దాదాపు రెండు నిమిషాల పాటు వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే అదే ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింటా హల్చల్ చేస్తుంది. ఇప్పటికే దాదాపు ఈ వీడియోను లక్ష మందికి పైగా వీక్షించారు.

Advertisement

ఇక ఈ వీడియో చూసిన నేటి జనులు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ కు ఢిల్లీ మెట్రో అడ్డా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకు ఢిల్లీ మెట్రోలోనే తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి గొడవలు సాటి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఢిల్లీ మెట్రో గురించి మనకు తెలిసిందేగా ఎప్పుడూ ఏదో ఒక ఘటనతో వార్తల లో నిలుస్తుంది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఢిల్లీ మెట్రో అధికారులు చట్టపరంగా కొన్ని నిబంధనలు పెట్టడం మంచిది.

Advertisement