Chandrababu Naidu arrest : తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి భారీ షాక్ తగిలిన విషయంం తెలిసిందే…సిఐడి నమోదు చేసిన స్కిల్స్ స్కామ్ లో టిడిపి అధినేత చంద్రబాబు లెక్క తప్పింది. లూత్ర వాదనలతో గట్టు ఎక్కుతామని భావించినప్పటికీ ఎదురు దెబ్బ తప్పలేదు. అయితే టిడిపి నేతలు మాత్రం ఇదంతా జగన్ కుట్రగా ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ వ్యవహారం వెనుక కేంద్ర పెద్దల పాత్ర ఉందని ఆసక్తికర చర్చ సాగుతుంది. పొత్తుల కోసం ప్రయత్నిస్తున్న వేళ రాజకీయ ఉత్కంఠత రోజురోజుకీ పెరుగుతుంది. స్కిల్స్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబుకు రిమాండ్ విధించడం సంచలనంగా మారింది.
అవినీతి ఆరోపణ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. సిఐడి అర్థం లేని ఆరోపణలు సెక్షన్లు నమోదు చేసిందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. కానీ ఇరుపక్ష వాదనలను విన్న న్యాయస్థానం మాత్రం సిఐడి చేసిన సెక్షన్లను పరిగణలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించింది.ఈ నేపథ్యంలో రాజకీయంపై భిన్నమైన చర్చలు మొదలయ్యాయి. ఈ వ్యవహారం వెనుక సీఎం జగన్ ఉన్నట్లు టిడిపి టార్గెట్ చేస్తుంటే..ఇక దీని వెనక ఢిల్లీ పెద్దల మాస్టర్ స్కెచ్ ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలోని అమిద్ షా వంటి ముఖ్యుల మద్దతు లేకుండానే ఈ అరెస్టు జరిగిందని సిబిఐ నేతలు ఆరోపిస్తున్నారు. అటు చంద్రబాబు బిజెపితో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో వారి మద్దతుతోనే చంద్రబాబు అరెస్టు జరగడం టిడిపి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్టు వెనుక మోడీ మరియు అమిత్ షా మద్దతు ఉందని సిబిఐ నేత నారాయణ అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బిజెపి వర్గాలను నమ్మవద్దని దూరంగా ఉండాలంటూ సూచించారు. అయితే ఒకవైపు టీడీపీ జనసేన పొత్తు కొనసాగుతుంది. ఈ సమయంలో టిడిపిని తమతో కలుపుకొని వెళ్లాలనేది పవన్ ఆలోచన. ఈ సమయంలో చంద్రబాబు అరెస్టు దుమారం లేపుతోంది.
అయితే జగన్ ను ఓడించేందుకు చంద్రబాబు బీజేపీతో కలిసి పావులు కదుపుతున్నారు. ఈ సమయంలోనే జగన్ అలర్ట్ అయ్యాడు. చంద్రబాబు అవినీతిని తెరపైకి తీసుకువచ్చి , మద్దతు కోసం ముందుకు వచ్చే పార్టీలను వెనక్కి వెళ్లేలా చేశాడు. అంతేకాక చంద్రబాబు అరెస్ట్ వెనుక బిజెపి నాయకులు ఉన్నారని వార్తలు రావడంతో ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇక ఈ పరిణామాలలో చంద్రబాబు రానున్న రోజుల్లో ఏవిధంగా స్పందిస్తారో, బిజెపి విషయంలో ఏం చేయబోతున్నారో అనేది ఆసక్తికరంగా మారింది.