Maniratnam : ఈ నగల వెనుక ఇంత పెద్ద మ్యాటర్ ఉందా… నిజంగా మణిరత్నం గ్రేట్…

Maniratnam : ప్రస్తుతం పోనియన్ సెల్వన్ సినిమా పేరు బాగా పాపులర్ అవుతుంది. అటు కోలీవుడ్లో ఇటు టాలీవుడ్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన లుక్కు, ట్రైలర్, టీజర్ రిలీజ్ అయ్యాక ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగాయి. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేసింది మణిరత్నం కావడంతో బిగ్ స్టార్స్ కూడా ఈ సినిమా భారతీయ చరిత్రను తిరగరాస్తుంది అని అంటున్నారు. ఈ సినిమాలో హీరో విక్రమ్, ఐశ్వర్యారాయ్, త్రిష, కార్తీ నటిస్తున్నారు. ఇలా బిగ్ స్టార్స్ అందరూ నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ త్రిష మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించిన ఒక విషయాన్ని లీక్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట్లో చెక్కర్లు కొడుతుంది. పోనియన్ సెల్వన్ సినిమా కథ రాజుల కాలం నాటిది. ఈ క్రమంలో సినిమా మొత్తం ఆ లుక్ లో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడట డైరెక్టర్. అయితే త్రిష మాట్లాడుతూ ఈ సినిమాలో తాను చోళపు దేశ రాజకుమారి కుందవై పాత్రలో నటించబోతున్నానని, కచ్చితంగా నా పాత్ర మీకు నచ్చుతుందని, అలా మణిరత్నం డిజైన్ చేశారని చెప్పుకొచ్చింది.

Maniratnam : ఈ నగల వెనుక ఇంత పెద్ద మ్యాటర్ ఉందా…

Maniratnam behind the secret of jewelry for that movie
Maniratnam behind the secret of jewelry for that movie

అలాగే కుందవై పాత్ర పట్ల చాలా శ్రద్ధ తీసుకున్నామని మరీ ముఖ్యంగా కాస్ట్యూమ్స్ విషయంలో మణిరత్నం చాలా శ్రద్ధ తీసుకున్నారని చెప్పుకొచ్చింది. దానికోసం ఓ టీమ్ ను ప్రత్యేకించి ఏర్పాటు చేసి తమ దుస్తులను నగలను డిజైన్ చేశారని కుందవై పాత్రలో వేసుకున్న నగలను ఒరిజినల్ వి అని, మణిరత్నం నిజంగా ఒరిజినల్ వి తీసుకొచ్చారని త్రిష చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఈ సినిమా దాదాపుగా 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కపోతుంది. ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.