Viral Video : మూఢనమ్మకాలు ఇంకా ఉన్నాయా? ఇంకా జనాలు పాటిస్తున్నారా? అంటే అవుననే చెప్పుకోవాలి. మనం ఎంత ముందుకు వెళ్లినా.. అభివృద్ధిలో ముందున్నా.. టెక్నాలజీ డెవలప్ అయినా.. ఇంకే విషయంలో అయినా సరే మూఢనమ్మకాలు అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దానికి నిదర్శనమే ఈ వీడియో. ఈ ఘటన యూపీలో చోట చేసుకుంది.

సిటీ అయినా.. పల్లెటూరు అయినా ఎక్కడైనా సరే.. ఇంకా ఈ మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. ఇంకా జనాలు ఈ మూఢనమ్మకాలను పట్టుకొని వేలాడుతున్నారు. తాజాగా ఉన్నావ్ లో ఓ వ్యక్తి తనకు తానే సమాధి చేసుకున్నాడు. సాధువులు చెప్పారని అతడు తనను తానే సమాధి చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video : స్థానికులు చూసి పోలీసులకు తెలపడంతో అసలు విషయాలు వెలుగులోకి
లోకల్ లో ఉండే ఓ హిందూ పూజారి చెప్పాడని.. 6 అడుగుల గొయ్యి తవ్వుకొని అందులో ఆ వ్యక్తి తనను తాను సమాధి చేసుకున్నాడు. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడానికి ముందు రోజు అలా సమాధిలో ఉంటే.. కొన్ని శక్తులు వస్తాయని ఆ పూజారి చెప్పాడని అతడి మాటలు నమ్మి అతడు సమాధి అయ్యాడు. అతడి సమాధి పక్కనే ఆ పూజారి పలు పూజలు కూడా నిర్వహించాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని సమాధిని తవ్వి అందులో ఉన్న వ్యక్తిని బయటికి తీశారు. అలాగే.. అక్కడ పూజలు చేస్తున్న పూజారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశివాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాజ్ పూర్ గ్రామానికి చెందిన శుభమ్ గోస్వామిగా అతడిని గుర్తించి అతడిపై కేసు నమోదు చేశారు. ఇంకా ఈ ఘటనతో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు పూజారులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి వామ్మో.. ఇంత గుడ్డిగా నమ్మి ఇలాంటి పనులు చేస్తారా? అంటూ ఆ యువకుడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
यूपी के उन्नाव में एक युवक को पुजारी ने पट्टी पढ़ाई कि “तुम ज़मीन के अंदर भू समाधि ले लो बहुत धन प्राप्त होगा” फिर युवक को 6 फुट गढ्ढा खोद कर गाड़ दिया गया … पुलिस को पता चला तो युवक को भू समाधि से निकाला और अब पुजारी और युवक दोनों जेल में हैं @ndtv pic.twitter.com/B2IfFjRSgw
— Saurabh shukla (@Saurabh_Unmute) September 27, 2022