Sudigali Sudheer : రష్మి తో పెళ్లి .. క్లారిటీ ఇచ్చిన సుడిగాలి సుధీర్..

Sudigali Sudheer  : బుల్లితెర మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ షో ద్వారా చాలామంది కమెడియన్స్ వెండితెర మీద కనిపిస్తున్నారు. మరి ముఖ్యంగా సుడిగాలి సుధీర్ ఏకంగా హీరోగా వెండితెర మీద బిజీ అయిపోయారు. ‘ సాఫ్ట్ వేర్ సుధీర్ ‘ సినిమాతో ప్రేక్షకులను అలరించిన సుడిగాలి సుధీర్ ఆ తర్వాత ‘ గాలోడు ‘ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు. దీంతో సుధీర్ సినిమాల స్పీడ్ పెంచారు. తాజాగా ‘ కాలింగ్ సహస్ర ‘ అనే సినిమాలో నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాని అరుణ్ విక్కిరాల దర్శకత్వ వహించారు. హీరోయిన్ గా డాలిషా నటించారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు చిత్ర యూనిట్.

marriage-with-rashmi-sudheer-gave-clarity

ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సుధీర్ సమాధానం ఇచ్చారు. మీరు రష్మీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడగ్గా… నేను అసలు పెళ్లే చేసుకోను.. ప్రస్తుతం నాకు కెరియర్, ఫ్యామిలీ ఇంపార్టెంట్.. ఒకవేళ భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకుంటాను..లేదంటే లేదు.. ప్రేక్షకులను అలరించడానికి మాత్రమే రష్మితో అలా చేశాను, కానీ మా మధ్య అలాంటిదేమీ లేదు అని చెప్పుకొచ్చారు. అలాగే రష్మీ హీరోయిన్ గా మీరు ఎప్పుడు సినిమా చేస్తున్నారు అని అడగ్గా… నేను, రష్మీ కథలు వింటున్నాం..మా ఇద్దరికీ కామన్ గా నచ్చిన కథ ఇప్పటివరకు దొరకలేదు. ఒకవేళ అలాంటిది దొరికితే మేమిద్దరం కలిసి కచ్చితంగా నటిస్తాం అని సుడిగాలి సుధీర్ అన్నారు.

ఇక ‘ కాలింగ్ సహస్ర ‘ సినిమా గురించి చెబుతూ ఈ రోజుల్లో ఒక్క సినిమా హిట్ అయితే దానికి కారణం కథ. ఈ సినిమాకు కూడా అదే బలం. సుధీర్ ను దృష్టిలో పెట్టుకొని కాకుండా ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలని వెళితే ఈ సినిమా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇది నా మూడో సినిమా. నా సినిమాతో నిర్మాతలకు లాభాలు వస్తే చాలు. అలాగే వచ్చిన జనాలు కూడా సినిమా గురించి పాజిటివ్గా మాట్లాడితే సంతోషిస్తా అని సుధీర్ చెప్పుకొచ్చారు. అయితే సుధీర్, రష్మీ పెళ్లి చేసుకోరని మరోసారి సుడిగాలి సుధీర్ క్లారిటీ ఇచ్చారు. అయినా కానీ అభిమానులు మాత్రం వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నారు.