Sitara Ghattamaneni : సితార హీరోయిన్ గా ఎంట్రీ ఆ స్టార్ హీరో కొడుకు తోనే… ఫ్యాన్స్ కొత్త డిమాండ్ ..

Sitara Ghattamaneni  : ఇటీవల సినీ అభిమానులు సెలబ్రిటీల అన్ని విషయాలలో దూరుతున్నారు. ఎవరికి రాని ఆలోచనలన్నీ అభిమానులకు ఎలా వస్తాయో తెలియడం లేదు. మొన్నటికీ మొన్న రామ్ చరణ్, ఉపాసనల కుమార్తె క్లీంకార ను అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ కి ఇచ్చి పెళ్లి చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ల మీద ఎంత అభిమానం ఉన్న ఇలా వ్యక్తిగత జీవితాలలోకి దూరటం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇక తాజాగా మరోసారి అలాంటి కామెంట్స్ నే వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార త్వరలోనే ఇండస్ట్రీలోగే హీరోయిన్గా అడుగుపెట్టబోతుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

sitara-heroin-entry-to-that-star-hero-son

Advertisement

మహేష్ బాబు కూడా ఓ ఈవెంట్లో తన కూతురుకు ఏది నచ్చితే అది చేయిస్తామని, ఆమె సినిమా ఇండస్ట్రీ లోకి రావాలనుకుంటే తన ఇష్టాన్ని గౌరవిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇదే న్యూస్ నెట్టింటా వైరల్ అవుతుంది. ఒకవేళ సితార ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా అడుగుపెడితే ఏ హీరో తో ఎంట్రీ ఇస్తారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే చాలామంది సితార హీరోయిన్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ తోనే ఎంట్రీ ఇవ్వాలని, వీరిద్దరి కాంబినేషన్ తెరపై అద్భుతంగా ఉంటుందని, ఈ జంట ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు.

sitara-heroin-entry-to-that-star-hero-son

అయితే అభిమానులకు కోరిక ఉన్న ఇది జరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే అకిరా నందన్ సినిమాలోకి వస్తాడనే నమ్మకం లేదు. ఒకవేళ వచ్చిన సితారతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తాడని చెప్పలేం. అసలు సితార, అకిరా ఇండస్ట్రీలోకి వస్తారో లేదో చెప్పలేం. మరికొంతమంది మాత్రం సితార, ఆకిరా కాంబినేషన్ సెట్ అవ్వదు అంటున్నారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం. ఫ్యాన్స్ అనుకున్నట్లుగానే సితార అకిరా నందన్ సినిమాతోనే ఎంటర్ ఇవ్వాల్సి వస్తుందేమో మరీ. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.

Advertisement