Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అటు క్లాస్‌ల ఇటు మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ‘ ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాను భారీ అంచనాలతో తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమా కోసం డైరెక్టర్ కొరటాల క్యాస్టింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో కొంతమంది బాలీవుడ్ నటీనటులు కూడా నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హీరోయిన్ విషయంలో ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. అయితే కొరటాల ఈ సినిమాలో మరొక ముఖ్యమైన పాత్ర కోసం ఒక ప్రముఖ హీరోని సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఇక అతను ఎవరో కాదు మెగా హీరో అని తెలుస్తుంది. ఇదివరకే ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటించిన ఎన్టీఆర్ కు మంచి స్నేహం ఏర్పడింది. ఇక అంతకుముందే మరి కొంతమంది మెగా హీరోలతో ఎన్టీఆర్ కు మంచి అనుబంధమే ఉంది. ఇక అందులో సాయిధరమ్ తేజ్ కు కూడా ఎన్టీఆర్ తో మంచి స్నేహం ఉంది.అయితే కొరటాల దర్శకత్వ వహించబోయే ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో అతను ఎన్టీఆర్‌కు బావమరిదిగా కనిపిస్తాడు అని సమాచారం. అలాగే ఆ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని, అలాగే ఎమోషనల్ గా కూడా ఉంటుందంట.
Jr. NTR : ఎన్టీఆర్ సినిమాలో ఊహించని క్యారెక్టర్ లో మెగా హీరో

ఇదివరకే డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాలో ఆ పాత్రకి వేరే హీరోలను అనుకున్నాడు. కానీ ఫైనల్ గా సాయి ధరంతేజ్ పై అందరూ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చి అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి వచ్చే సంవత్సరం వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు కొరటాల.