మెగా హీరో పెళ్లి ఫిక్స్ .. చివరికి ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాడుగా ..!!

త్వరలోనే మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మ్రోగనున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ముకుంద సినిమాతో హీరోగా అడుగుపెట్టిన వరుణ్ తేజ్ వరుస సినిమాలు చేస్తూ తన పేరును పాపులర్ చేసుకుంటున్నాడు. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న వరుణ్ తేజ్ గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించిన వరుణ్ త్వరలోనే ఆమెను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ క్రమంలోనే వారి ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ అయిందట. ఈనెల 9న హైదరాబాదులో వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరగబోతుంది.

Advertisement

ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు కొంతమంది అతిధులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న వీరిద్దరూ జూన్ 1 హైదరాబాద్ చేరుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి నిశ్చితార్థంపై మెగా ఫ్యామిలీ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఇటీవల వరుణ్ తేజ్ ఇటలీలోని రోమ్ నుండి దిగిన ఫోటోలను పోస్ట్ చేశాడు. ఇక లావణ్య కూడా తాను పర్యటనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టింది. దీంతో వీరిద్దరూ కలిసి ప్రయాణాలు చేస్తున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
Mega hero Varun tej marriage news
Mega hero Varun tej marriage news

ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ వీరిద్దరి ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేసిందని టాక్ వినిపిస్తుంది. ఇకపోతే వీరిద్దరూ కలిసి మిస్టర్ సినిమాలో నటించారు. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ షూటింగ్ సమయంలో వరుణ్, లావణ్య మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అప్పటినుంచి వీరు క్లోజ్ గా మూవ్ అవుతున్నారని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు.

Advertisement