Tollywood : గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి పడట్లేదని వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ అల్లు అర్జున్ ని ప్రమోట్ చేసే విషయంలో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు వచ్చాయని ప్రచారం జరుగుతుంది. చిరంజీవి ఖైదీ నెంబర్ 150, సైరా సినిమాల ముందు వరకు రామ్ చరణ్ సినిమా కథలు ఎంపిక చేసే బాధ్యతను అల్లు అరవింద్ కి అప్పగించారు. ఆ టైంలో రామ్ చరణ్ కు వరుస ప్లాప్ లు పడడంతో కథలు వినే బాధ్యతను అరవిందు నుంచి తప్పించి చరణ్ సినిమా కథలను కూడా చిరంజీవిని వీని ఓకే చేస్తున్నారు.
ఆ తర్వాత టాప్ ర్యాంక్ కోసం జరుగుతున్న పోటీలో రామ్ చరణ్ అల్లు అర్జున్ మధ్య పెద్ద వార్ జరుగుతుంది. గత రెండేళ్లుగా చూస్తుంటే బన్నీ నందమూరి హీరోలకు బాగా దగ్గరవుతున్నట్లు కనిపిస్తుంది. ఎన్టీఆర్ బన్నీ బావా బావా అని ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. ఒకరి సినిమా రిలీజ్ అయినప్పుడు మరొకరు అభినందనలు చెప్పుకుంటున్నారు. అదే నందమూరి బాలయ్యను అల్లు ఫ్యామిలీ తీసుకొచ్చి అన్ స్టాపబుల్ టాక్ షో చేయించారు. ఈ షో హిట్ అవడంతో బాలయ్య అల్లు బంధం మరింత బలంగా మారింది.
Tollywood : అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి దూరం పెరగనుందా…

అయితే తాజాగా చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కొన్నాళ్ల క్రితం అల్లు అరవింద్ స్టూడియోస్ పేరిట స్టూడియో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ గండిపేట దగ్గరలో ఈ స్టూడియో నిర్మాణం ప్రారంభించారు. త్వరలో దీని ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టారు. అయితే ఈ స్టూడియో ను చిరంజీవి అల్లు అరవింద్ చేతుల మీద ప్రారంభించబోతున్నారట. దీని ద్వారా ఈ రెండు ఫ్యామిలీల మధ్య పుకార్లు నిజం కావని అందరికీ తెలుస్తుంది.