Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నిజంగానే పేరు మార్చుకున్నారా. క్లారిటీ ఇచ్చిన గాడ్ ఫాదర్ టీం.

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వర్షం సినిమాలతో ఇండస్ట్రీలో యువ హీరోలతో పోటీపడుతూ గాడ్ ఫాదర్ మరియు బోలా శంకర్ ఇంకా వాల్టేరు వీరయ్య అనే సినిమాలతో బిజీగా ఉన్నాడు. గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి ఫస్ట్ లుక్ ని డిలీట్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ లుక్ లో చిరంజీవి స్టైల్ మరియు తన న్యూ లుక్ తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మెగాస్టార్ ఈ సినిమా కోసం రిలీజ్ చేసిన పోస్టర్ లో తన ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అయితే ఈ ఫస్ట్ లుక్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి పేరు లో చిరంజీవిలోని ఇంగ్లీష్ అక్షరాలైనటువంటి డబల్ e ఉండాల్సిన చోట త్రిబుల్ e ఈ వీడియోలో కనిపించడం జరిగింది. అయితే దీంతో చిరంజీవి తన పేరు మార్చుకున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ పేరు మార్పు వెనక చిరంజీవి పేరుకు సంబంధించిన చిరంజీవి పేరుకు సంబంధించిన న్యూమారాలజిస్టులు సలహా ఉందని అందుకే పేరు మార్చుకున్నట్లు పుకార్లు నెట్టింటే షికారు చేశాయి.

Megastar Chiranjeevi : క్లారిటీ ఇచ్చిన గాడ్ ఫాదర్ టీం.

megastar chiranjeevi really changed his name
megastar chiranjeevi really changed his name

ఈ వీడియోలో అసలు పేరు Megastar Chiranjeevi కాగా Megastar Chiranjeeevi గా కనిపించడం జరిగింది. తద్వారా సోషల్ మీడియాలో పుకార్లు ఊపొందుకోవడం జరిగింది. గాడ్ ఫాదర్ సినిమా ఫస్ట్ లుక్ వీడియోలో వచ్చిన ఈ మిస్టేక్ గురించి ఆ చిత్ర బృందం క్లారిటీ ఇవ్వడం జరిగింది. గాడ్ ఫాదర్ వీడియో ఎడిటింగ్ టైం లో జరిగిన చిన్న తప్పుగ కారణంగా ఇలా జరిగింది అని చిరంజీవి పేరులో e లెటర్ ని యాడ్ చేయడం చిత్ర బృందం వాళ్ళు చూసుకోలేదని చెప్పినట్లుగా సినిమా వర్గాలు వెల్లడించాయి. అలా జరిగిన వీడియోను ఇప్పుడు ఎడిట్ చేసి పూర్వం ఉన్న పేరుని తాజా వీడియోలో చేర్చడం జరిగింది. ఈ విధంగా చిరంజీవి పేరు మార్చుకోవటంపై క్లారిటీ ఇవ్వటం జరిగింది.