Liger Team : ప్రతిష్టాత్మకంగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా తెరకేక్కిస్తున్న చిత్రం లైగర్. ఈ చిత్రం లో బాక్సింగ్ ఆటగాడు మైక్ టైసన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. లైక్ సినిమాలో మైక్ టైసన్ ఒక ప్రముఖ పాత్ర చేస్తున్నట్లు మనకు తెలియ జేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్న సంగతి మనందరికీ తెలిసిందే.
లైగర్ మూవీ తెలుగు హిందీ తమిళ్ మలయాళం కన్నడ లాంగ్వేజస్ లో థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. ఇది ఇలా ఉండగా మైక్ టైసన్ బర్త్ డే సందర్భంగా ఆయనకు టైగర్ టీం ఒక స్పెషల్ వీడియో ద్వారా పోస్ట్ చేసి అతన్ని సర్ప్రైజ్ చేశారు. ఈ వీడియోలో మైక్ టైసన్ కు తన బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ వీడియోలో ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది. ఈ సినిమా నిర్మాత అయినటువంటి కరణ్ జోహార్ మరియు విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే, ఛార్మి అందరితో పాటుగా పూరి జగన్నాధ్ బర్త్ డే విషెస్ చెప్పడం జరిగింది.
Liger Team : బర్త్ డే విషెస్ స్పెషల్ వీడియో వైరల్.

ఈ వీడియోలో మైక్ టైసన్ ఉద్దేశించి కరణ్ జోహర్ మిమ్మల్ని చూసి ప్రపంచమంతా గర్విస్తుంది హ్యాపీ బర్త్ డే మైక్ టైసన్ అంటూ ఆయన అతని పొగడ్తలతో ముంచెత్తాడు, అంతే కాకుండా అంతేకాకుండా మైక్ టైసన్ చేసిన కొన్ని సీన్స్ ని ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతూ మైక్ టైసన్ చేసిన కొన్ని షూటింగ్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో మన ముందుకు వస్తున్నటువంటి ఈ సినిమా ఆగస్టు 25న న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.